Karnataka Husband and Wife: భర్త కోసం సవతుల పోరాటం చూస్తుంటాం. పతిని దక్కించుకునేందుకు వారు పడరాని పాట్లు పడడం అటు సినిమాలు, ఇటు నిజజీవితంలో చూస్తుంటాం. ఆ సమయంలో వారి మధ్య జరిగే సంవాదం వినోదం పంచినట్టే కనిపించినా.. వారి భావోద్వేగాలు వారివి. భర్తను దక్కించుకునేందుకు ముష్టిగాతాలకు దిగిన వారున్నారు. ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్న వారు ఉన్నారు. భర్తను సొంతం చేసుకోవాలన్న ప్రయత్నంలో ఎంతకైనా తెగించే వారూ ఉన్నారు. అయితే ఇటువంటి ఘటనే కర్నాటకలోని కడూరులో వెలుగుచూసింది. అయితే పతి కోసం సతుల పోరాటం కాదు. సతి కోసం పతుల పోరాటం. అయితే ఒకరిని తెలియకుండా మరోకర్ని పెళ్లి చేసుకున్న ఆ యువతి సేఫ్ గా ఉండగా.. పతుల మధ్య మాత్రం ప్రాణాలు తీసుకున్నంత రేంజ్ లో రివేంజ్ నడిచింది. చివరకు ఒకరు గాయాలతో ఆస్పత్రి పాలవ్వగా.. మరొకరు కటకటలాపాలయ్యారు.

ఒకరికి తెలియకుండా మరొకరితో..
రాజస్థాన్ కు చెందిన మంజూల అనే యువతి ఉపాధి కోసం కర్నాటక జిల్లా కడూరుకు వచ్చింది. స్థానికంగా ఒక పరిశ్రమలో పనిచేసేది. ఈ నేపథ్యంలో కడూరుకు చెందిన మోహన్ రామ్ అనే వ్యక్తి ఆమెకు దగ్గరయ్యాడు. సన్నిహితంగా మెలిగాడు. ప్రేమ వివాహం చేసుకున్నాడు. కొన్నాళ్ల పాటు కాపురం పెట్టిన దంపతులు కొద్దిరోజుల తరువాత రాజస్థాన్ లోని మంజుల స్వగ్రామానికి వెళ్లారు. కొద్దిరోజుల పాటు అక్కడే ఉన్నారు. అయితే ఉపాధి నిమిత్తం మోహన్ రామ్ కర్నాటకు తిరుగు పయనమయ్యాడు. మంజుల మాత్రం కొద్దిరోజుల తరువాత వస్తానని చెప్పింది.
Also Read: Modi-KTR: మోడీతో ఫైట్: బస్తీమే సవాల్ అంటూ ఆయన సవాల్ స్వీకరించిన కేటీఆర్
దీంతో మోహన్ రామ్ ఒంటరిగా కడూరు వచ్చాడు. అయితే కడూరు వచ్చిన మోహన్ రామ్ ఫోన్ కు మంజుల స్పందించేది కాదు. దీంతో అనుమానించిన మోహన్ రామ్ రాజస్థాన్ వెళ్లాడు. అప్పుడే ఆయనకు షాక్ లాంటి నిజం ఒకటి తెలిసింది. భార్య మంజుల ఓం ప్రకాష్ అనే యువకుడ్ని పెళ్లి చేసుకున్నట్టు తెలుసుకున్నాడు. వారిద్దరూ బెంగళూరులో కాపురం పెట్టినట్టు తెలుసుకున్నాడు. కానీ వారి చిరునామా మాత్రం తెలియలేదు. దీంతో అప్పటి నుంచి మంజులాకు ఫోన్ లో మెసేజ్ లు పెడుతుండేవాడు. నాతో చట్టపరంగా విడాకులు తీసుకోకుండా వేరే వారిని వివాహం చేసుకోవడం తగునా అని ప్రశ్నించాడు. కానీ మంజుల రిప్లయ్ ఇచ్చేది కాదు.

మొదటి భర్తను హతమార్చాలని..
ఈ నేపథ్యంలో మంజుల రెండో భర్త ఓం ప్రకాష్ నుంచి మోహన్ రామ్ కు హెచ్చరికలు వచ్చేవి. ఇక నుంచి మంజులకు ఫోన్ చేసినా, మెసేజ్ పంపించినా చంపేస్తానని హెచ్చరించేవాడు. అయితే మోహన్ రామ్ మాత్రం పట్టువీడలేదు. తనకు జరిగిన మోసంపై పదేపదే ప్రస్తావిస్తూ మంజులకు మెసేజ్ లు పంపేవాడు. దీంతో ఎలాగైనా మోహన్ రామ్ ను మట్టుబెట్టాలని ఓం ప్రకాష్ నిర్ణయించుకున్నాడు. ఇందుకు స్నేహితుల సాయాన్ని తీసుకున్నాడు. కారులో బెంగళూరు నుంచి బయలుదేరి వారు కడూరుకు చేరుకున్నారు. మార్కెట్ లో కూరగాయలు కొనుగోలు చేస్తున్న మోహన్ రామ్ పై దాడిచేసి కారులో తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. స్థానికులు అడ్డుకున్న కారును వేగంగా పోనిచ్చారు. అయితే కొంతదూరం వెళ్లిన తరువాత కారు ఇంజన్ సమస్యతో నిలిచిపోయింది. దీంతో స్థానికులు వారిని పట్టుకొని పోలీసులకు సమాచారమందించారు. పోలీసులు ఓం ప్రకాష్ తో పాటు ఏడుగురు యువకులను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో ఈ విషయాలన్ని బయటకు తెలిశాయి. అయితే మొదటి భర్త గాయాలతో ఆస్పత్రిలో ఉండగా.. రెండో భర్త ఓం ప్రకాష్ జైలుపాలయ్యాడు. ఇంతటికి కారణమైన మంజుల మాత్రం సేఫ్ గా ఉండడం విశేషం.
Also Read:Jagan: జగన్ జంపింగ్ ప్లాన్ వచ్చే ఎన్నికల్లో వర్కౌట్ అవుతుందా?


[…] […]