COVID-19 antiviral pill: కరోనా మహమ్మారి ప్రపంచాన్నే గడగడలాడిస్తోంది. దీని ధాటికి మనుషులు భయాందోళన చెందుతున్నారు. ఒకటి, రెండో దశల్లో ప్రజల ప్రాణాలు గాల్లో కలిపిన ఘనత కరోనాదే. అలాంటి ప్రమాదకర వైరస్ పై పోరాడేందుకు ప్రపంచమే సిద్ధంగా ఉన్న నేపథ్యంలో బ్రిటన్ ఓ పరిష్కార మార్గం కనుగొంది. ఇన్నాళ్లు టీకాలతోనే వైరస్ కట్టడి చేసే క్రమంలో బ్రిటన్ ఓ టాబ్లెట్ ను రూపొందించింది. దీంతో ప్రపంచం దృష్టి మొత్తం దీనిపైనే పడుతోంది.

కరోనాను నిరోధించే చర్యలో భాగంగా బ్రిటన్ లో త్వరలో ఈ మాత్ర అందుబాటులోకి రానుందని అమెరికా సంస్థ మెర్క్, రిడ్జ్ బ్యాక్ బయోథెరాప్టిక్స్ సంస్థలు సంయుక్తంగా ఈ మాత్ర వినియోగానికి అనుమతినిస్తున్నట్లు తెలిపాయి. కరోనా సోకిన ఐదు రోజుల్లోపు వేసుకోవడం ప్రారంభిస్తే చాలని పేర్కొంది. దీంతో కరోనాను తరిమికొట్టొచ్చని సూచిస్తోంది.
దీనిపై అమెరికా సమీక్ష నిర్వహిస్తోంది. టాబ్లెట్ వాడకంపై బ్రిటన్ దూకుడుగా ఉన్నా దాని వినియోగంలో వచ్చే ఫలితాలపై అమెరికా ఆరా తీస్తోంది. టాబ్లెట్ వేసుకోవడంతో వచ్చే మార్పులపై అధ్యయనం చేస్తోంది. ఈ నెలలో జరిగే సమావేశంలో అమెరికా ఈ టాబ్లెట్ పై ఓ అవగాహనకు రానున్నట్లు తెలుస్తోంది.
ఈ మాత్రలను వైద్యుల పర్యేవేక్షణలోనే వేసుకోవాల్సి ఉంటుందని సూచిస్తున్నారు. రెమ్ డెసివర్, డెక్సామెథాజోన్ వంటి టాబ్లెట్లు అందుబాటులో ఉన్నా ఇప్పుడు బ్రిటన్ తీసుకొచ్చిన మాత్రలపై అందరి దృష్టి పడుతోంది. ఈ మాత్రలతో కరోనా తరిమేయవచ్చనే అభిప్రాయం అందరిలో వ్యక్తమవుతోంది. బ్రిటన్ లో వైరస్ పెరుగుతున్న క్రమంలో మాత్రలపై అందరు ఎదురుచూస్తున్నారు.
Also Read: Modi Hindutva: హిందువుల హృదయ సామ్రాట్ గా నరేంద్ర మోడీ