https://oktelugu.com/

శ్రీకాకుళం, విజయనగరంల్లో కరోనా ఎందుకు సోకలేదు!

నేడు ప్రపంచం అంతా కరోనా మహమ్మారితో ప్రజలు ఆందోళన చెందుతుంటే, ఉత్తరాంధ్రలోని రెండు జిల్లాలు – శ్రీకాకుళం, విజయనగరంలలో ఒక్క కరోనా పాజిటివ్ కేసు కూడా నమోదు కాక పోవడం చాలామందికి ఆశ్చర్యం కలిగిస్తున్నది. పైగా, ఆ రెండు సరిహద్దుల్లో ఉన్న అటు ఒడిశా, ఇటు విశాఖపట్నం జిల్లాల్లోని ప్రాంతాలలో సహితం ఈ వైరస్ వ్యాప్తినుంచి ఉంది. అందుకు కారణాలు ఏమిటనే పరిశీలనలు పలువురు చేస్తున్నారు. ఈ సందర్భంగా అక్కడి ప్రజల ఆహారపు అలవాట్ల కారణంగా ఈ […]

Written By: , Updated On : April 17, 2020 / 11:46 AM IST
Follow us on


నేడు ప్రపంచం అంతా కరోనా మహమ్మారితో ప్రజలు ఆందోళన చెందుతుంటే, ఉత్తరాంధ్రలోని రెండు జిల్లాలు – శ్రీకాకుళం, విజయనగరంలలో ఒక్క కరోనా పాజిటివ్ కేసు కూడా నమోదు కాక పోవడం చాలామందికి ఆశ్చర్యం కలిగిస్తున్నది. పైగా, ఆ రెండు సరిహద్దుల్లో ఉన్న అటు ఒడిశా, ఇటు విశాఖపట్నం జిల్లాల్లోని ప్రాంతాలలో సహితం ఈ వైరస్ వ్యాప్తినుంచి ఉంది.

అందుకు కారణాలు ఏమిటనే పరిశీలనలు పలువురు చేస్తున్నారు. ఈ సందర్భంగా అక్కడి ప్రజల ఆహారపు అలవాట్ల కారణంగా ఈ వైరస్ వారి దరి చేరలేదనే అభిప్రాయం ప్రబలంగా వ్యక్తం అవుతున్నది. అక్కడి ప్రజలు సాధారణంగా తెలగపిండి వడియంతో తినే గంజి అన్నమే కారణం అనే నిర్ధారణకు పలువురు వస్తున్నారు.

తెలగపిండిలో కరోనా ను ఎదుర్కొనే లక్షణాలు గల ఆవస్యక ప్రోటీన్లు ఉన్నాయని, పైగా ఉత్తరాంద్ర లో ఎక్కువగా పండే ఎర్రనువ్వులు నుండి నూనెతీయగా మిగిలిన తెలప్పిండిలో ఈ గుణాలు ఎక్కువగా ఉన్నాయని, గానుగ పిండైతే రెట్టింపు ప్రయోజనం ఉంటుందని పరిశోధకులు తేల్చారు .

పిండి వడియలు తయారీ లో వాము , పచ్చిమిరప , గళ్ళుప్పు (ముడి ఉప్పు), తోపాటు డబ్బకాయ రసం కలపటం వలన ఆయుర్వేద గుణాలు కూడా జతకలసి పిండొడియానికి వైరస్ పై పోరాడే శక్తి పెరిగింది అని ఆయుష్ విభాగం కూడా దృవీకరించినట్లు చెబుతున్నారు.

పులిసిన గంజి అన్నంలో ఉన్న మంచి బాక్టీరియా, జీర్ణాశయంలో ప్రోబయాటిక్స్ కు పెంచి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది అని కూడా భావిస్తున్నారు.

ఇది ఇలా ఉండగా కరోనా వైరస్ పుట్టుకకు కారనం సూర్యుని పై శని ప్రభావం అనీ, శనికి ఇష్టమైన ఎర్రనువ్వులు ఆ ప్రభావాన్ని దూరంచేయడంలో తోర్పడతాయని మరోవంక జోతిష్య పండితులు చెబుతున్నారు.