Neera Cafe In Hyderabad: చోడ్ చింత.. మార్ ముంత, తాగినోడికి తాగినంత

సాధారణంగా నీరా అంటే పెద్దగా ఎవరికీ తెలియదు. నీరా అనేది తాటి చెట్టు నుంచి సహజ సిద్ధంగా వచ్చే ఒక ద్రవం. ఇది కూలింగ్ టెంపరేచర్ లో మాత్రమే తయారవుతుంది.. ఉదయం 6 గంటల లోపు దీనిని తాటి చెట్ల మీద నుంచి తీసి

Written By: K.R, Updated On : May 3, 2023 10:09 pm
Follow us on

Neera Cafe In Hyderabad:  చోడ్ చింత మార్ ముంత, తాగినోడికి తాగినంత, కిక్కు ఎక్కదు, తలకాయకు పట్టదు. పైగా మెండుగా ఔషధ గుణాలు… తాగితే ఆరోగ్యం.. ఇన్ని ఉపమానాలు చెబుతోంది పాల సముద్రంలో లభించే అమృతం గురించో, మరో దాని గురించి కాదు.. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటుచేసిన నీరా గురించి.. హైదరాబాద్ ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాల్లోని ఈట్ స్ట్రీట్ లో ఏర్పాటుచేసిన ఈ నీరాకేఫ్ ఇప్పుడు ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. బుధవారం దీనిని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు.

ఇంతకీ ఇందులో ఏముంటుంది

సాధారణంగా నీరా అంటే పెద్దగా ఎవరికీ తెలియదు. నీరా అనేది తాటి చెట్టు నుంచి సహజ సిద్ధంగా వచ్చే ఒక ద్రవం. ఇది కూలింగ్ టెంపరేచర్ లో మాత్రమే తయారవుతుంది.. ఉదయం 6 గంటల లోపు దీనిని తాటి చెట్ల మీద నుంచి తీసి, అధునాతన ప్రక్రియలో శుభ్రం చేస్తారు. 20 డిగ్రీల కంటే తక్కువ టెంపరేచర్ వద్ద బాటిల్ లోకి నింపుతారు . తర్వాత దానిని వినియోగదారులకు సర్వ్ చేస్తారు. ఇది తాగితే కిక్కు ఎక్కదు. మత్తు రాదు. పైగా ఔషధ గుణాలు కలిగి ఉండడంతో ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో ఏమైనో ఆమ్లాలు, విటమిన్లు మెండుగా ఉంటాయి. పైగా కల్తీ రహితం కాబట్టి ఆరోగ్యానికి చాలా మంచిది.. దీనిని బాగా ప్రమోట్ చేసేందుకు ప్రభుత్వం ఏకంగా ఈట్ స్ట్రీట్ పరిధిలో మీరా కేఫ్ ప్రారంభించింది.

నీరా మాత్రమే కాదు

నీరా కేఫ్ లో మీరా మాత్రమే కాకుండా తాటి బెల్లం, తాటి చక్కెర, తాటి తేనే అందుబాటులోకి తీసుకొచ్చారు. ని కూడా పూర్తి సాంప్రదాయ పద్ధతిలో తయారుచేస్తున్నారు. నీరా కు పెద్ద ప్లాంట్ నిర్మించారు. వచ్చే రద్దీని దృష్టిలో పెట్టుకుని భారీగా నిర్మించారు . వేలాది లీటర్ల సామర్థ్యం ఉన్న భారీ ట్యాంకర్లు ఏర్పాటు చేశారు. కేవలం నీరా కేఫ్ ను హైదరాబాద్ కు మాత్రమే పరిమితం చేయకుండా రాష్ట్రంలోని ఇతర జిల్లాలకు కూడా విస్తరించే ప్రణాళికలో ప్రభుత్వం ఉంది. కాదు ఈట్ స్ట్రీట్ ప్రాంతంలో నీరా కేఫ్ ను కూడా విస్తరించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.

ఎందుకీ నీరా

సంప్రదాయ వృత్తులు కనుమరుగవుతున్న నేపథ్యంలో గీత కార్మికులకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ కేఫ్ ను ఏర్పాటు చేసింది. అంతేకాదు అత్యంత సహజ సిద్ధమైన పద్ధతుల్లో నీరా సేకరించి, దానిని అధునాతనమైన పద్ధతుల్లో శుభ్రపరచి వినియోగదారులకు అందించనుంది. నీరా కేఫ్ లో నీరా మాత్రమే కాకుండా తెలంగాణ సాంప్రదాయ వంటలను కూడా హైదరాబాద్ వాసులకు పరిచయం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం నీరా, తాటి తేనే, తాటి బెల్లం, తాటి చక్కెరను అందుబాటులోకి తీసుకొచ్చింది.. త్వరలో ఈత నీరా కూడా తెరపైకి తీసుకొస్తామని చెబుతోంది. ప్రస్తుతం మద్యానికి అలవాటు పడి యువత పెడ ధోరణి పడుతున్న నేపథ్యంలో ఈ నీరా ఎంతో కొంత ఉపశమనంగా ఉంటుందని ప్రభుత్వం చెబుతోంది.