https://oktelugu.com/

మీడియా వర్సెస్ బాలీవుడ్.. చివరికీ ఏం కానుంది?

బాలీవుడ్ ఇండస్ట్రీపై గాసిప్స్.. కథనాలు ప్రసారం చేయడం మీడియాకు కొత్తేమీకాదు. వీటిని సెలబ్రెటీలు సైతం పెద్దగా పట్టించుకునేవారు కాదు. అయితే ఇటీవల యంగ్ హీరో సుశాంత్ ఆత్మహత్య తర్వాత పరిస్థితుల్లో మార్పు కన్పించింది. సుశాంత్ ఆత్మహత్య మిస్టరీగా మారడంతో మీడియాలో పెద్దఎత్తున బాలీవుడ్ ఇండస్ట్రీకి వ్యతిరేకంగా కథనాలు ప్రసారమయ్యాయి. Also Read: దండకారణ్యంలో అలజడి: ఆపరేషన్ ప్రహార్ తో మావోల ఏరివేత సుశాంత్ ఆత్మహత్యకు బాలీవుడ్లోని నెపోటిజమే కారణమని కొన్ని మీడియా సంస్థలు పెద్దఎత్తున ఫోకస్ చేశాయి. […]

Written By:
  • NARESH
  • , Updated On : October 20, 2020 / 01:58 PM IST
    Follow us on

    బాలీవుడ్ ఇండస్ట్రీపై గాసిప్స్.. కథనాలు ప్రసారం చేయడం మీడియాకు కొత్తేమీకాదు. వీటిని సెలబ్రెటీలు సైతం పెద్దగా పట్టించుకునేవారు కాదు. అయితే ఇటీవల యంగ్ హీరో సుశాంత్ ఆత్మహత్య తర్వాత పరిస్థితుల్లో మార్పు కన్పించింది. సుశాంత్ ఆత్మహత్య మిస్టరీగా మారడంతో మీడియాలో పెద్దఎత్తున బాలీవుడ్ ఇండస్ట్రీకి వ్యతిరేకంగా కథనాలు ప్రసారమయ్యాయి.

    Also Read: దండకారణ్యంలో అలజడి: ఆపరేషన్ ప్రహార్ తో మావోల ఏరివేత

    సుశాంత్ ఆత్మహత్యకు బాలీవుడ్లోని నెపోటిజమే కారణమని కొన్ని మీడియా సంస్థలు పెద్దఎత్తున ఫోకస్ చేశాయి. దీంతోపాటు ఈ కేసులో పోలీసులకు డ్రగ్స్ లింకులు దొరకడంతో వీటిపై కథనాలను ప్రసారం చేశాయి. నెపోటిజం.. లైగింక వేధింపులు.. డ్రగ్స్ కోణాలు అంటూ బాలీవుడ్లోని చీకటి కోణాలను మీడియా వెలుగులోకి తీసుకొచ్చింది.

    ఈనేపథ్యంలోనే బాలీవుడ్లోని పలువురు సెలబ్రెటీలపై సోషల్ మీడియాలో పెద్దఎత్తున ట్రోలింగ్ జరిగింది. సుశాంత్ మాజీ ప్రియురాలు రియా చక్రవర్తి.. సారా అలీఖాన్.. సల్మాన్ ఖాన్.. అలియాభట్.. దీపిక పదుకోన్.. రకుల్ ప్రీత్ సింగ్ తదితరులపై మీడియాలో వ్యతిరేక కథనాలు వచ్చాయి. దీంతో సోషల్ మీడియాలో #బాయ్ కాట్ బాలీవుడ్ అంటూ నెటిజన్లు పిలుపునిచ్చారు.

    ఈక్రమంలోనే బాలీవుడ్ ఇండస్ట్రీ అంతా ఏకమై మీడియాపై ఎదురుదాడికి సిద్ధమైంది. కొన్ని మీడియా సంస్థల బాధ్యతారహితమైన రిపోర్టింగ్ కు వ్యతిరేకంగా ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఏకంగా 1069పేజీల పిటిషన్ బాలీవుడ్ ను శాసించే అగ్ర నిర్మాణ సంస్థలు దాఖలు చేయడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

    అమీర్ ఖాన్.. షారుఖ్ ఖాన్.. సల్మాన్ ఖాన్.. అజయ్ దేవగణ్.. కరణ్ జోహార్ తదితర హీరోలంతా ఒక్కటై మీడియాకు వ్యతిరేకంగా పిటిషన్ దాఖలు చేయడం ఆసక్తిని రేపుతోంది. పలు మీడియా సంస్థలపై బాలీవుడ్లోని 34పెద్ద నిర్మాణ సంస్థలు కలిసి పిటిషన్ దాఖలు చేసినట్లు తెలుస్తోంది.

    Also Read: బండి సంజయ్ పై తొడగొట్టిన హరీష్ రావు

    ఇండస్ట్రీలోని చీకటి కోణాలపై పెద్దఎత్తున జరుగుతున్న క్రమంలో బాలీవుడ్లోని ప్రముఖులు మీడియాకు వ్యతిరేకంగా ఎదురుదాడికి దిగారు. బాలీవుడ్ వర్సెస్ మీడియాగా ఇష్యూ మారిపోవడంతో మున్ముందు ఏం జరుగుతుందోననే చర్చ మొదలైంది. మీడియా వర్సెస్ బాలీవుడ్ ఇష్యూ ఎలాంటి ట్వీస్టు ఇస్తుందో వేచిచూడాల్సిందే..!