External Affairs Minister Jaishankar: 2019లో అమెరికాలో భారత ప్రధాని మోడీ పర్యటించినప్పుడు “హౌడీ మోడీ” పేరుతో పెద్ద సభ నిర్వహించారు. పేరుకే అమెరికా కానీ ఇండియాలో వచ్చినట్టే జనం వచ్చారు. ఇంతటి జన సమీకరణ చూసి అప్పటి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఆశ్చర్యపోయాడు. నుపూర్ శర్మ చేసిన వ్యాఖ్యల వల్ల ఖతార్ దేశ దౌత్య వేత్తలు నిరసన వ్యక్తం చేశారు. భారత్ తో తమ ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రద్దు చేసుకుంటామని వ్యాఖ్యానించారు. కేవలం కొద్ది గంటల్లో తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు.

రష్యా, ఉక్రెయిన్ యుద్ధం జరుగుతున్నప్పుడు చమురు ధరలు ఆకాశాన్నంటాయి. పూర్తి దిగుమతుల మీదనే ఆధారపడిన భారత్ లాంటి దేశానికి ఇది శరాఘతమే. కానీ పాత ధరకే ముడి చమురును రష్యా మనకు అమ్మింది. అది కూడా మన కరెన్సీ లోనే చెల్లింపులు స్వీకరించింది.
Also Read: KTR vs BJP: ‘బూట్లు మోసుడు లొల్లి’: కేటీఆర్ సెటైర్ కు బీజేపీ కౌంటర్లే కౌంటర్లు
పైపు మూడు విషయాలు దౌత్య విధానంలో భారత్ మారింది అనే వాటికి ప్రబల ఉదాహరణలు. వీటన్నింటి వెనక ఉంది ఒకే ఒక్కడు అతడే కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్. ఇండియన్ ఫారెన్ సర్వీస్ అధికారిగా, ఇండియన్ ఫారెన్ సెక్రటరీగా, ఇండియన్ ఫారెన్ మినిస్టర్ గా అతడు పోషించిన పాత్రలు వేటికవే విభిన్నం. ₹వేల కోట్ల రూపాయల వ్యాపారాలు సాగుతున్నా.. చిన్న అవకతవక కూడా జరగకుండా చూసిన ఘనత ఆయనదే. ప్రస్తుతం విభిన్న పరిస్థితులను ఎదుర్కొంటున్న భారతదేశానికి అతడు వెన్నెముక. అన్నింటి కన్నా ముఖ్యంగా అతడు మోడీ తురుపు ముక్క. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి విదేశాంగ శాఖ మంత్రిగా వ్యవహరిస్తున్న జై శంకర్ ప్రస్థానం గమనిస్తే అన్నింటా ఆశ్చర్యమే కలుగుతుంది.
నాన్న కూడా ఫారిన్ సర్వీస్ లోనే
జై శంకర్ ది తమిళ బ్రాహ్మణ మూలాలు ఉన్న కుటుంబం. తండ్రి సుబ్రహ్మణ్యం సివిల్ సర్వెంట్. విదేశీ వ్యవహారాలపై గట్టి పట్టు ఉన్న వ్యక్తి. ఆయన ఒక జర్నలిస్టు కూడా. 1980 దశకం వరకు ఆయన రాసిన రాతల ప్రభావం మన దేశ విదేశీ వ్యవహారాల మీద ఉండేది. జై శంకర్ సోదరుడు సంజయ్ సుబ్రహ్మణ్యం విఖ్యాత చరిత్రకారుడు. బోలెడు పుస్తకాలు రాశాడు. పాపులర్ అమెరికన్ హిస్టారియన్ ప్రొఫెసర్ కెరోలిన్ ఫోర్డ్ ను పెళ్ళి చేసుకున్నాడు. జై శంకర్ మరో సోదరుడు విజయ్ కుమార్ ఒక ఐఏఎస్. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ, ఖనిజా జాభివృద్ధి శాఖలో కార్యదర్శిగా పనిచేశాడు. ఇప్పుడు ‘టెరీ ‘ లో ఉన్నాడు. ఇక జై శంకర్ 1977 లోనే ఇండియన్ ఫారెన్ సర్వీస్ కు ఎంపిక అయ్యాడు. అంతకుముందే ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీలో అంతర్జాతీయ అంశాలపై పీ హెచ్ డీ పూర్తి చేశాడు.

