Bunny Vasu: బన్నీ వాసు పై అడ్డమైన కామెంట్లు చేస్తూ గత నాలుగేళ్లుగా విచ్చలవిడిగా సోషల్ మీడియాలో రెచ్చిపోతుంది ఓ జూనియర్ ఆర్టిస్ట్. ఆమె పేరు సునీత బోయ. బన్నీ వాసును వీడని నీడలా వెంటాడుతూ.. ఆయన పై అభ్యంతరకర మెసేజ్ లు పెడుతూ.. తరచు ఫేస్ బుక్ లో హల్ చల్ చేస్తూనే ఉంది. అసలు బన్నీ వాసుకి ఆమెకు సంబంధం ఏమిటి ?

బన్నీవాసు ఎక్కడ ఉన్నాడో తెలుసుకుని మరీ.. అక్కడకి వెళ్లి అతన్ని ఇష్టం వచ్చినట్లు తిట్టాల్సిన అవసరం ఏముంది ? పైగా నాలుగేళ్ల క్రితం బన్నీవాస్ పై ఆమె పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చింది అంటే.. వీరి మధ్య ఏదో జరిగింది అంటూ రూమర్స్ కూడా వచ్చాయి. ముఖ్యంగా సునీత చేస్తోన్న ఆరోపణ ఏమిటంటే.. సినిమాల్లో అవకాశం ఇస్తానని చెప్పి తనను మోసం చేసాడు అని.
అయితే, ఆ తర్వాత ఆమె అభియోగం అబద్ధం అని తేలడం, ఇక పోలీసులు కేసు విచారణ పూర్తి అయ్యాక, ఆమెను అరెస్ట్ చేసి తీసుకెళ్లి మెంటల్ ఆస్పత్రిలో చేర్పించడంతో అప్పట్లో ఆమె వ్యవహారం ముగిసింది అనుకున్నారు. కానీ, ఆమె మాత్రం మళ్ళీ బయటకు వచ్చి ఇష్టం వచ్చినట్లు కామెంట్లు చేస్తూ.. నోటికొచ్చిన బూతులు మాట్లాడుతూ రెచ్చిపోతూ ఉంది.
ఓ దశలో ఈ సునీత బాధ పడలేక బన్నీవాస్ సోషల్ మీడియాకి కూడా దూరం ఉన్నాడు. అయితే, మధ్యలో సునీత కొంతకాలం బన్నీ వాసును వదిలేసి.. అవకాశాల కోసం ప్రయత్నాలు చేసింది. కానీ ఆమెకు ఎలాంటి ఛాన్స్ రాకపోవడంతో మళ్ళీ బన్నీ వాసు వైపు చూస్తోంది. ఛాన్స్ ఇప్పించాలని.. ఇక మీ జోలికి రాను అని మెసేజ్ లు పెడుతుందట.
Also Read: Actor Rajasekhar: దీపావళి నాడు హీరో రాజశేఖర్ ఇంట తీవ్ర విషాదం…
ఒకవేళ తనకు ఎలాంటి ఛాన్స్ చూపించలేక పోతే మాత్రం పరిణామాలు తీవ్రంగా ఉంటాయని బ్లాక్ మెయిల్ కూడా చేస్తోందట. యంగ్ ప్రొడ్యూసర్ గా మంచి పేరు తెచ్చుకున్న బన్నీవాసుకు ఈమె పెద్ద టార్చర్ అయిపోయింది. మాట్లాడితే.. ఇంటి ముందుకొచ్చి ఆత్మహత్యా ప్రయత్నం చేస్తానని చెబుతుందట.
Also Read: Bala Krishna: బాలకృష్ణ – గోపిచంద్ మలినేని మూవీ లో హీరోయిన్ ఫిక్స్… ఎవరంటే ?