spot_img
Homeజాతీయ వార్తలుModi Cabinet 2024: మోదీ 3.0 లో మంత్రి పదవులు వీళ్ళకే.. తెలుగు రాష్ట్రాల్లో ఆ...

Modi Cabinet 2024: మోదీ 3.0 లో మంత్రి పదవులు వీళ్ళకే.. తెలుగు రాష్ట్రాల్లో ఆ అదృష్టవంతులు ఎవరంటే?

Modi Cabinet 2024: మరికొద్ది క్షణాల్లో భారతదేశానికి మూడోసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు నరేంద్ర మోదీ సిద్ధమవుతున్నారు.. 2014, 2019 సార్వత్రిక ఎన్నికల్లో సొంతంగానే మెజారిటీ సాధించిన భారతీయ జనతా పార్టీ.. ఈసారి ఆ మ్యాజిక్ కొనసాగించలేకపోయింది. మెజారిటీకి కొన్ని సీట్ల దూరంలో నిలిచిపోయింది. ఈ క్రమంలో భాగస్వామ్య పక్షాలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధం చేసింది. ఇటీవల భాగస్వామ్య పార్టీల అధినేతలతో నరేంద్ర మోదీ సమావేశమయ్యారు. మంత్రివర్గ కూర్పును అక్కడే దాదాపుగా పూర్తి చేశారు. అయితే కీలక శాఖలైన హోం, ఆర్థిక, రక్షణ, విదేశీ వ్యవహారాలను బిజెపి తన వద్ద అట్టిపెట్టుకుని ఉంది. మిగతా శాఖలను భాగస్వామ్య పార్టీలకు కేటాయించింది.

మూడోసారి కొలువు తీర బోయే మోదీ ప్రభుత్వంలో రాజ్ నాథ్ సింగ్ మంత్రిగా ప్రమాణం చేయబోతున్నారు. ఆయనకు ఈసారి కూడా రక్షణ మంత్రిత్వ శాఖ బాధ్యతలు అప్పగిస్తారని ప్రచారం జరుగుతోంది.. ఈయనతో పాటు అమిత్ షా, నితిన్ గడ్కరి, జై శంకర్, నిర్మల సీతారామన్, ధర్మేంద్ర ప్రధాన్, హర్దీప్ సింగ్ పూరి, పీయూష్ గోయల్, జ్యోతిరాదిత్య సింధియా, అశ్వనీ వైష్ణవ్, మన్ సుఖ్ మాండవియా, సీఆర్ పాటిల్, కిరణ్ రిజిజు కు కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కుతుందని తెలుస్తోంది. వీరు మాత్రమే కాకుండా శివరాజ్ సింగ్, జేపీ నడ్డా ను కూడా కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకుంటారని తెలుస్తోంది. నడ్డా ప్రస్తుతం బిజెపి జాతీయ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. పార్టీ కార్యకలాపాలను వేరే నాయకుడికి అప్పగించి, ఆ స్థానం నుంచి నడ్డాను రిలీవ్ చేస్తారని తెలుస్తోంది. వీరు మాత్రమే కాకుండా అర్జున్ మేఘవాల్, మనోహర్ లాల్ ఖట్టర్, రావు ఇంద్రజిత్ సింగ్, భూపేంద్ర యాదవ్, ఎల్ మురుగన్, ప్రహ్లాద జోషి, శోభ కర్లాంద్లజే, నిము బెన్ బంబానీయా, జువల్ ఒరం, సోమన్న, కమలాజిత్ సెహర్వాకాత్ వంటి నాయకులకు అవకాశం దక్కుతుందని తెలుస్తోంది. అయితే ఈసారి అనురాగ్ ఠాకూర్, పురుషోత్తం రూపాలాకు చోటు లభించడం అనుమానమేనని ప్రచారం జరుగుతోంది.

