బొత్స మాటలు వింటే నవ్వొస్తుంది… కథలు చిన్నారులకు చెప్పండి!

ఈ ఒక్కరోజు లోనే ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి 7 షాకులు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే వాటన్నింటిలోకి అమరావతి రైతులకు ప్రభుత్వం చెల్లించాల్సిన వార్షిక కౌలు, పెన్షన్ మొత్తాన్ని రెండు నెలలుగా జాప్యం చేయడంతో హైకోర్టు వారు జగన్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. తక్షణమే రైతులకు ఆ మొత్తాన్ని అందించవలసిందిగా ప్రభుత్వాన్ని ఆదేశించారు. ఇక వీటన్నింటికంటే ముందు తమకు రావాల్సిన కౌలు డబ్బులు రాకపోవడంతో నిరసన చేస్తున్న అమరావతి రైతులను పోలీసులు […]

Written By: Navya, Updated On : August 28, 2020 10:18 am
Follow us on

ఈ ఒక్కరోజు లోనే ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి 7 షాకులు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే వాటన్నింటిలోకి అమరావతి రైతులకు ప్రభుత్వం చెల్లించాల్సిన వార్షిక కౌలు, పెన్షన్ మొత్తాన్ని రెండు నెలలుగా జాప్యం చేయడంతో హైకోర్టు వారు జగన్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. తక్షణమే రైతులకు ఆ మొత్తాన్ని అందించవలసిందిగా ప్రభుత్వాన్ని ఆదేశించారు. ఇక వీటన్నింటికంటే ముందు తమకు రావాల్సిన కౌలు డబ్బులు రాకపోవడంతో నిరసన చేస్తున్న అమరావతి రైతులను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.

Also Read : ఆంధ్ర రాజకీయాలు కోర్టుల పాలు, ప్రజలు కష్టాలపాలు

అధికార వైసీపీ పై ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడుతున్న సమయంలో అమరావతి రైతులకు వారి కౌలు, పెన్షన్ మొత్తాన్ని నిన్ననే విడుదల చేశామని ప్రభుత్వం చెప్పడం గమనార్హం. మంత్రి బొత్స సత్యనారాయణ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రభుత్వం ఇందుకు సంబంధించి నిధులను విడుదల చేసిందని రైతులకు చెల్లించాల్సిన కౌలు – 158 కోట్ల రూపాయలు, రెండు నెలల పెన్షన్ మొత్తం 9.7 మూడు కోట్ల రూపాయలను విడుదల చేస్తూ నిర్ణయం తీసుకుందని అన్నారు.

ఇక్కడి వరకు బాగానే ఉంది…. కానీ నిన్ననే అనగా ఆగస్టు 26వ తేదీన కౌలు రైతుల పెన్షన్ బ్యాంకులో జమ చేశామని బొత్స సత్యనారాయణ చెప్పడం అందరికీ విడ్డూరంగా కనిపించింది. హైకోర్టు ప్రభుత్వాన్ని నిలదీసిన సమయంలో వారు ఏమీ చెప్పలేదు. పైగా బొత్స సత్యనారాయణ ఇప్పుడు వచ్చి రెండు నెలల నుండి పెండింగ్లో ఉన్న పెన్షన్ నిన్ననే జమ చేశాము…. సాంకేతిక సమస్యల వల్ల ఆలస్యమైందని చెప్పడం చాలా హాస్యాస్పదంగా ఉంది. అంతేకాకుండా ఎంతో విచిత్రమైన రీతిలో కౌలు, రైతుల పెన్షన్ ను ఐదు వేల రూపాయలకు పెంచాలని ప్రభుత్వం భావించిందని… అయితే ప్రతిపక్షాలు హైకోర్టుకు వెళ్లడంతో అది సాధ్యపడలేదు అని అన్నారు.

Also Read : బుక్కైన దేవినేని ఉమ.. నెక్ట్స్ టార్గెట్ అతడేనట?

అంటే ప్రతిపక్షం హైకోర్టు కి వెళ్తే అధికార పక్షం రైతులకు చేయాల్సిన మేలుని చేయకపోవడం ఏమిటో…. ఆ లాజిక్ ఏంటో ఎవరికీ అర్థం కాలేదు. అంతేకాకుండా మంత్రి మాట్లాడుతూ భూహక్కు పత్రాలు అమ్ముకున్న రైతులకు కౌలు చెల్లింపులు జరగవని అన్నారు. అందుకు సంబంధించిన సర్వే జరుగుతోందని ప్రతిపక్షాలు ప్రతి అంశాన్ని రాజకీయం చేస్తున్నాయని చెప్పారు.

ఇక్కడ మంత్రి మాట్లాడిన మాటలు వింటుంటే ఏదో చిన్న పిల్లల కథలు చెప్పేందుకు ఆయన మైకు ముందుకు వచ్చినట్లు ఉందని పలువురు విమర్శిస్తున్నారు. నిన్ననే అకౌంట్లో డబ్బులు జమ చేస్తే ఆ ఆధారాలను హైకోర్టు ముందు ఎందుకు పెట్టలేదు? రైతులకు డబ్బులు పెంచేందుకు ప్రభుత్వాన్ని ఏమి ఆపింది? ఇక సర్వే జరుగుతున్న విషయాన్ని కూడా హైకోర్టు ముందు ఎందుకు వెల్లడించలేదు? మీడియా వారు ఏమన్నా వారికి ఆదేశాలు జారీ చేశారా? జారీ చేసింది హైకోర్టు కదా? సమాచారం అందించాల్సిన కూడా హైకోర్టు వారికే… కానీ మంత్రి ఇలా మీడియా వచ్చి తమ ప్రభుత్వం తప్పిదాలను ఇలా కప్పిపుచ్చడం ఎవరికీ ఏమీ అర్థం కావడం లేదు.

Also Read : ఆంధ్రకు అప్పుల తప్పులు అలవాటే… కానీ జగన్ ది మరీ ఓవర్ అయిపోయింది!