Homeఎంటర్టైన్మెంట్JR NTR: వారసులతో తారక్​ దీపావళి సంబరాలు.. ట్రెండింగ్​లో ఫొటోలు!

JR NTR: వారసులతో తారక్​ దీపావళి సంబరాలు.. ట్రెండింగ్​లో ఫొటోలు!

JR NTR: దీపావళి పండగ సందర్భంగా దేశమంతటా దీపాల వెలుగులతో ప్రతి ఇల్లు విరజిల్లిపోయింది. ఇంటింటా బంధువులు, పిల్లల కోలాహలం, బాణాసంచా మెరుపులతో ఫుల్​ సందడి నెలకొంది. ఈ క్రమంలోనే పండుగను పరుస్కరించుకొని ప్రతి ఒక్కరూ సోషల్​ మీడియాలో ఫొటోలను షేర్​ చేశారు. మరోవైపు, సినీ ప్రముఖుల ఫొటోలతోనూ సోషల్ మీడియా మొత్తం కళకళలాడుపోయింది. ఫస్ట్​లుక్​ పోస్టర్​, ప్రోమోలు, ఫొటోలతో నెట్టింట హడావిడి చేశారు సెలబ్రిటీలు. ముఖ్యంగా జూనియర్​ ఎన్టీఆర్​, తన వారసులతో దీపావళి జరుపుకుంటున్న ఫొటోలు ప్రస్తుతం ట్రెండింగ్​లో ఉన్నాయి. అభయ్​ రామ్​, భార్గవ్​ రామ్ మధ్య తారక్​ సంప్రదాయ దుస్తులతో కనిపంచి అభిమానులకు కనువిందు చేశారు.

jr-ntr-celebrating-diwali-with-his-both-sons-and-shared-photos-in-social-media

తారక్​ ఎప్పుడూ తన వారసుల ఫొటోలను సోషల్​మీడియాలో పంచుకునేందుకు ఇష్టపడరు. అయితే, పండగవేళ ముగ్గురు ఇలా సోషల్​మీడియాలో కనిపించడంతో అభిమానుల ఆనందాలకు హద్దులు లేకుండా పోయాయి. కాగా, ఇటీవల ఓ షోలో తన వారసుల గురించి స్పందించిన తారక్​.. అభయ్ రామ్ చాలా సైలెంట్ గా ఉంటాడు కానీ, భార్గవ్ రామ్ చేసే అల్లరి ప్రపంచంలో ఎవరు చేయలేరని.. చిన్నప్పుడు తానూ కూడా ఇలాగే చేసేవాడినని చెప్పుకొచ్చారు.

ప్రస్తుతం తారక్​ ఆర్​ఆర్​ఆర్​ సినిమా షూటింగ్​తో ఫుల్​ బిజీగా ఉన్నారు. రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ఇంది. ఇందులో రామ్​చరణ్​ కూడా హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే. కాగా, అజయ్​ దేవగన్​, ఆలియా భట్​ కూడా కీలక పాత్రల్లో కనిపించనున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది సినిమా.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular