బీహార్ ఎన్నికలు ఈసారి ఎంతో ఉత్కంఠకు దారితీశాయి. ముందు నుంచి ఆర్జేడీ కూటమి గెలుస్తుందని అందరూ అనుకున్నా.. మరోవైపు ఎగ్జిట్ పోల్స్‌లోనూ ఆర్జేడీ వైపే మొగ్గు చూపగా.. అనూహ్యంగా ఎన్డీయే కైవసం చేసుకుంది. దీంతో మరోసారి నితీశ్ కుమార్ సీఎం బాధ్యతలు చేపట్టబోతున్నారు. దీంతో ఆర్జేడీ కూటమిగా మరోసారి షాక్ తగిలినట్లయింది. విజయానికి దూరంగానే ఉండిపోవాల్సి వచ్చింది.
Also Read: బీహార్ ఫలితం ఏయే రాష్ట్రాలపై ప్రభావం చూపనుంది..?
అలా అని బీజేపీ కూటమికి తిరుగులేని మెజార్టీ ఏమీ రాలేదు. ఒకటి, రెండు సీట్లు తక్కువే వచ్చాయి. విజయం ఖాయమనుకున్న ఆర్జేడీ–-కాంగ్రెస్ కూటమికి విజయాన్ని దూరం చేసిన కారణం.. అసదుద్దీన్ ఓవైసీ. హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ.. బీహార్ ఎన్నికల్లో ఫలితాన్ని తారుమారు చేసేశారు. భారతీయ జనతా పార్టీ కూటమి మరోసారి బీజేపీ అధికారంలోకి రావడానికి కారణంగా మారారు. అసదుద్దీన్ ఓవైపు తన పార్టీని దేశవ్యాప్తంగా విస్తరిస్తానని.. ఎన్నికలు జరుగుతున్న ప్రతీ చోటా పోటీ చేస్తున్నారు.
Also Read: బీహార్‌లో సీన్ రివర్స్.. ఆధిక్యంలోకి ఎన్డీఏ
ముస్లింల ఓట్లను భారీగా చీల్చి ఆయన పరోక్షంగా బీజేపీకి మేలు చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు బీహార్ లో కూడా ముస్లిం జనాభా ఎక్కువ ఉన్న చోటల్లా ఎంఐఎం తరఫున అభ్యర్థులను నిలబెట్టారు ఓవైసీ. అక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు తీవ్రంగా నష్టపోయారు. ఐదు ఎమ్మెల్యే సీట్లలో ఆధిక్యం చూపుతున్న ఎంఐఎం.. కనీసం 20 చోట్ల కాంగ్రెస్ పార్టీతోపాటు.. ఇతర కూటమి అభ్యర్థుల పరాజయానికి కారణమైంది.
మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్
మరోవైపు.. ఈసారి కనుక ఎంఐఎం పోటీలో లేకుంటే ఆ ఓట్లు కూడా మహాకూటమికే వచ్చేవి. కానీ.. ఇప్పుడు ఆ ఓట్లను ఎంఐఎం చీల్చడం ద్వారా 20 స్థానాల్లో బీజేపీ కూటమి గెలుపునకు ఎంఐఎం సహకరించినట్లయింది. ఈ విషయమే గుర్తు చేసుకుని కాంగ్రెస్ నేతలు గుండెలు బాదుకుంటున్నారు. ఫలితాలు తేలాక ఇక చేసేది ఏముంది.. ఓటమిని తలచుకొని ఏడవడం తప్ప.