జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలు రేపు వెలువడన్నాయి. అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష బీజేపీ మధ్యన జరిగిన ఈ ఫైట్ లో ప్రజలు ఎవరికి పట్టం కట్టారన్నది తెలియనుంది. మొత్తం 150 వార్డుల ఓట్ల లెక్కింపు శుక్రవారం ఉదయం 11 గంటలకు ప్రారంభం కానుంది.
Also Read: అతివిశ్వాసమా.. మొండి తనమా..?
నిబంధనల ప్రకారం ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తారు. మొత్తం 30 కేంద్రాల్లో డివిజన్ కు ఒకటి చొప్పున, 16 వార్డులకు మాత్రం రెండు చొప్పున మొత్తంగా 166 హాళ్లలో ఓట్లను లెక్కించేందుకు ఎన్నికల కమిషన్ ఏర్పాట్లు పూర్తి చేసింది. ప్రతి హాల్ లో 14 టేబుల్స్ పై ఒక రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్ అధికారులు కౌంటింగ్ ను పర్యవేక్షిస్తారు. ప్రతి కౌంటింగ్ టేబుల్ కు ఒకరి చొప్పున ఆయా పార్టీల అభ్యర్థులు తమ ఏజెంట్లను నియమించుకునే వెసులుబాటు ఉంది.
ఇక ఈ లెక్కింపులో అభ్యర్థులకు సమాన ఓట్లు వస్తే డ్రా పద్ధతిలో విజేతలను ప్రకటిస్తారు. రీకౌంటింగ్ చేయించాలనుకునే అభ్యర్థులు ఫలితాలు ప్రకటించకముందే ఆర్వోకు దరఖాస్తు చేయాలి.
Also Read: టి-20లోనూ మంత్రి హరీష్ రావు ‘దూకుడు’..!
కాగా గ్రేటర్ ఎన్నికల కౌంటింగ్ వేళ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అప్రమత్తమయ్యారు. ఓట్ల లెక్కింపు నేపథ్యంలో ముఖ్య నాయకులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. బ్యాలెట్ ద్వారా ఎన్నికలు జరిగిన నేపథ్యంలో కౌంటింగ్ లో పాల్గొనే ఏజెంట్లు చురుకైన వారు ఉండాలే చూసుకోవాలని.. లేకపోతే ఓట్ల లెక్కింపు ఫలితాల్లో తేడా కొట్టే అవకాశం ఉంటుందని కేటీఆర్ దిశానిర్ధేశం చేశారు.
మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్