KTR vs BJP: సమయం సందర్భం చూసి కొట్టడమే రాజకీయం.. ఆ విషయంలో మంత్రి కేటీఆర్ రెండాకులు ఎక్కువే చదివారు. ఇలా సోషల్ మీడియాలో లేకపోవడంతో సీఎం కేసీఆర్ సెటైర్లు దినదినం వేయలేకపోతున్నారు. ఏదైనా సభనో.. సమావేశంలోనూ ఆయన ప్రత్యర్థుల చెంప చెల్లుమనేలా పద ప్రయోగాలు చేస్తుంటారు. కానీ ట్విట్టర్ లో యాక్టివ్ గా ఉండే కేటీఆర్ ఇలా ఏదైనా జరగ్గానే అలా సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఎండగడుతారు.

ఇటీవల కేంద్రహోంమంత్రి అమిత్ షా పర్యటనలో స్వామి భక్తితో బండి సంజయ్ ఆయన చెప్పులు మోయగానే టీఆర్ఎస్ బ్యాచ్ చేసిన హంగామా అంతా ఇంతా కాదు.. మంత్రి కేటీఆర్ అయితే ఢిల్లీకి బానిసలు.. గుజరాతీలకు గులాంలు అని ఏదోదే మాటలు అనేశారు. సోషల్ మీడియాలో పెద్ద క్యాంపెయిన్ నిర్వహించారు.
Also Read: KTR: కేటీఆర్ వల్లే హైదరాబాదులో గొడవలా?
దీనికి బండి సంజయ్ కక్కలేక మింగలేక.. శ్రీరాముడి పాదాలను మోసిన భరతుడితో తనను తాను పోల్చుకున్నాడు. ఫాపం ఈ విషయంలో బండి సంజయ్ వివరణ పెద్దగా ప్రజల్లోకి వెళ్లలేదు. టీఆర్ఎస్ బ్యాచ్ ‘చెప్పులు మోసిందే’ ఎక్కువగా పాపులర్ అయ్యింది.
అయితే సమయం సందర్భం చూసి కొట్టడంలో కేటీఆర్ తీరే వేరు. తాజాగా మరోసారి కేటీఆర్ తన ప్రతాపం చూపారు. బండి సంజయ్ పాదయాత్ర ముగింపు సందర్భంగా హైదరాబాద్ వస్తున్న జేపీ నడ్డా పర్యటన సందర్భంగా కేటీఆర్ వేసిన ట్విట్టర్ పంచ్ మళ్లీ పేలింది. ‘ఈరోజు జేపీ నడ్డా చెప్పులను ఏ గులాం మోస్తారు? ఖచ్చితంగా పోటీ ఉంటుందని నేను అనుకుంటున్నాను’ అని కేటీఆర్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ కు అనుగుణంగా కార్టూన్ ను షేర్ చేశారు. ఈ కార్టూన్ లో జేపీ నడ్డా చెప్పులు పట్టుకోవడానికి రెడీ అయిన బండి సంజయ్ చిత్రాన్ని అందులో గీశారు.

ఇలా బీజేపీని అదునుచూసి కొట్టడంలో కేటీఆర్ ట్విట్టర్ ను అస్త్రంగా చేసుకుంటున్నారు. ఇంత స్తాయిలో కేటీఆర్ కు కౌంటర్ల వర్షం కూడా కురిసింది. బీజేపీ నేతలు, కార్యకర్తలు కేటీఆర్ కు కాస్తా గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. ‘‘ఆంధ్రోనికి ఫోటోలు తీసి చంచగిరి చేసింది ఎవరు? అని బాలకృష్ణను ఫోటో తీసిన కేటీఆర్ ఫొటోను షేర్ చేసి ఎద్దేవా చేశారు. జైలుకు పోయిన జార్ఖండ్ హంతకుడు,అవినీతిపరుని కాళ్లు మొక్కిన కేసీఆర్ ఫొటోను షేర్ చేసి ఇంకొందరు కేటీఆర్ కు కౌంటర్ ఇచ్చారు.
ఇంకొందరు.. ‘బాపు కేసీఆర్.. బెంగాళీ,తమిళనాడాయన కాళ్లు పట్టుకుంటడు, ఇక్కడి తెలంగాణ కలెక్టర్లతో కాళ్ళు పట్టించుకుంటాడు,కొడుకు ఆంధ్రోనికి ఫోటోలు తీస్తడు.సంజయన్న తనకి గురువు,అన్న లాంటి వారు అయిన అమిత్ షా గారికి సేవ చేస్తే టీఆర్ఎస్ వాళ్లు ఒకటే ఎగురుడు ఇగ కుక్కకి బొక్క దొరికినట్లు’ అంటూ కేసీఆర్, కేటీఆర్ లు కాళ్లు మొక్కిన ఫొటోలను షేర్ చేసి బీజేపీ ఫాలోవర్స్ ఎండగడుతూనే ఉన్నారు.
https://twitter.com/PSR4Bharat/status/1563406595509583879?s=20&t=lpx7SiFRRK_ooRHHfYK92g
Also Read:Mukesh Ambani: రూ.630 కోట్లతో దుబాయ్ తీరంలో ఖరీదైన విల్లా కొన్న అంబానీ.. ఎవరికోసమో తెలుసా?
[…] […]