Modi-KTR: మణిపాల్ యూనివర్సిటీ చైర్మన్ మోహన్ దాస్ విసిరిన సవాల్ ను మంత్రి కేటీఆర్ స్వీకరించారు.18 నెలల్లో గుణంకాలను తిరగరాస్తామని ట్విట్టర్ వేదికగా రిప్లై ఇచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఉద్దేశించి పోషకాహార లోపంపై కేటీఆర్ చేసిన ట్వీట్ కు మణిపాల్ యూనివర్సిటీ చైర్మన్ మోహన్ దాస్ స్పందించారు. దీంతో ముందు తెలంగాణ రాష్ట్రంలోని పోషకాహార లోపాల గుణాంకాలు ఎలా ఉన్నాయో చూపించండి అంటూ సవాల్ విసిరారు. అయితే కేటీఆర్ మోహన్ దాస్ సవాల్ కు వెంటనే స్పందించారు. చాలెంజ్ ను స్వీకరిస్తున్నామని ట్విట్టర్ వేదికగా రిప్లై ఇచ్చారు.

‘నా మాటలు గుర్తుంచుకోండి.. కర్టాటకలోని 40 శాతం కమిషన్ ప్రభుత్వాన్ని, గుజరాత్ లోని రేపిస్టు ఉపశమన ప్రభుత్వాలను అధిగమిస్తామం’ అంటూ కేటీఆర్ ఈ సందర్భంగా ట్వీట్ చేశారు. అంతేకాకుండా ఆయన చేసిన ట్వీట్ ను మరికొంత మంది మంత్రులకు ట్యాగ్ చేశారు. ఎంతో కాలంగా కేంద్రం, తెలంగాణల మధ్య వార్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కేంద్రం విషయంలో ఎక్కడ తప్పు దొరుకుతుందా..? అని రాష్ట్రం ప్రభుత్వం ఎదురుచూస్తోంది.
Also Read: Jagan: జగన్ జంపింగ్ ప్లాన్ వచ్చే ఎన్నికల్లో వర్కౌట్ అవుతుందా?
నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే కేటీఆర్ తెలంగాణ పై వస్తున్న ఆరోపణలపై స్పందిస్తున్నారు. అలాగే కేంద్రం ప్రభుత్వం రాష్ట్రంపై చేస్తున్న వ్యాఖ్యలను పరిశీలిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి మోదీ ఇటీవల మన్ కీ బాత్ లో మాట్లాడుతూ భోజనం అనడానికి బదులు భజన అన్నారు. దీనిపై స్పందించిన కేటీఆర్ టెలీప్రాంపర్ట్ లో తప్పు ఉందని ఎద్దేవా చేశారు. ఇలాంటి టైంలో పౌష్టికాహారంపై దృష్టి పెట్టాలని సూచించారు.

ఇక అమరవీరుల స్మారక స్థూపాన్ని ఈ ఏడాది చివర్లో ప్రారంభిస్తామని కేటీఆర్ చెప్పారు. సచివాలయం ఎదుట లుంబినీ పార్కు పక్కన విశాలంగా అమరవీరుల స్మారకాన్ని నిర్మిస్తున్నారన్నారు. ప్రస్తుతం స్టీల్, వెల్డింగ్ పనులు పూర్తి చేయాల్సి ఉందని అన్నారు. అమరవీరులకు ఎల్లప్పటికీ రుణపడి ఉంటామని వారి ఆశయాలను కొనసాగిస్తామని అన్నారు. దేశానికి అమరులు చేసిన సేవలు మరిచిపోలేమని కేటీఆర్ ట్విట్టర్లో పేర్కొన్నారు.
Also Read:Billionaires First Jobs: ఈ ప్రపంచంలోనే ధనవంతులు మొదట్లో ఏ పని చేసేవారో తెలుసా..?


[…] Also Read: Modi-KTR: మోడీతో ఫైట్: బస్తీమే సవాల్ అంటూ ఆయ… […]