మర్కజ్ వాళ్ళతోనే ఇంకా కరోనా: ఈటెల

తెలంగాణలో కరోనా వైరస్ ఉదృతి దాదాపు అదుపులోకి వచ్చినప్పటికీ ఇంకా మర్కజ్ వెళ్లి వచ్చిన వారి కారణంగా ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ లో ఈ వైరస్ వ్యాపిస్తున్నదని ఆరోగ్య మంత్రి ఈటెల రాజేందర్ ఆందోళన వ్యక్తం చేశారు. గురువారం మరో 50 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో తెలంగాణలో మొత్తం కేసుల సంఖ్య 700కు పెరిగింది. కొత్త సేకులలో 90 శాతం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనివె అని మంత్రి స్పష్టం చేశారు. వారి నుంచి వారి […]

Written By: Neelambaram, Updated On : April 17, 2020 11:21 am
Follow us on


తెలంగాణలో కరోనా వైరస్ ఉదృతి దాదాపు అదుపులోకి వచ్చినప్పటికీ ఇంకా మర్కజ్ వెళ్లి వచ్చిన వారి కారణంగా ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ లో ఈ వైరస్ వ్యాపిస్తున్నదని ఆరోగ్య మంత్రి ఈటెల రాజేందర్ ఆందోళన వ్యక్తం చేశారు. గురువారం మరో 50 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో తెలంగాణలో మొత్తం కేసుల సంఖ్య 700కు పెరిగింది.

కొత్త సేకులలో 90 శాతం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనివె అని మంత్రి స్పష్టం చేశారు. వారి నుంచి వారి కుటుంబాలకు, దగ్గరివాళ్లకు కరోనా వ్యాపిస్తున్నదని చెప్పారు. వెళ్లి వచ్చిన వారే ఇంకా మరో కొందరు టెస్ట్ లు చేయించుకోలేదని విచారం వ్యక్తం చేశారు. వారిని, వారి కుటుంభం సభ్యులను, వారు కలిసిన వారిని తీసుకువచ్చి టెస్టులు చేయించడానికి పోలీసులు, ఆరోగ్య సిబ్బంది విశేషంగా కృషి చేస్తున్నా ఇంకా కొందరు సహకరించడం లేదని చెప్పారు.

హైదరాబాద్ పాతబస్తీలోని తలాబ్ కట్ట ప్రాంతంలో ఒకే కుటుంబంలో ఒక వ్యక్తి నుండి ఆ కుటంభానికి చెందిన 20 మందికి వైరస్ వచ్చిందని, మరో ఆరుగురు 81మందికి వైరస్ అంటించారని మంత్రి వెల్లడించారు.

కరీంనగర్‌లో మర్కజ్ వెళ్లొచ్చిన ఆరుగురి ద్వారా 81 మందికి కరోనా సోకిందని, అక్కడ 10మంది ఇండోనేషియా పౌరులు వచ్చి ఇంటింటికీ తిరిగారని మంత్రి తెలిపారు. జిల్లా కలెక్టర్, యంత్రాంగం అప్రమత్తమై దిద్దుబాటు చర్యలు చేపట్టి మరిన్ని కేసులు నమోదు కాకుండా చర్యలు తీసుకున్నారని గుర్తు చేశారు. అదే విధంగా ఎక్కువ కేసులు నమోదైన హైదరాబాద్‌లో కూడా కరీంనగర్ తరహా చర్యలు చేపట్టినట్లు తెలిపారు.

అయితే హైదరాబాద్ విషయంలో అక్కడక్కడా ఉల్లంఘనలకు పాల్పడుతుండటంతో కేసుల సంఖ్య పెరుగుతోందని మంత్రి పేర్కొన్నారు. అన్ని తెలిసి పలువురు టెస్టులు చేయించుకోకుండా తప్పించుకుంటున్నారని మంత్రి చెప్పారు.

కాగా, మలక్‌ పేట నుంచి గుజరాత్‌కు వెళ్లొచ్చిన ఇద్దరికి వైరస్ పాజిటివ్ వచ్చిందని, అక్కడక్కడా ఇలాంటి కేసులు నమోదవుతున్నాయని వివరించారు.