https://oktelugu.com/

Yogi Adityanath : అట్లుంటది ‘యోగీ’తోని.. చైత్ర నవరాత్రుల సందర్భంగా యూపీలో మాంసం బంద్‌ చేసి షాకిచ్చాడు

Yogi Adityanath : నవరాత్రి అనేది దేశంలో సంవత్సరానికి రెండుసార్లు జరుపుకునే హిందూ పండుగ. చైత్ర మాసంలో అంటే చైత్ర నవరాత్రి (మార్చి–ఏప్రిల్‌), శారద నవరాత్రి (అక్టోబర్‌–నవంబర్‌)లో వస్తుంది. హిందూ క్యాలెండర్‌ ప్రకారం చైత్ర మాసంలో శుక్ల పక్షంలో లేదా.. పౌర్ణమి దశలో మాత్రమే చైత్ర నవరాత్రులను జరుపుకుంటూ ఉంటారు. ఏటా చైత్ర నవరాత్రులు ప్రతిపద తిథి నుంచి ప్రారంభమవుతాయి. ఈ ఏడాది చైత్ర మాస తిథి మార్చి 21వ తేదీ రాత్రి 10.52 గంటలకు ప్రారంభమైంది. ఉదయ […]

Written By:
  • NARESH
  • , Updated On : March 29, 2023 / 03:35 PM IST
    Follow us on

    Yogi Adityanath : నవరాత్రి అనేది దేశంలో సంవత్సరానికి రెండుసార్లు జరుపుకునే హిందూ పండుగ. చైత్ర మాసంలో అంటే చైత్ర నవరాత్రి (మార్చి–ఏప్రిల్‌), శారద నవరాత్రి (అక్టోబర్‌–నవంబర్‌)లో వస్తుంది. హిందూ క్యాలెండర్‌ ప్రకారం చైత్ర మాసంలో శుక్ల పక్షంలో లేదా.. పౌర్ణమి దశలో మాత్రమే చైత్ర నవరాత్రులను జరుపుకుంటూ ఉంటారు. ఏటా చైత్ర నవరాత్రులు ప్రతిపద తిథి నుంచి ప్రారంభమవుతాయి. ఈ ఏడాది చైత్ర మాస తిథి మార్చి 21వ తేదీ రాత్రి 10.52 గంటలకు ప్రారంభమైంది. ఉదయ తిథి ప్రకారం మార్చి 22 నుంచి చైత్ర నవరాత్రులు ప్రారంభమయ్యాయి. చైత్ర నవరాత్రి హిందూ నూతన సంవత్సరానికి నాందిగా పరిగణించబడుతుంది. ఈ ఏడాది చైత్ర నవరాత్రి సందర్భంగా ఉత్తరప్రదేశ్‌ సీఎం యోగీ ఆదిత్యనాథ్‌ కీలక, సంచలన నిర్ణయం తీసుకున్నారు. 25 కోట్ల జనాభా ఉన్న రాష్ట్రంలో చైత్ర నవరాత్రులతోపాటు, శ్రీరామ నవమి వరకు రాష్ట్రవ్యాప్తంగా మాంసం విక్రయాలు బంద్‌ చేశారు.

    -దుర్గామాత పూజ. .
    చైత్ర నవరాత్రుల్లో ప్రజలు దుర్గా మాతను పూజిస్తారు. ఆమెను ప్రసన్నం చేసుకోవడానికి 9 రోజులు ఉపవాసం ఉంటారు. 9 రోజులు ఉపవాసం ఉండలేని వారు మొదటి రోజు, చివరి రోజు ఉపవాసం ఉంటారు. నవరాత్రి ఉపవాస సమయంలో ఆహారం తీసుకోరు. ఈ సమయంలో పాలు, పెరుగు, పండ్లు మాత్రమే తీసుకుంటారు.