బిజెపికి భాగస్వామ్య పార్టీలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో.. ఈసారి తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా ఐదుగురికి మంత్రివర్గంలో చోటు దక్కుతుందని ప్రచారం జరుగుతోంది. టిడిపి నుంచి రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, బిజెపి నుంచి శ్రీనివాస వర్మ కు కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కిందని తెలుస్తోంది. తెలంగాణ భారతీయ జనతా పార్టీ నుంచి గెలుపొందిన కిషన్ రెడ్డి, బండి సంజయ్ వంటి వారిని ఈసారి కేంద్రమంత్రి వర్గంలో తీసుకుంటున్నామని ప్రధానమంత్రి కార్యాలయం నుంచి వారికి ఆహ్వానం అందింది.. కూటమి పార్టీల నుంచి కుమారస్వామి (జెడిఎస్), చిరాగ్ పాశ్వాన్, రామ్ నాథ్ ఠాకూర్, జితన్ రాం మాంఝీ, జయంత్ చౌధరి(ఆర్ఎల్డీ), అనుప్రియ పటేల్, ప్రతాప్ రావు జాదవ్ (శివసేన- షిండే), లలన్ సింగ్, రామ్ దాస్ అథవలె (రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా) వంటి వారి పేర్లు ప్రచారంలో ఉన్నాయి.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Dhruv Vikram:

Dhruv Vikram: కోటి రూపాయిలు తీసుకొని మోసం చేసిన ధృవ్ విక్రమ్.. ఫిర్యాదు నమోదు.. పూర్తి వివరాలు మీకోసం..

Dhruv Vikram: గత కొద్దిరోజుల నుండి తమిళ స్టార్ హీరో విక్రమ్ తనయుడు ధృవ్ విక్రమ్ పేరు సోషల్ మీడియా లో ఒక రేంజ్ లో మారుమోగిపోతుంది. గత కొంతకాలం నుండి...
Telangana ACB

Telangana ACB: తెలంగాణ ఏసీబీ: పాముల వేట ముగిసింది.. అనకొండల హంట్ మొదలవుతోంది..

Telangana ACB: పుట్టల నుంచి పాములు బయటికి వస్తున్నాయి. ఆ పాముల వేట కూడా కొద్ది రోజులుగా ఆటంకం అనేది లేకుండా సాగుతోంది. అయితే ఇప్పుడు పాముల గుట్టు తెలిసిపోయింది. పాములు...
Ravi Prakash

Ravi Prakash: టీవీ9ను కొట్టేసిన రవి ప్రకాష్..

Ravi Prakash: మెరుగైన సమాజం అనే ట్యాగ్ లైన్ తో సరిగా దశాబ్దాల క్రితం రవి ప్రకాష్ శ్రీ ని రాజుతో కలిసి టీవీ9 అనే మహా సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు....
Narendra Modi Strategy

Narendra Modi Strategy: ఢిల్లీ కాక్రోచ్‌లపై మోదీ హిట్‌ వ్యూహం.. దెబ్బకు దిగొచ్చిన ఆందోళనకారులు!

Narendra Modi Strategy: నీట్‌ పేపర్‌ లీకేజీకి వ్యతిరేకంగా ఢిల్లీలో మొదలైన ఉద్యమం క్రమంగా దేశంలోని పలు ప్రాంతాలకు విస్తరించింది. ఢిల్లీలో సీజేపీ నాయకత్వంలో సాగుతున్న ఈ ఆందోళనకు ఇతర రాష్ట్రాల్లో రాజకీయ...
SS Rajamouli

SS Rajamouli: వారణాసి బడ్జెట్ పెరగడం మీద స్పందించిన రాజమౌళి…

SS Rajamouli: మహేష్ బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'వారణాసి' సినిమా మీద ప్రేక్షకుల్లో విశేషమైన అంచనాలైతే ఉన్నాయి. మొదట 1000 కోట్ల బడ్జెట్ తో తీసేద్దాం అనుకోని ఈ సినిమాని...
Oktelugu Epaper