Minister Gangula Kamalakar: ‘డబుల్‌’ మాయ : గంగుల.. ఆ జర్నలిస్టులకు దోచిపెట్టవా?

బండి సంజయ్‌ రహస్యాలను బయట పెట్టి మంత్రి గంగుల కమలాకర్‌కు దగ్గరైన ఓ జర్నలిస్టు తర్వాత జర్నలిస్టు సంఘం అధ్యక్షుడిగా చలామణి అవుతున్నాడు. అతని అవినీతి కారణంగానే ఇప్పటికే అతడిని మూడు నాలుగు పత్రికల నుంచి తొలగించారు.

Written By: Raj Shekar, Updated On : October 12, 2023 6:11 pm

Minister Gangula Kamalakar

Follow us on

Minister Gangula Kamalakar: ‘తెలంగాణ బీసీ సంక్షేమం, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ ఇలాఖాలో అక్రమాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఎన్నికల వేళ.. అక్రమాలు బయటకు రావడం అమాత్యులకు తలనొప్పిగా మారింది. ఇంకోవైపు జర్నలిస్టులతో పెట్టుకున్నాడు. ఎన్నికల వేళ కేసీఆర్‌ సైతం మీడియా సపోర్టు కోరుకుంటుంటే గంగుల కమలాకర్‌ మాత్రం వారినే ఢీకొట్టాలనుకుంటున్నారు. జర్నలిస్టులను చీల్చి మైండ్‌ గేమ్‌ ఆడుతున్నారు. అయిన వారికి కంచాల్లో వడ్డించిన అమాత్యులవారు.. కానివారికి ఉత్త చేతులు చూపుతున్నారు.

డబూల్‌బెడ్రూం పేరుతో ఖాళీ ప్లాట్లు..
కరీంనగర్‌ హ్యాట్రిక్‌ ఎమ్మెల్యేలగా రికార్డు సృష్టించిన గంగుల కమలాకర్‌ 10 ఏళ్లు అధికార పార్టీలో ఉన్నారు. కానీ ఏనాడు ఆయనకు జర్నలిస్టుల సంక్షేమం గురించి ఆలోచించలేదు. ప్రస్తుతం గంగులపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. కేసీఆర్‌ పథకాలు గెలిపిస్తాయన్న ధీమా బయటకు వ్యక్తం చేస్తున్నా.. మూడు పర్యాయాలు గెలిచిన తనపై స్థానికంగా వ్యవతిరేకత ఉందని అమాత్యులవారికి అర్థమైంది. దీంతో జర్నలిస్టుల మద్దతు కోరారు. ఇందుకు ఇళ్ల స్థలాలు తాయిళం వేశారు. డబుల్‌ బెడ్రూం స్కీం నిబంధనలు జోడించి.. ఖాళీ ప్లాట్లను ఎన్నికల షెడ్యూల్‌కు ఒక్క రోజు ముందు హడావుడిగా పంపిణీ చేశారు. ఇందులో అయిన వారికే ప్లాట్లు కేటాయించారు.

చక్రం తిప్పిన మల్లికార్జున్‌..
బండి సంజయ్‌ రహస్యాలను బయట పెట్టి మంత్రి గంగుల కమలాకర్‌కు దగ్గరైన ఓ జర్నలిస్టు తర్వాత జర్నలిస్టు సంఘం అధ్యక్షుడిగా చలామణి అవుతున్నాడు. అతని అవినీతి కారణంగానే ఇప్పటికే అతడిని మూడు నాలుగు పత్రికల నుంచి తొలగించారు. అయినా తాను నాయకుడిని అని చెప్పుకుంటూ మంత్రి క్యాంపు కార్యాలయంలో పనులు చక్కబెడుతున్నాడు. ఈ క్రమంలో పౌరసరఫరాల శాఖలో ఉద్యోగం కూడా సంపాదించాడు. ఇదే సమయంలో జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కేటాయింపు ప్రక్రియ మొదలు కావడంతో అక్రమాలకు తెరతీశాడు. 2010, సెప్టెంబర్‌ 9న (అక్రిడిటేషన్‌ కార్డు నెంబర్‌ 1023/2010 ద్వారా) ఒకేరోజు తిమ్మాపూర్‌ మండల కేంద్రంలోని 265 సర్వే నెంబర్‌ లో 265 గజాల స్థలం, అదే మండల పరిధిలోని అలుగునూరు గ్రామంలో 436 సర్వే నెంబర్లో అంతే స్థలాన్ని పొందుతూ మండల రెవెన్యూ అధికారుల నుంచి పట్టా సర్టిఫికెట్లు అందుకున్నాడు. తాజాగా జర్నలిస్టుల పేరిట అమాత్యులు పంచిన స్థలాల్లో మరో రెండు నివేశనా స్థలాల పట్టాలు పొందాడు. తన తల్లి బోనాల విజయ భర్త కనుకయ్య పేరిట ఒకటి, తన అన్న వెంకటేశ్‌ భార్య బోనాల స్వాతి పేరిట మరో పట్టా నిరుపేదల ఖాతాలో కొట్టేశాడు.

డబ్బులు తీసుకుని అనుచరులకు..
ఇక ఆయన అనుచర వర్గానికి మంత్రి ఇచ్చిన ప్లాట్లు పెద్ద ఎత్తున ఇప్పించుకున్నట్లు తెలుస్తోంది. ఇందుకు పెద్ద పత్రికల జర్నలిస్టులను అడ్డుం పెట్టుకుని డబ్బులు వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఒక్కో ప్లాట్‌కు రూ.2 లక్షల చొప్పున వసూలు చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. డెస్క్‌ జర్నలిస్టుల విషయంలోనూ పెద్ద పత్రికల బ్యూరోలు చక్రం తిప్పారని తెలుస్తోంది. మల్లికార్జున్‌ పేరు చెప్పి.. డెస్క్‌ జర్నలిస్టుల నుంచి డబ్బులు వసులు చేసినట్లు సమాచారం. తాజాగా రెండో లిస్టు పేరుతో కూడా వసూళ్లు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది.

అమాత్యులకు తెలియవా?
ఇక ఇవన్నీ అమాత్యులకు తెలియవా అంటే అనుమానమే. ఆయన పేషీలో ఉండి చక్రం తిప్పుతున్న అమాత్యులు మల్లికార్జునను బాగా నమ్ముతున్నారు. కానీ 2018 ఎన్నికల సమయంలో బండి సంజయ్‌ తరహాలో 2023 ఎన్నికల తర్వాత గంగుల రహస్యాలు లీక్‌ చేస్తాడన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రెస్‌ అకాడమీ చైర్మన్‌ అల్లం నారాయణ ప్రాతినిథ్యం వహించిన సంఘానికి జిల్లా అధ్యక్షుడిగా ఉన్న మల్లికార్జున.. అక్రమాలకు పాల్పడుతున్నా.. మంత్రి, ప్రెస్‌ అకాడమీ చైర్మన్‌ మౌనం వహించడం అనుమానాలకు తావిస్తోంది.