Before Death: ఓ మహాకవి మనిషి చావు పుట్టుకల గురించి ఏమన్నాడో తెలుసా. ఈ లోకంలో ఇద్దరే మంచి వారు ఒకరు పుట్టి చనిపో యిన వారు రెండోవారు ఇంకా పుట్టని వారు. చావు పుట్టుకల గురించి మనిషికి ఎన్నో అభిప్రాయాలు ఉంటాయి. పుట్టుక, చావు మన చేతుల్లో ఉండవు. ఎప్పుడు పుడతామో ఎప్పుడు పోతామో ఎవరికి అర్థం కాని విషయం తెలిసిందే. దీంతో చావుబతుకుల విషయంలో ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి. మరణం ఆసన్నమైనప్పుడు కొన్ని సెకన్ల పాటు ఎవరితో మాట్లాడరట. మెదడు కూడా పనిచేయదట. మనకు ఈ జన్మలో జరిగిన అన్ని విషయాలు గుర్తుకు వస్తాయట. దీంతో అతడు కొన్ని నిమిషాల పాటు ఇలలో జరిగిన విషయాలను నెమరువేసుకుంటాడట.

మన జన్మ ఈ ప్రపంచాన్ని వదిలిపెట్టే తరుణంలో ఈ జన్మలో జరిగిన విషయాలు అన్ని గుర్తుకు రావడంతో ఎవరు కూడా మాట్లాడలేకపోతారు. కొన్ని సందర్బాల్లో నిశ్శబ్దంగా లోకాన్ని విడిచిపెట్టి వెళుతుంటారు. అసలు చనిపోయే ముందు ఏం జరుగుతుందో కూడా తెలుసుకోవాలని చాలామంది ప్రయత్నిస్తున్నా అంతుచిక్కడం లేదు. న్యూరో సైంటిస్టుల రీసెర్చ్ లో కొన్ని విషయాలు తెలిశాయి. మనిషి చనిపో వడానికి 30 సెకండ్ల ముందు జీవితంలో గడిచిన విషయాలు కళ్ల ముందు తిరుగుతుంటాయట. ఈ మేరకు ఓ 87 సంత్సరాల వృద్ధుడిని పరిశీలించినప్పుడు ఈ విషయాలు తెలిశాయట.
Also Read: KTR: కేటీఆర్ వల్లే హైదరాబాదులో గొడవలా?
అకస్మాత్తుగా గుండెపోటు వచ్చి మెదడులో ఉన్నట్లుండి ఊహించని విధంగా కొన్ని మార్పులు సంభవించినట్లు చెబుతున్నారు. మెదడులో 30 సెకన్ల ముందే రక్త సరఫరా ఆగిపోతోంది. అప్పుడు జీవితంలోని ముఖ్య సంఘటనలు కళ్ల ముందు కదులుతుంటాయట. గుండె కొట్టుకోవడం ఆగిపోయిన 30 సెకన్ల తరువాత ఈ ప్రాసెస్ కొనసాగుతుంది. తరువాత మనిషి ఉండడు. ఆత్మ శరీరం నుంచి వెళ్లిపోతోంది. చావు అనే ప్రహసనం ఓ తంతుగా సాగిపోతోంది. దీనికి ముందు శరీరం ఎన్నో బాధలు పడుతుంది.

మనిషి మరణించే 30 సెకండ్ల ముందు ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొంటుంది. ఆత్మ పరమాత్మలో కలిసిపోయే ముందు మనిషిలోని మస్తిష్కంలో జరిగే మార్పులు విచిత్రంగా ఉంటున్నాయి. అందుకే ఆత్మ పరమాత్మలో కలిసేందుకు ఒక్క ఉదుటున జరగదు. దానికి ఓ ప్రహసనం ఉంటుంది. చావును కూడా ఓ తంతుగానే చూస్తారు. మనిషి జీవితంలో స్థిరంగా ఉండేది రెండు చోట్లలోనే. ఒకటి పుట్టక ముందు తల్లి కడుపులో రెండోది చనిపోయాక శ్మశానంలోనే. అందుకే చావుపుట్టుకలకు ఎంతో అవినాభావ సంబంధం ఉన్నట్లు చెబుతుంటారు.