అమెరికా, సింగపూర్, చైనా, రష్యాలో ఎక్కువకాలం భారత రాయబారిగా పనిచేశాడు. చైనాలో ఎక్కువ కాలం భారత రాయబారిగా పనిచేసిన ఘనత శంకర్ దే. జపాన్ లో పనిచేస్తున్నప్పుడు తన భార్య క్యాన్సర్ తో చనిపోయింది. అప్పుడే జపాన్ లో పరిచయమైన క్యోకో అనే మహిళను పెళ్లి చేసుకున్నాడు. మొదటి భార్య ద్వారా ఆయనకు ధ్రువ, అర్జున్ అనే పిల్లలు ఉన్నారు. అర్జున్ తన సోదరి ధ్రువ అమెరికన్ స్నేహితురాలైన కసాండ్రా ను పెళ్లి చేసుకున్నాడు. అర్జున్.. రిలయన్స్ ఆధ్వర్యంలో నడుస్తున్న అంతర్జాతీయ థింక్ టాంక్ ఫౌండేషన్ అమెరికా బాధ్యతలు చూస్తున్నాడు. మేథ కూడా అమెరికాలోనే క్రియేటివ్ వర్క్స్ చేస్తోంది. ఇక శంకర్ పని తీరుకు వస్తే అతడు ఓ సైలెంట్ వర్కర్. 2019లో అమెరికాలో “హౌ డీ మోడీ” అనే ప్రోగ్రామ్ ను అతడే ముందుండి నడిపించాడు. ఆయన పనితీరుకు ముగ్దు డైన నరేంద్ర మోడీ కేంద్ర విదేశాంగ కార్యదర్శిగా నియమించాడు. రిటైర్మెంట్ అయిన తర్వాత జై శంకర్ టాటా సన్స్ గ్రూప్ గ్లోబల్ కార్పొరేట్ అఫైర్స్ కి కొద్దిరోజులు పనిచేశాడు. భారత విదేశాంగ శాఖకు ప్రతిభావంతుడైన మంత్రి కావాలనే ఉద్దేశంతో నరేంద్ర మోడీ జై శంకర్ ను తెచ్చి పెట్టుకున్నాడు. ఒక రాయబారిగా, విదేశాంగ శాఖ కార్యదర్శిగా, విదేశాంగ శాఖ మంత్రిగా పనిచేసిన ఘనత భారతదేశంలో బహుశా జై శంకర్ దే మాత్రమే కావచ్చు. అయితే ఇవాల్టికి ఆయన శాఖలో అజిత్ దోవల్ తప్ప ఇంకెవరు కూడా వేలు పెట్టేందుకు అవకాశం లేదు. చివరికి ప్రధానమంత్రి మోడీ కూడా. అటు పాకిస్తాన్, ఇటు చైనా, మధ్యలో అమెరికా వంటి దేశాలతో సరికొత్త విదేశాంగ సవాళ్లను ఎదుర్కొంటున్న భారతదేశానికి ప్రస్తుతం జై శంకర్ లాంటి అనుభవం ఉన్న విదేశాంగ శాఖ మంత్రి ఎంతో అవసరం. మూడో ఆర్థిక శక్తిగా ఎదగాలనే భారత్ కు ఇది మరింత అవసరం.
Also Read:KTR: కేటీఆర్ వల్లే హైదరాబాదులో గొడవలా?
[…] […]