Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ హౌస్లో ఏదైనా జరగొచ్చు. గత మూడు వారాలుగా షాకింగ్ ఎలిమినేషన్స్ చోటు చేసుకుంటున్నాయి. దామిని, రతికా రోజ్, శుభశ్రీ ఎలిమినేట్ అవుతారని ఊహించలేదు. ముఖ్యంగా రతికా రోజ్ ఇంటిని వీడటం ఊహించని పరిణామం. ఫైనలిస్ట్ అవుతుందని అనుకుంటే నాలుగో వారమే పెట్టే బేడా సర్దుకోవాల్సి వచ్చింది. కన్నింగ్ గేమ్ తో నెగిటివిటీ మూటగట్టుకున్న రతికా రోజ్ ఇంటిని వీడాల్సి వచ్చింది. ఇక ఆరవ వారానికి 7 మంది కంటెస్టెంట్స్ నామినేట్ అయ్యారు.
అమర్ దీప్ , ప్రిన్స్ యావర్, టేస్టీ తేజా, శోభా శెట్టిలతో పాటు కొత్తగా హౌస్లో అడుగుపెట్టిన నయని పావని, అశ్విని శ్రీ, పూజా మూర్తి నామినేట్ కావడమైంది. సందీప్ కూడా నామినేట్ అయ్యాడు. అయితే సీక్రెట్ రూమ్ లో ఉన్న గౌతమ్ కి స్పెషల్ పవర్ ఇచ్చిన బిగ్ బాస్… ఆ పవర్ తో ఒకరి నేరుగా నామినేట్ చేయవచ్చు లేదా ఒకరిని సేవ్ చేయవచ్చు అన్నాడు. గౌతమ్ తన పవర్ తో సందీప్ ని నామినేషన్స్ నుండి తప్పించాడు.
మంగళవారం నుండి ఓటింగ్ ప్రక్రియ మొదలైంది. అనూహ్యంగా ప్రిన్స్ యావర్ టాప్ లో దూసుకుపోతున్నాడని సమాచారం. అతడికి 30 % ఓట్లకు పైగా వచ్చాయట. అతని తర్వాత అమర్ దీప్ రెండో స్థానంలో ఉన్నాడట. అతడికి 20 % ఓట్లు వచ్చాయట. ఇక తేజా మూడో స్థానంలో, అశ్విని శ్రీ నాలుగవ స్థానంలో, నయని పావని ఐదవ స్థానంలో ఉన్నారట. చివరి రెండు స్థానాల్లో పూజా మూర్తి, శోభా శెట్టి ఉన్నారట.
శోభా శెట్టి కంటే పూజా మూర్తి ఒక శాతం ఓట్లు అధికంగా పొందిందట. మరి ఇదే ట్రెండ్ కొనసాగితే శోభా శెట్టి ఎలిమినేట్ కావడం ఖాయం. హౌస్లో ఉన్న టాప్ సెలెబ్స్ లో శోభా శెట్టి ఒకరు. ఆమె గేమ్ కూడా బాగానే ఉంది. ప్రేక్షకులు మాత్రం ఓట్లు వేయలేదని తెలుస్తుంది. ఇక ఆదివారం ఇంటిని వీడేది ఎవరో చూడాలి. మరోవైపు పల్లవి ప్రశాంత్ కోల్పోయిన కెప్టెన్సీ పదవి పొందాడు. ఈ వారం మరొక కొత్త కెప్టెన్ అవతరిస్తాడు.