    -తొమ్మిది రకాల పూజలు..
    ఈ చైత్ర నవరాత్రులలో 9 రోజులు ప్రత్యేకమైనవి. ఈ 9 రోజులలో తొమ్మిది రకాల పూజలు ఉంటాయి. ప్రతి రూపానికి ఒక విశిష్టత ఉంటుంది. వాటి ఆరాధనా విధానం కూడా తదనుగుణంగా ఉంటుంది. తొమ్మిది అవతారాలలో ఉన్న మాతను ప్రతీరోజు ఒక్కో అవతారంలో ఉన్న మాతను పూజిస్తారు.

    -హిందూ పవిత్రతను కాపాడేలా..
    హిందూ పండుగల పవిత్రతను కాపాడేలా యోగా ఆదిత్యనాథ్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. చైత్ర నవరాత్రి రోజుల్లో రాష్ట్రంలో ఎవరూ మాంసం ముట్టకుడదని నిర్ణయించారు. ఈమేరకు రాష్ట్రవ్యాప్తంగా వసంత చైత్ర నవరాత్రుల సందర్భంగా మార్చి 22 నుంచి ఏప్రిల్‌ 2 శ్రీరామ నవమి వరకు మద్యం, మాంసం అమ్మకాలు పూర్తిగా నిలిపివేయాలని ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో రాష్ట్రంలో మద్యం, మాంసం అమ్మకాలు పూర్తిగా నిలిచిపోయాయి.

    -చరిత్రలో తొలిసారి..
    దేశ చరిత్రలోనే ఇలాంటి నిర్ణయం తీసుకోవడం తొలిసారని పండితులు పేర్కొంటున్నారు. గాంధీ జయంతి, స్వాతంత్య్ర దినోత్సవాల్లో మాంసం విక్రయించొద్దనే నిబంధన ఉన్నా చాలా వరకు అమలు కావడం లేదు. కానీ యోగా ఆదేశాలు ఉత్తర ప్రదేశ్‌లో పక్కాగా అమలవుతున్నాయి. ఒక హిందూ పండుగకు ఇలాంటి నిర్ణయం తీసుకుని అమలు చేయడంపై హిందూ సమాజం హర్షం వ్యక్తం చేస్తోంది.

    -ప్రభుత్వ ఆదాయానికి భారీగా నష్టం..
    మద్యం, మాంసం అమ్మకాలు నిలిపివేయడం ద్వారా ప్రభుత్వానికి భారీగా నష్టం జరుగుతుంది. నిత్యం ఉత్తర ప్రదేశ్‌లో మద్యం అమ్మకాల ద్వారా సగటున రూ.100 కోట్లకుపైగా ఆదాయం వస్తుంది. ఇక మాసం విక్రయాలు నిత్యం మరో రూ.100 కోట్లకు పైగానే జరుగుతాయి. ప్రభుత్వం ఆదాయం కోల్పోతుందని తెలిసినా యోగీ తీసుకున్న నిర్ణయంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.

    -ఒకవర్గం దుష్ప్రచారం..
    ఇక ఉత్తరప్రదేశ్‌లో అన్నివర్గాలవారు, కుల మతాలకు అతీతంగా యోగీ నిర్ణయాన్ని స్వాగతిస్తుంటే ఆ రాష్ట్రం వెలుపల ఉండే ఒక వర్గం వారు మాత్రం తప్పుడు ప్రచారం మొదలు పెట్టారు. రంజాన్‌ మాసం ప్రారంభమైన సందర్భంగా యోగి కావాలనే మాంసం విక్రయాలు నిలిపివేశారని ఆరోపిస్తున్నారు. ఈ మేరకు సోషల్‌ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. కానీ, ఉత్తర ప్రదేశ్‌లో ఈ ప్రచారాన్ని ఎవరూ పట్టించుకోవడం లేదు. ప్రచారం చేస్తున్న వర్గానికి చెందనవారు కూడా యోగి ఆదేశాలు పాటిస్తామని పేర్కొనడం కొసమెరుపు.