Homeఅంతర్జాతీయంBangladesh Fuel Shortage Universities Closed: బంగ్లాదేశ్‌ను తాకిన యుద్ధ సెగ.. యూనివర్సిటీలు మూసివేత!

Bangladesh Fuel Shortage Universities Closed: బంగ్లాదేశ్‌ను తాకిన యుద్ధ సెగ.. యూనివర్సిటీలు మూసివేత!

Bangladesh Fuel Shortage Universities Closed: ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్‌ ప్రకటించిన యుద్ధ ప్రభావం ప్రపంచమంతా విస్తరిస్తోంది. 12 రోజులుగా కొనసాగుతున్న యుద్ధం, ఆర్మూజ్‌ జల సంధి మూసివేత. మరోవైపు ఇరాన్‌ గల్ఫ్‌ దేశాలపై చేస్తున్న వైమానిక దాడులతో ఇంధన ఉత్పత్తి, సరఫరాకు అంతరాయం ఏర్పడింది. దీంతో చముదురు ధర 30 శాతం పెరగింది. అయినా సరఫరా లేనికారణంగా చాలా దేశాలు సంక్షోభం ఎదుర్కొంటున్నాయి. భారత్‌ పొరుగున ఉన్న పాకిస్తాన్, చైనా, శ్రీలంక ఇప్పటికే చమురు ధరలు పెంచాయి. వినియోగం బాగా తగ్గించాయి. ఇప్పుడు ఆ జాబితాలో బంగ్లాదేశ్‌ కూడా చేరింది.

Also Read: హర్మూజ్ జలసంధి కాదు.. మృత్యు మార్గంగా మార్చిన ఇరాన్

యూనివర్సిటీల సెలవులు..
బంగ్లాదేశ్‌లో డీజిల్, పెట్రోల్‌ కొరత కారణంగా మార్చి 9 నుంచి ప్రభుత్వ, ప్రైవేటు విశ్వవిద్యాలయాలన్నింటికీ సెలవులు ప్రకటించారు. విద్యార్థులను ఇళ్లకు తిరిగి పంపేసిన అధికారులు, విద్యుత్, రవాణా ఖర్చులను తగ్గించి ఇంధనాన్ని సంరక్షించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. తరగతులు నిర్వహించడానికి అవసరమైన బస్సులు, ఆటోలు నడపడం కష్టతరం కావడంతో, విద్యా వ్యవస్థ మొత్తం ఆగిపోయింది. ఈ నిర్ణయం తాత్కాలిక ఉపశమనం కల్పించినా, విద్యార్థుల భవిష్యత్తుపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.

భారత్‌ అభ్యర్థన..
ఇక ఇంధన కొరత తీర్చుకోవడానికి, తక్షణ అవసరాల కోసం తారిక్‌ రహ్మాన్‌ ప్రభుత్వం ఇంధన సంక్షోభాన్ని అధిగమించాలని భారత్‌ను సంప్రదించింది. గౌహతి సమీపంలోని నుమలీగఢ్‌ రిఫైనరీ నుంచి 50 వేల మెట్రిక్‌ టన్నుల డీజిల్‌ను వెంటనే సరఫరా చేయాలని ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌కు కోరింది. ఈ అభ్యర్థన పొరుగు సంబంధాల బలాన్ని పరీక్షిస్తోంది, భారత్‌ సహాయం బంగ్లాదేశ్‌ ఆర్థిక స్థిరత్వానికి కీలకం.

ఈ సంక్షోభం బంగ్లాదేశ్‌ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తూ, ఆహారం, రవాణా ధరల పెరుగుదలకు దారితీస్తుంది. యుద్ధం కొనసాగితే, విద్యా మానసిక ఆరోగ్యం, ఉపాధి అవకాశాలపై దెబ్బ తగులుతాయి. పరిష్కారాలుగా, పునరుత్పాదక ఇంధనాలు, డైవర్సిఫైడ్‌ దిగుమతి మార్గాలు, అంతర్జాతీయ సహకారం అవసరం. భారత్‌ సహాయం తాత్కాలిక స్థిరత్వం కల్పిస్తుంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version