ఆస్పత్రుల్లో బెడ్స్ లేవు.. మంత్రులేమో ప్రచారంలోనా?

తెలంగాణలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఒక్కరోజులో 10వేల కేసులు దాటాయి.. మరణాలు భారీగా చోటుచేసుకుంటున్నాయి. ఇవి అధికారిక లెక్కలే.. అనధికారికంగా ఇంకా ఎక్కువే నమోదవుతున్నాయి. కానీ కేసీఆర్ సర్కార్ మాత్రం చోద్యం చూస్తున్నట్టే కనిపిస్తోంది. తెలంగాణలో కరోనా టెస్టులు చేయడం లేదని హైకోర్టు ఎంత మొత్తుకుంటున్నా ప్రభుత్వం పెద్దగా స్పందించడం లేదన్న విమర్శలు ఉన్నాయి. ఇక హైదరాబాద్ సహా జిల్లాల్లో కరోనా పేరిట రోగుల రక్తం తాగుతున్న ప్రైవేటు ఆస్పత్రులపై ప్రభుత్వం నిఘా పెట్టడం లేదని.. […]

Written By: NARESH, Updated On : April 27, 2021 7:32 pm
Follow us on

తెలంగాణలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఒక్కరోజులో 10వేల కేసులు దాటాయి.. మరణాలు భారీగా చోటుచేసుకుంటున్నాయి. ఇవి అధికారిక లెక్కలే.. అనధికారికంగా ఇంకా ఎక్కువే నమోదవుతున్నాయి. కానీ కేసీఆర్ సర్కార్ మాత్రం చోద్యం చూస్తున్నట్టే కనిపిస్తోంది.

తెలంగాణలో కరోనా టెస్టులు చేయడం లేదని హైకోర్టు ఎంత మొత్తుకుంటున్నా ప్రభుత్వం పెద్దగా స్పందించడం లేదన్న విమర్శలు ఉన్నాయి. ఇక హైదరాబాద్ సహా జిల్లాల్లో కరోనా పేరిట రోగుల రక్తం తాగుతున్న ప్రైవేటు ఆస్పత్రులపై ప్రభుత్వం నిఘా పెట్టడం లేదని.. చర్యలు తీసుకోవడం లేదని రోగుల బంధువులు ఆరోపిస్తున్నారు..

తాజాగా మంత్రి ఈటల బయటకొచ్చారు. రాష్ట్రంలో ఆక్సిజన్ కొరత లేదని.. దేశంలోనే యుద్ధ విమానాల ద్వారా ఆక్సిజన్ సిలిండర్లు తెచ్చిన రాష్ట్రం తెలంగాణ అని గొప్పలు చెప్పారు. ఆక్సిజన్ సరఫరాకు ఐఏఎస్ లను నియమించామన్నారు. రోజుకు తెలంగాణలో 270 టన్నుల ఆక్సిజన్ అవసరం ఉంటే.. నిత్యం 400 టన్నులు రాష్ట్రానికి వచ్చేలా ఏర్పాటు చేసినట్లు స్పష్టం చేశారు. తెలంగాణ వ్యాప్తంగా 10వేల ఆక్సిజన్ బెడ్లు సిద్ధం చేశామని మంత్రి ఈటల తెలిపారు. గాంధీ ఆస్పత్రిలోనే 600 ఐసీయూ పడకలున్నాయని తెలిపారు. దేశంలో ఇన్ని ఐసీయూ బెడ్స్ ఎక్కడా లేవన్నారు.

ఇక ప్రైవేటు ఆస్పత్రులు కోవిడ్ బాధితుల నుంచి ఎక్కువ ఫీజులు వసూలు చేస్తున్నాయని మంత్రి ఈటెల ఆరోపించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. కొన్ని ఆస్పత్రుల్లో బిల్లు కట్టకుంటే మృతదేహాన్ని ఇవ్వడం లేదని.. వ్యాపార కోణంలో ఆలోచించే ఆస్పత్రులపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి ఈటల హెచ్చరించారు. సాధారణ పడకలకు రూ.4వేలు, ఐసీయూ పడకలకు రోజు 7500 , వెంటిలేటర్ కు రూ.9వేలు మాత్రమే తీసుకోవాలని ఆర్డర్ వేశారు.

కానీ ఒక రాష్ట్రానికి వైద్య ఆరోగ్యశాఖ మంత్రి అయ్యి ఉండి కరోనా మృతదేహాలను ఇవ్వని ప్రైవేటు ఆస్పత్రులపై విషయంలో ఈటల వ్యవహారిస్తున్న తీరు సరికాదని విమర్శలు వినిపిస్తున్నాయి. తెలంగాణలో ప్రైవేటు దోపిడీ రాజ్యమేలుతోందని.. వాటిని అరికట్టాలంటే ఇప్పటికై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. పేదలు, ప్రజలను ప్రైవేటు ఆస్పత్రుల నుంచి కాపాడాలని సూచిస్తున్నారు.

తెలంగాణలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. గడిచిన 24 గంటల్లోనే ఏకంగా 10వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఏకంగా నిన్న ఒక్కరోజే 52మంది మృతి చెందారు. ఇంత తీవ్రంగా కరోనా ఉన్నా మంత్రులు, సీఎం కేసీఆర్ చోద్యం చూస్తున్నారన్న ఆరోపనలు వస్తున్నాయి.

ఇక తెలంగాణలో ఓ వైపు ఆస్పత్రుల్లో బెడ్స్ దొరకక ఇబ్బందులు పడుతుంటే మంత్రులు మాత్రం ఖమ్మం, వరంగల్ సహా మున్సిపల్ ఎన్నికల్లో బిజీగా ఉండడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా తెలంగాణలో వైద్య ఆరోగ్య రంగాన్ని పట్టించుకోవాలని రోగులు డిమాండ్ చేస్తున్నారు.