ఏపీలో ‘ఇసుక తుఫాన్’ ప్రారంభంకాబోతోందా..? సీఎం జగన్ తీసుకొచ్చిన కొత్త ఇసుక పాలసీతో అక్కడి ప్రజలకు ఇసుక బంగారమైంది. దీంతో ప్రజల్లోనూ అసంతృప్తి కనిపిస్తోంది. దీంతో ప్రభుత్వం ఈ ఇసుక పాలసీని మార్చాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది.
Also Read: మీడియా వర్సెస్ బాలీవుడ్.. చివరికీ ఏం కానుంది?
నియోజకవర్గాల వారీగా ధర పెట్టి.. టోకెన్లు పెట్టి.. అమ్మకాలు జరపాలని ముఖ్యమంత్రి జగన్ భావిస్తున్నారట. అంతేకాకుండా.. నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న గ్రామాలకు ఎన్ని కిలోమీటర్ల పరిధి వరకు సబ్సిడీ ధరపై ఇసుక సరఫరా చేయవచ్చనే విషయాన్ని కూడా పరిశీలించాలని సీఎం జగన్ ఆఫీసర్లకు సూచించారు. ఇసుక పాలసీపై ఇటీవల జగన్ సమీక్ష నిర్వహించారు.
ఇసుక పై ప్రజల నుంచి ఫీడ్ బ్యాక్ బాగా లేకపోవడం.. పార్టీ నేతలు.. ఇసుకను దోచేస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతుండటంతో ఏదో ఒకటి చేయకపోతే పరిస్థితి చేయి దాటిపోతందన్న ఆందోళన ప్రభుత్వ వర్గాల్లో కనిపిస్తోంది. అందుకే తక్షణం ఇసుక విధానంలో మార్పులు తేవాలని అనుకున్నారంతా. ఇప్పటికే ఇసుక రేటు భారీగా పెరగడంతో.. దానిని కంట్రోల్ చేయాలని సీఎం జగన్ అధికారులకు సూచించారు. అయితే.. ఏ రేటుకు అమ్మాలన్నది నియోజకవర్గాలు లేదా ప్రాంతాల వారీగా నిర్ధారించాలని చెప్పారు. ప్రస్తుతం ఇసుక, మద్యం అక్రమ రవాణా నిరోధం కోసం ఎస్‌ఈబీని ఏర్పాటు చేశారు.
Also Read: టీడీపీ అనుకూల బ్యాచ్ కు గట్టి షాకిచ్చిన సోము వీర్రాజు!
మరోవైపు రాష్ట్రంలో ఇసుక రవాణాపై ఉక్కుపాదం మోపుతూనే ఉన్నారు. ట్రాక్టర్లు, ఎడ్లబండ్లపై ఇసుకను తీసుకెళ్తున్న వారిపైనా కేసులు నమోదు చేస్తున్నారు. అంతేకాదు.. ఏకంగా అధికార పక్ష ఎమ్మెల్యేలే ధర్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఇసుక పాలసీని జగన్ సీరియస్‌గా తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఎలాగైనా ఈ తుఫాన్‌ను అడ్డుకోవాలని చూస్తున్నారట. అందుకే.. కొత్త పాలసీని తీసుకొచ్చి ప్రజల్లో కోపం తొలగించాలని అధికారులు సూచనలు చేశారని తెలుస్తోంది.