Sreemukhi: చాలా మంది హీరోయిన్స్ ని క్యాస్టింగ్ కౌచ్ గురించి అడిగితే… అబ్బే అలాంటిదేమీ లేదంటారు. కొందరైతే ఉందేమో కానీ మాకు ఎదురుకాలేదంటారు. అవన్నీ పచ్చి అబద్దాలే. వారు ఎంత మసిపూసి మారేడు కాయ చేయాలని చూసినా వాస్తవం దాగదు. పరిశ్రమకు వచ్చిన ప్రతి అమ్మాయికి వేధింపులు ఎదురవుతాయి. వాటిని నుండి లౌక్యంగా తప్పించుకొని ఎదిగినవారే పరిశ్రమలో ఉంటారు. కొందరు అవకాశాల కోసం సర్వం అర్పించి మోసపోయామని తెలిశాక… తిరిగి వెళ్లిపోవడమో లేక పరిశ్రమలోనే రెబల్స్ గా మారడమో చేస్తారు. ఒక స్థాయి నటిగా ఎదిగే వరకు ఇబ్బందులు తప్పవు.

స్టార్ యాంకర్ శ్రీముఖి పరిశ్రమకు వచ్చిన కొత్తలో క్యాస్టింగ్ కౌచ్ కి గురైనట్లు ఓపెన్ గా చెప్పారు. అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తుండగా… ఓ పెళ్ళైన దర్శకుడు కలవమన్నాడు. అక్కడకు వెళ్ళాక అసభ్యంగా ప్రవర్తించాడు. హీరోయిన్ గా ఆఫర్ ఇస్తా కమిట్మెంట్ ఇస్తావా? రూమ్ కి వస్తావా? అని అడిగాడు. వెంటనే నేను అక్కడి నుండి వచ్చేశాను. అమ్మాయిలకు పరిశ్రమలో వేధింపులు ఎదురవుతాయని, క్యాస్టింగ్ కౌచ్ ఉందని శ్రీముఖి వెల్లడించారు.
లైంగిక వేధింపులకు భయపడి శ్రీముఖి యాంకరింగ్ వైపు అడుగులు వేశారు. ఐదారేళ్లుగా శ్రీముఖి బుల్లితెర షోలలో సందడి చేస్తున్నారు. ప్రస్తుతం ఆమె టాప్ యాంకర్స్ లో ఒకరు. షోస్ పరంగా చూస్తే ఆమె నంబర్ వన్. శ్రీముఖి చేస్తున్నన్ని షోలు మరో యాంకర్ చేయడం లేదు. వయసు పెరగడంతో పాటు గ్లామరస్ యాంకర్స్ జోరు పెరగడంతో సుమకు కూడా ఆఫర్స్ తగ్గుతున్నాయి. తాజాగా సుమ యాంకరింగ్ నుండి విరామం తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ఇక అనసూయ పూర్తిగా యాంకరింగ్ వదిలేశారు. ఆమె సినిమాలు, సిరీస్లు చేస్తూ నటిగా బిజీ అయ్యారు.

ఈ పరిణామాలు శ్రీముఖికి కలిసొస్తున్నాయి. జాతిరత్నాలు, స్టార్ మా పరివార్, మిస్టర్ అండ్ మిసెస్ ఇలా నాలుగైదు షోలలో శ్రీముఖి యాంకర్ గా ఉన్నారు. కొత్తగా బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్స్ తో బీబీ జోడి అనే డాన్స్ రియాలిటీ షో స్టార్ట్ చేశారు. ఈ షోకి కూడా శ్రీముఖినే యాంకర్ గా ఎంపికయ్యారు. మరోవైపు హీరోయిన్ గా తన కలలు నెరవేర్చుకునేందుకు ట్రై చేస్తున్నారు. క్రేజీ అంకుల్స్ మూవీతో శ్రీముఖి హీరోయిన్ గా మారారు. గ్లామర్ క్వీన్ గా అవతరించిన శ్రీముఖికి అడపాదడపా సినిమా ఆఫర్స్ వస్తున్నాయి. ఏదో ఒక రోజూ అనసూయ మాదిరి నటిగా శ్రీముఖి బిజీ కావడం ఖాయం…