Medaram Jathara: ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా గుర్తింపు పొందిన సమ్మక్క సారలమ్మ జాతరకు వళయింది. అమ్మవార్ల ఆగమనానికి సమయం వచ్చేసింది. రెండేళ్లకోసారి ఘనంగా జరిగే జాతరకు ముహూర్తం ఖరారైంది. రేపటి నుంచి 19 వరకు నాలుగు రోజుల పాటు జాతర నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేశారు. తెలంగాణ వ్యాప్తంగా వైభవం జరిగే జాతరకు ప్రభుత్వం కూడా సిద్ధమైంది. జాతర జరిగే స్థలాల్లో సౌకర్యాలు కల్పించేందుకు నిధులు కేటాయించింది. అదే సమయంలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా బందోబస్తు ఏర్పాటు చేసింది.
ప్రాచీన నాగరికిత నుంచి ఆధునికత వరకు ఉన్న సంప్రదాయాల మేళవింపుతో సమ్మక్క జాతర దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహించనున్నట్లు తెలుస్తంది. బుధవారం నుంచి ప్రారంభమై శనివారం వరకు జాతర బ్రహ్మాండంగా జరగనుంది. దీనికి గాను ప్రభుత్వం కూడా అధికార యంత్రాంగాన్ని కేటాయించింది. దీంతో గిరిజన జాతర సంబరం ప్రారంభం కానుంది.
గిరిజన కుంభమేళాగా మేడారం మారనుంది. జనసంద్రంగా మారి కనువిందు చేయనుంది. ఇప్పటికే దేశం నలుమూలల నుంచి భక్తజనం మేడారం వైపు వస్తున్నారు. భక్తులు జంపన్న వాగులో స్నానం చేసి తల్లులను దర్శించుకుని మొక్కులు చెల్లించుకునేందుకు సిద్ధమయ్యారు. ములుగు జిల్లా కేంద్రం నుంచి 44 కిలోమీటర్ల దూరంలో ఉన్న తాడ్వాయి మండలంలోని మేడారం గ్రామం వైపే అన్ని దారులు సాగుతున్నాయి.
ఒరిస్సా, చత్తీస్ గడ్, జార్ఖండ్ రాష్ట్రాలతో పాటు పలు ప్రాంతాల నుంచి గిరిజనులు అధిక సంఖ్యలో వచ్చేస్తున్నారు. దీంతో మేడారం మొత్తం జనసంద్రంగా కనిపిస్తోంది. ఎటు చూసినా జనమే ఎక్కడ చూసినా జాతరే అన్నట్లు గా మేడారం మొత్తం జనంతో నిండిపోయింది. దీంతో అధికారులు కూడా భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశారు.
శివసత్తుల పూనకాలు, ఎదురుకోళ్లు, భక్తుల పారవశ్యం వెరసి సమ్మక్క సారక్క జాతర. ఇప్పటికే 50 లక్షల మంది జనం హాజరైనట్లు తెలుస్తోంది. దాదాపు కోటి మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. దీంతో భక్తులకు కావాల్సిన సదుపాయాలు అన్ని కల్పించారు. తాగునీరు, వైద్యం తదితర అత్యవసర సేవలను అందుబాటులో ఉంచారు.
Also Read: కాంగ్రేసేతర కూటమికి బీజం..? కేసీఆర్, స్టాలిన్ కు మమత ఫోన్
అలాగే భక్తుల కోసం క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. లైన్లో నిలబడినప్పుడు ఎలాంటి అలసట కలగకుండా ఉండేందుకు కూడా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. భక్తుల సేవలో అధికార యంత్రాంగం నిమగ్నమైనట్లు తెలుస్తోంది. భక్తుల కోసం బస్సులు, రైళ్లు, ప్రత్యేక సర్వీసులు నడిపిస్తున్నారు. అత్యవసరమైతే ఆదుకునేందుకు హెలికాప్టర్ ను కూడా అందుబాటులో ఉంచారు.
ఈనెల 16న సారలమ్మ, 17న సమ్మక్క గద్దెల పైకి వస్తారు. తల్లులు గద్దెలపైకి వచ్చేటప్పుడు పోలీసులు గాల్లో కాల్పులు జరిపి అమ్మవార్లకు స్వాగతం పలుకుతారు. 18న ఇద్దరు ఇలవేల్పులు భక్తులకు దర్శనం ఇచ్చి 19న వన ప్రవేశం చేస్తారు. దీంతో జాతర ముగుస్తుంది. ఈ క్రమంలో సమ్మక్క సారలమ్మ జాతర ఓ సుందరమైన స్వప్నంగా నిలవనుంది.
Also Read: కేసీఆర్ పైనా బీజేపీది అదే సర్జికల్ స్ట్రైక్