కాంగ్రెస్ పార్టీకి మాయావతి జలక్?

రాజస్థాన్ రాజకీయాలు రోజురోజుకు వేడిక్కిపోతున్నాయి. స్వతంత్ర ఎమ్మెల్సేల మద్దతుతో కాంగ్రెస్ రాజస్థాన్లో అధికారం చేపట్టింది. అలాంటిది సొంత నేతల విషయంలో ఆచితూచి వ్యవహరించాల్సిపోయి ప్రభుత్వాన్ని కూల్చుకునే స్థాయికి తెచ్చుకుంది. రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్, డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ మధ్య నెలకొన్న విభేధాలు రాజకీయ సంక్షోభానికి దారితీశారు. పైలట్ తన వర్గం నేతలతో కాంగ్రెస్ పై తిరుగుబాటు చేయడంతో ప్రభుత్వం మైనార్టీలోకి వెళ్లింది. Also Read: బాబు బ్రాండ్ ఇమేజ్ కాశ్మీర్ దాకా పాకింది. కాంగ్రెస్ […]

Written By: Neelambaram, Updated On : July 30, 2020 8:08 pm
Follow us on


రాజస్థాన్ రాజకీయాలు రోజురోజుకు వేడిక్కిపోతున్నాయి. స్వతంత్ర ఎమ్మెల్సేల మద్దతుతో కాంగ్రెస్ రాజస్థాన్లో అధికారం చేపట్టింది. అలాంటిది సొంత నేతల విషయంలో ఆచితూచి వ్యవహరించాల్సిపోయి ప్రభుత్వాన్ని కూల్చుకునే స్థాయికి తెచ్చుకుంది. రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్, డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ మధ్య నెలకొన్న విభేధాలు రాజకీయ సంక్షోభానికి దారితీశారు. పైలట్ తన వర్గం నేతలతో కాంగ్రెస్ పై తిరుగుబాటు చేయడంతో ప్రభుత్వం మైనార్టీలోకి వెళ్లింది.

Also Read: బాబు బ్రాండ్ ఇమేజ్ కాశ్మీర్ దాకా పాకింది.

కాంగ్రెస్ నెలకొన్న సంక్షోభాన్ని అధిష్టానం సర్దిబాటు చేయలేకపోయింది. సీఎం గెహ్లాట్ తనకు 103మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని కాంగ్రెస్ అధిష్టానానికి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో పైలట్ వర్గానికి చెందిన నేతలపై కాంగ్రెస్ వేటు వేసేందుకు సిద్ధపడగా వారంతా హైకోర్టును ఆశ్రయించడంతో కథ అడ్డం తిరిగింది. తమపై వేటువేయకుండా పైలట్ వర్గం ముందస్తుగా హైకోర్టును ఆశ్రయించడంతో వారిపై వేటుపడలేదు. ఇదిలా ఉంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక బీఎస్పీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్సేలను ఆపార్టీలో చేర్చుకుంది.

కాంగ్రెస్ లో బీఎస్పీ విలీనమైందని ఆపార్టీ ప్రకటించడంపై బీఎస్పీ అధ్యక్షులు మాయవతి న్యాయస్థానంలో సవాల్ చేశారు. బీఎస్పీ జాతీయ పార్టీ కావడంతో కాంగ్రెస్ లో విలీనం చెల్లందంటూ మాయవతి చెబుతున్నారు. అయితే తాజాగా తమ పార్టీకి చెందిన ఎమ్మెల్సేలకు మాయవతి విప్ జారీ చేయడం ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయాలని మాయవతి విప్ జారీ చేయనున్నారు. దీంతో ఆ ఎమ్మెల్యేలంతా న్యాయనిపుణులను సంప్రదిస్తున్నారు. పార్టీ విప్ దిక్కరిస్తే ఎమ్మెల్యేపై వేటు తప్పదని ఆమె హెచ్చరిస్తుంది.

Also Read: విద్యావ్యాపారాన్ని ప్రక్షాళించిన మోదీ

కాంగ్రెస్ కు ప్రస్తుతానికి 103మంది ఎమ్మెల్సే మద్దతు ఉన్నట్లు తెలుస్తోంది. వీరిలో నుంచి ఆరుగురు ఎమ్మెల్సేలను తీసేస్తే 97మంది మాత్రమే ఉంటారు. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం మైనార్టీలో పడిపోయినట్లే. ఒకవైపు సచిన్ పైలట్ వర్గం కూడా అశోక్ బలపరీక్షకు సిద్ధమైనపుడు తన సత్తా చూపుతామంటోంది. మరోవైపు మాయవతి కూడా కాంగ్రెస్ పార్టీ షాకిచ్చేందుకు రెడీ అవుతోంది. దీంతో అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం బలపరీక్షలో నెగ్గుతారా? లేదా అనేది ఆసక్తికరంగా మారింది.