దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ ఏ స్థాయిలో ఉందో అందరికీ తెలిసిందే. ప్రతిరోజూ అంచనాలకు అందని స్థాయిలో దేశవ్యాప్తంగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో వైరస్ నుంచి త్వరగా విముక్తి కలిగించాలనే ఉద్దేశంతో శాస్త్రవేత్తలు అనేక పరిశోధనలు చేస్తున్నారు. తాజాగా జపాన్ శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనల్లో వైరస్ గురించి ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి.
Also Read : రండి రండి.. నాకు కరోనా లేదు.. కూరగాయలు కొనండి!
కరోనా వైరస్ కణాలను ఓజోన్ గ్యాస్ తటస్తం చేయగలదని తెలిపారు. ఆస్పత్రులు, పరీక్షా కేంద్రాలలో ఓజోన్ గ్యాస్ ను వినియోగించి వైరస్ ను నియంత్రించవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 0.05 నుంచి 0.1 పీపీఎం ఓజోన్ గ్యాస్ మనుషులకు హాని చేయని స్థాయిలో వైరస్ ను చంపగలదని చెప్పారు. 600 నిమిషాల పాటు ఓజోన్ గ్యాస్ ను వదిలి అక్కడ దాదాపు 90 శాతం వైరస్ తగ్గినట్టు గుర్తించామని శాస్త్రవేత్తలు తెలిపారు.
చీఫ్ సైంటిస్ట్ తకాయుకి మురాటా లో డెన్సిటీ ఓజోన్ ను గాలిలోకి పంపించడం వల్ల కరోనా వైరస్ కట్టడిలో మంచి ఫలితాలను సాధించడం సాధ్యమవుతుందని చెప్పారు. ఓజోన్ అనేక వ్యాధికారకాలను క్రియారహితం చేయడంలో సహాయపడుతుంది. అయితే ఎక్కువ సాంద్రత కలిగిన ఓజోన్ గ్యాస్ ను గాలిలోకి వదిలితే మాత్రం మానవుల ప్రాణాలకే అపాయం కలుగుతుంది. వైద్య రక్షణ పరికరాలను క్రిమిరహితం చేయడంలో కూడా ఓజోన్ గ్యాస్ సహాయపడుతుందని తెలిపారు.
Also Read : విజయనగరంలో దారుణం… కరోనా మృతదేహాలనూ వదలని నీచులు…?