Brahmastra: బాహుబలి విజయం తర్వాత భారీ చిత్రాల ట్రెండ్ మొదలైంది. వీటిలో కొన్ని విజయం సాధించగా కొన్ని పరాజయం పాలయ్యాయి. తాజాగా బ్రహ్మాస్త్రం బాలీవుడ్ లోనే అత్యధిక బడ్జెట్ తో తెరకెక్కించారు. అంచనాల ప్రకారం బ్రహ్మాస్త్రం బడ్జెట్ రూ. 410 కోట్లు. ప్రమోషన్స్ తో పాటు ఇతర ఖర్చులు జోడిస్తే ఇది మరింతగా పెరగనుంది. హిందీలో అత్యధికంగా రూ. 300 కోట్ల బడ్జెట్ వరకు చిత్రాలు తెరకెక్కాయి. ఈసారి కరణ్ జోహార్ పెద్ద సాహసమే చేస్తున్నారు. ఖర్చుకు వెనుకాడకుండా విజువల్ వండర్ గా బ్రహాస్త్రం నిర్మించారు.సోషియో ఫాంటసీ నేపథ్యంలో దర్శకుడు అయాన్ ముఖర్జీ బ్రహ్మాస్త్రం రూపొందించారు.

రన్బీర్ కపూర్, అలియా భట్ హీరో హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ చిత్రంలో నాగార్జున, అమితాబ్, షారుక్ ఖాన్ లతో పాటు మౌని రాయ్ కీలక రోల్స్ చేస్తున్నారు. బ్రహ్మాస్త్రం రెండు భాగాలుగా విడుదల కానుంది. సృష్టిలో గల శివుని అస్త్రాలు, వాటి శక్తి అనే అంశాలు టచ్ చేస్తూ వినూత్నమైన సబ్జెక్టు తో బ్రహ్మాస్తం తెరకెక్కింది. కేవలం విజువల్స్ కోసం వందల కోట్లు ఖర్చు చేశారు. సెప్టెంబర్ 9న వరల్డ్ వైడ్ హిందీ, తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల చేస్తున్నారు.
Also Read: Jagan: జగన్ జంపింగ్ ప్లాన్ వచ్చే ఎన్నికల్లో వర్కౌట్ అవుతుందా?
ఇక నిన్న హైదరాబాద్ వేదికగా జరగాల్సిన ప్రీ రిలీజ్ ఈవెంట్ చివరి నిమిషంలో క్యాన్సిల్ అయ్యింది. ఎన్టీఆర్ అతిథిగా రావాల్సిన ఈ మెగా ఈవెంట్ కి పోలీసులు అనుమతి ఇవ్వలేదు. ఎన్టీఆర్ కారణంగానే పోలీసులు అలా ఝలక్ ఇచ్చారన్న టాక్ నడుస్తుంది. రాజకీయ కారణాలతో కావాలనే కక్ష సాధించారనన్న మాట వినిపిస్తోంది. ఇటీవల ఎన్టీఆర్ బీజేపీ లీడర్ అమిత్ షాను కలిశారు. రాజకీయ వర్గాల్లో ఈ పరిమాణం తీవ్ర చర్చకు దారితీసింది. దీంతో జస్ట్ ప్రెస్ మీట్ తో సరిపెట్టారు.

మరోవైపు బాలీవుడ్ లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. ప్రేక్షకులు అసలు థియేటర్స్ కి రావడం లేదు. ఇదే విషయాన్ని ప్రెస్ మీట్ లో ఎన్టీఆర్ మాట్లాడారు. దీన్ని ఓ ఛాలెంజ్ గా తీసుకొని మనం మరింత గొప్ప చిత్రాలు తెరకెక్కించాలన్న అభిప్రాయం వెల్లడించారు. అలాగే బాయ్ కాట్ భయాలు కూడా యూనిట్ ని వెంటాడుతున్నాయి. అప్పుడే నెటిజెన్స్ బ్రహ్మాస్తం చిత్రాన్ని బాయ్ కాట్ చేయాలంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు.
Also Read:KCR- NTR: జూనియర్ ఎన్టీఆర్ ను టార్గెట్ చేస్తే నష్టం ఎవరికి?

