టీడీపీ నాయకులలో అమరావతిని కాపాడుకోలేమనే అభద్రతా భావం పెరిగిపోయినట్లుంది. వాళ్ళు పోరాటంలో పసలేకపోవడంతో ప్రతిరోజూ కేంద్రం జోక్యం చేసుకోవాలని భజన చేస్తున్నారు. టీడీపీ నేత మాజీ మంత్రి యనమల రామకృష్ణడు మీడియా ద్వారా వైసీపీ ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. ఆంధ్రప్రదేశ్ లో ఫ్యూడల్ పాలన నడుస్తుందన్న ఆయన నిమ్మగడ్డ నియామకం ఎందుకు ఆలస్యం చేస్తున్నారు. అలాగే రాజధానుల వికేంద్రీకరణ మరియు సీఆర్డీఏ రద్దు బిల్లులను ఎందుకు రాష్ట్రపతి ఆమోదానికి పంపడం లేదని ప్రశ్నించారు. ఏపీ ప్రభుత్వం హద్దుమీరి ప్రవర్తిస్తున్న నేపథ్యంలో కేంద్రం కలుగజేసుకోవాలని ఆయన చెప్పడం విశేషం.
Also Read: బాబు మళ్లీ మళ్లీ అదే తప్పు చేస్తున్నారా?
అధికారంలో ఉన్నప్పుడు బాబుతో పాటు టీడీపీ నేతలు కేంద్రంపై చేసిన ఆరోపణలు గుర్తు చేసుకుంటే యనమల రామకృష్ణుడి నేటి వ్యాఖ్యలకు నవ్వురాకపోదు. ఒకప్పుడు రాష్ట్ర వ్యవహారాలలో కేంద్ర జోక్యం ఏమిటి? మీ పెత్తనం క్రింద మేము బ్రతకాలా? అని చంద్రబాబు తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలోకి సీబీఐ ప్రవేశించకుండా ప్రత్యేక జీవో ప్రవేసిన పెట్టిన బాబు ఘనచరిత్రను ఆంధ్రప్రజలు మరచిపోయి ఉండరు. అలాంటిది ఇప్పుడు ప్రతి విషయంలో కేంద్రం జోక్యం కోరుకోవడంతో టీడీపీ నేతల నైతికత ఏమిటో అర్థం అవుతుంది.
Also Read: జగన్ ‘ఇంగ్లిష్ మీడియం’కు కొత్త చిక్కులు?
మరోవైపు ప్రతిపక్షంగా మేము పోరాటం చేయలేక పోతున్నాం, మీరు రంగంలోకి దిగండి అన్నట్లుగా టీడీపీ వ్యవహారం ఉంది. ఏడాది పాలకనే మేము ఏమి చేయలేకపోతున్నాం, కేంద్రం నువ్వే చూసుకో అంటే, ప్రజలకు వీరిపై ఏమి నమ్మకం కలుగుతుంది చెప్పండి. మరోవైపు బీజేపీ జనసేన కూటమి దూసుకు వస్తుంది. బలహీనపడిన టీడీపీ స్థానాన్ని కైవశం చేసుకోవాలని అనుకుంటుంది. ఈ సమయంలో టీడీపీ కి బీజేపీ ప్రత్యామ్యాయం కాదనేలా వారు ప్రజా పోరాటం సాగించాలి. అలా కాకుండా ప్రతి చిన్న విషయానికి కేంద్రం వైపు చూస్తే ప్రజలకు ప్రతిపక్షంపై ఉన్న ఆ నమ్మకం కూడా పోతుంది.