Rain Alert: రాష్ట్రంలో వర్షాలు జోరుగా పడనున్నాయి. దీంతో ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తోంది. రాబోయే మూడు రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలుస్తోంది. నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయి. రెండు మూడు రోజుల నుంచి వర్షాలు కురుస్తున్నాయి. మరికొన్ని చోట్ల వానలు పడే సూచనలు కనిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరం, అల్లూరిసీతారామరాజు, అనకాపల్లి జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడే సూచనలు కనిపిస్తున్నాయి.

హైదరాబాద్ లో కూడా వర్షాలు పడే అవకాశముంది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెబుతోంది. వర్షాలు పడితే రోడ్లన్ని జలమయంగా మారే సూచనలు ఉండటంతో అధికారులు జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు. నాలాలు పొంగిపొర్లే ప్రమాదం ఉండటంతో వీలైనంత వరకు ప్రజలన బయటకు రానీయొద్దని హితవు చెబుతున్నారు. అలాగే ఏదైనా ప్రాంతంలో వరద నీరు చేరితో వెంటనే సమాచారం ఇవ్వాలని సూచిస్తున్నారు. భాగ్యనగరంలో భారీ వర్షాలు ప్రజలను కలవరపెడుతున్నాయి.
Also Read: Atmakur By Poll Results: ఆత్మకూరు ఉపఎన్నికల్లో వైసీపీ ఘనవిజయం.. మెజార్టీ ఎంతో తెలుసా?
తెలంగాణలో ఈనెల 28 వరకు భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. అందుకే తెలంగాణలోని జిల్లాలు జాగ్రత్తగా ఉండాలని సూచనలు చేస్తున్నారు. కుమురం భీం ఆసిఫాబాద్, ఆదిలాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. అందుకే ప్రజలు జాగ్రత్తగా ఉండి ప్రమాదాలు రాకుండా చూసుకోవాలని సూచిస్తున్నారు.

తెలంగాణలో భారీ వర్షాలు పడే ప్రమాదముండటంతో అధికారులు నియంత్రణ చర్యలు చేపట్టాలని సూచిస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ప్రమాదకర పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని అధికారులు చర్యలు తీసుకోవాలని చెబుతున్నారు. ఎక్కడైనా ప్రమాదం ఉందని తెలిస్తే వెంటనే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని పేర్కొన్నారు. వాతావరణ శాఖ ఇచ్చిన నివేదికతో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు.
Also Read:Jagan- Presidential Election: రాష్ట్రపతి ఎన్నిక విషయంలో జగన్ ఆ చాన్స్ మిస్సయ్యారా?