అద్దె ఇళ్లల్లో ఉండేవారికి కేంద్రం గుడ్ న్యూస్ చెప్పనుందా?

రోజురోజుకు పెరుగుతున్న ధరలతో సొంతింటి కళ అనేది అందరికీ సాధ్యం కావడం లేదు. అలాగే ఇతర ప్రాంతాలకు బ్రతుకు దెరువు కోసం వెళ్లేవారు.. ఆయా ప్రాంతాల్లో ఉద్యోగాలు చేసేవారంతా అద్దె ఇళ్లల్లోనే కాలం వెళ్లదీయడం కామన్ అయిపోయింది. అయితే అద్దె ఇళ్లలో ఉండే వారు యజమానుల నుంచి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారిని సమస్యను పరిష్కరించేందుకు కేంద్రం అద్దె చట్టానికి మెరుగులు దిద్దుతుండటంపై పలువురు సంతోషం వ్యక్తం చేశారు. Also Read: ప్రధానికి లేఖ రాసిన సీఎం […]

Written By: Neelambaram, Updated On : August 28, 2020 10:20 am
Follow us on


రోజురోజుకు పెరుగుతున్న ధరలతో సొంతింటి కళ అనేది అందరికీ సాధ్యం కావడం లేదు. అలాగే ఇతర ప్రాంతాలకు బ్రతుకు దెరువు కోసం వెళ్లేవారు.. ఆయా ప్రాంతాల్లో ఉద్యోగాలు చేసేవారంతా అద్దె ఇళ్లల్లోనే కాలం వెళ్లదీయడం కామన్ అయిపోయింది. అయితే అద్దె ఇళ్లలో ఉండే వారు యజమానుల నుంచి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారిని సమస్యను పరిష్కరించేందుకు కేంద్రం అద్దె చట్టానికి మెరుగులు దిద్దుతుండటంపై పలువురు సంతోషం వ్యక్తం చేశారు.

Also Read: ప్రధానికి లేఖ రాసిన సీఎం జగన్… ఎందుకోసమంటే..?

కేంద్రం తీసుకురానున్న కొత్త చట్టం ద్వారా ఇంటి అద్దెల దోపిడీకి చెక్ పడే అవకాశం కన్పిస్తోంది. అద్దె ఇళ్లు వెంటనే ఖాళీ చేయమని.. ఉన్నఫలంగా అద్దె పెంచడం.. ఇంటి యజమానుల వేధింపులు తొలిగిపోయేలా అద్దె చట్టంలో కేంద్రం మార్పులు చేసినట్లు తెలుస్తోంది. అదేవిధంగా అద్దె పెంపుపై మూడు నెలల ముందుగానే అద్దెకు ఉండేవారికి నోటీసు ద్వారా తెలుపాలని చట్టంలో చేర్చారు. ఈ చట్టం కింద సదరు యజమాని అద్దెకారుడికి మధ్య తలెత్తే వివాదాలను కలెక్టర్ సమక్షంలో పరిష్కరించేందుకు వీలు కలుగనుంది.

Also Read:కేంద్రం పై సుప్రీం కోర్టు అసహనం..! లాక్ డౌన్ వేసిన వాళ్ళే పరిష్కారం చూపాలి

వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ఈ చట్టం ఆమోదం పొందుతుందని కేంద్ర గృహ పట్టణ మంత్రిత్వశాఖ కార్యదర్శి దుర్గా శంకర్ మిశ్రా ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈ చట్టం అమలైతే ఖాళీగా ఉన్న 60శాతం పైబడి ఇళ్లు రెంటల్ మార్కెట్లోకి రానున్నాయి. అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అమ్ముడుపోని నిర్మాణాలను అద్దె గృహాలుగా మార్చుకునే అవకాశం లభించనుంది. వీలైనంత త్వరగా చట్టాన్ని అమలు చేసి అద్దె నివాసాల్లో ఉండేవారికి ప్రయోజనం కలిగించాలని కేంద్రం భావిస్తోంది. ఇప్పటివరకు అద్దె భవనాల్లో నివాసం ఉంటూ ఇబ్బందులు పడుతున్నవారికి కేంద్రం నిర్ణయం గుడ్ న్యూస్ అనే చెప్పొచ్చు.