https://oktelugu.com/

KTR Uncle Passed Away : కేసీఆర్ వియ్యంకుడు, కేటీఆర్ మామ కన్నుమూత.. సంతాపం తెలిపిన మంత్రి నిరంజన్ రెడ్డి

KTR Uncle Passed Away : సీఎం కేసీఆర్ వియ్యంకుడు, మంత్రి కేటీఆర్ మామ పాకాల హరినాథరావు కన్నుమూశారు. అనారోగ్యంతో ఈ నెల 27న గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చేరిన హరినాథరావు చికిత్స పొందుతూ గురువారం మృతి చెందారు. హరినాథరావు పార్థీవదేహాన్ని రాయదుర్గంలోని వారి నివాసానికి తరలించారు. కేటీఆర్-శైలిమ దంపతులు, కుటుంబ సభ్యులు వారి వెంట ఉన్నారు. శైలిమ తండ్రి హరినాథరావు మరణాన్ని తట్టుకోలేక కన్నీళ్ల పర్యంతం అయ్యింది. మామ మరణంతో కేటీఆర్ అక్కడే ఉండి కార్యక్రమాలన్నీ […]

Written By:
  • NARESH
  • , Updated On : December 29, 2022 / 07:02 PM IST
    Follow us on

    KTR Uncle Passed Away : సీఎం కేసీఆర్ వియ్యంకుడు, మంత్రి కేటీఆర్ మామ పాకాల హరినాథరావు కన్నుమూశారు. అనారోగ్యంతో ఈ నెల 27న గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చేరిన హరినాథరావు చికిత్స పొందుతూ గురువారం మృతి చెందారు.

    హరినాథరావు పార్థీవదేహాన్ని రాయదుర్గంలోని వారి నివాసానికి తరలించారు. కేటీఆర్-శైలిమ దంపతులు, కుటుంబ సభ్యులు వారి వెంట ఉన్నారు. శైలిమ తండ్రి హరినాథరావు మరణాన్ని తట్టుకోలేక కన్నీళ్ల పర్యంతం అయ్యింది. మామ మరణంతో కేటీఆర్ అక్కడే ఉండి కార్యక్రమాలన్నీ చూసుకుంటున్నారు.

    హరినాథరావు భౌతికకాయానికి సీఎం కేసీఆర్ దంపతులు, ఎమ్మెల్సీ కవిత, మంత్రి మహమూద్ అలీ, జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మీ నివాళులర్పించారు.

    ముఖ్యమంత్రి కేసీఆర్ వియ్యంకుడు, మున్సిపల్, ఐటీ, పరిశ్రమల శాఖా మంత్రి కేటీఆర్ మామ హరినాధ్ రావు గారి మృతి పట్ల రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు సంతాపం ప్రకటించారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం ప్రసాదించాలని భగవంతుని ప్రార్థించారు.