https://oktelugu.com/

ఏపీ ప్రజలకు జగన్ వరం.. కరోనా వ్యాక్సిన్‌ పంపిణీకి ఏర్పాట్లు

ప్రస్తుతం కరోనా వైరస్ తగ్గుముఖం పట్టింది. రెండో దశ మొదలయ్యే పరిస్థితులు ఉన్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. ఈ క్రమంలో త్వరలోనే కరోనా వ్యాక్సిన్ వెలువడే అవకాశం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ కరోనా వ్యాక్సిన్ పంపిణీకి సంబంధించిన విధివిధానాలు రూపొందించాలని అధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే. Also Read: చంద్రబాబు పోలవరం గుట్టును విప్పిన కేబినెట్ తీర్మానాలు? తాజాగా ఏపీ సైతం కరోనా వైరస్ వ్యాక్సిన్ పంపిణీకి […]

Written By:
  • NARESH
  • , Updated On : November 11, 2020 / 05:24 AM IST
    Follow us on

    ప్రస్తుతం కరోనా వైరస్ తగ్గుముఖం పట్టింది. రెండో దశ మొదలయ్యే పరిస్థితులు ఉన్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. ఈ క్రమంలో త్వరలోనే కరోనా వ్యాక్సిన్ వెలువడే అవకాశం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ కరోనా వ్యాక్సిన్ పంపిణీకి సంబంధించిన విధివిధానాలు రూపొందించాలని అధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే.

    Also Read: చంద్రబాబు పోలవరం గుట్టును విప్పిన కేబినెట్ తీర్మానాలు?

    తాజాగా ఏపీ సైతం కరోనా వైరస్ వ్యాక్సిన్ పంపిణీకి సన్నద్ధమవుతోంది. కరోనా వ్యాక్సిన్ పంపిణీ ప్రణాళిక కోసం జగన్ ప్రభుత్వం రాష్ట్ర స్థాయి స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేసింది. మొత్తం 18 మంది సభ్యులతో స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కమిటీకి చైర్‌పర్సన్‌గా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, కమిటీ కన్వీనర్‌గా ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి, సభ్యులుగా వివిధ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులను ప్రకటించారు.

    ఏపీ కరోనా వైరస్ కట్టడి చర్యల్లో అగ్రభాగంగా నిలిచింది. ఇప్పటికే దేశంలోనే అత్యధిక కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా..గణనీయమైన రికవరీ రేటును కూడా సాధించింది. ఏపీలో ఓ వైపు కరోనా వైరస్ కేసులు గణనీయంగా పెరుగుతున్నా.. కట్టడికి తీసుకుంటున్న చర్యలు కూడా అదే స్థాయిలో ఉన్నాయి. కరోనా నియంత్రణలో ఏపీ మంచి పురోగతి సాధించిందని ఆ మధ్య కేంద్ర ఆరోగ్య శాఖ సైతం ప్రశంసించింది. గణాంకాలు కూడా అదే చెబుతున్నాయి. రాష్ట్రంలో 24 గంటల్లోనే అత్యధికంగా  72 వేల 573 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించి రికార్డు సృష్టించింది ఏపీ ప్రభుత్వం.

    Also Read: జగన్ సర్కార్ కు అశ్వినీదత్ ఝలక్.. కౌంటర్ కూడా ఇవ్వలేరా?

    పది కోట్ల జనాభా ఉన్న రాష్ట్రాలు సైతం ఇన్ని పరీక్షలు ఒకేసారి చేసిన పరిస్థితి ఎక్కడా లేదు. రాష్ట్రంలో ఇప్పటివరకూ 45 లక్షలకు పైగానే నిర్ధారణ పరీక్షలు చేశారు. తాజాగా గడిచిన 24 గంటల్లో 67,910 కరోనా టెస్టులు చేయగా 1,886 మందికి కొవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయ్యినట్లు ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ లో వెల్లడించింది. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 8,46,245కి చేరుకుంది. అయితే, ఇందులో 20,958 యాక్టివ్ కేసులుండగా 8,18,473 మంది కరోనా నుంచి కోలుకున్నారు. గడిచిన 24 గంటల్లో 2,151 మంది కరోనా నుంచి కోలుకున్నారు. అటు ఒక్కరోజులో  కరోనాతో బారినపడి 12 మంది ప్రాణాలను కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య 6,802కి చేరుకుంది.

    మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్

    ఇక దేశంలో వ్యాక్సిన్‌ రాకముందే రాష్ట్రంలో వ్యాక్సిన్‌ పంపిణీకి రూట్‌ మ్యాప్‌ వేయిస్తున్నారు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి.వ్యాక్సిన్‌ రాగానే ప్రజలందరికీ చేరేలా ప్రయత్నాలు ప్రారంభించారు. ఇప్పటివరకు ఏ రాష్ట్రంలోనూ చేయని విధంగా జగన్‌ ఆలోచన చేయడంతో ఆ రాష్ట్ర ప్రజల నుంచి హర్షం వ్యక్తమవుతోంది.