Presidential Elections 2022: రాష్ట్రపతి ఎన్నికలు నిన్న ముగిశాయి. 99 శాతం పోలింగ్ నమోదైంది. దీంతో ద్రౌపది ముర్ము ఎన్నిక ఖాయమే. అన్ని రాష్ట్రాల్లో క్రాస్ ఓటింగ్ జరిగినట్లు తెలుస్తోంది. ఆడబిడ్డ అయిన ద్రౌపది ముర్ముకే అందరు ఓటు వేసినట్లు సమాచారం. విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హా పోటీలో ఉన్నా గిరిజనురాలు అయిన ద్రౌపది ముర్ముకే అందరు మొగ్గు చూపారు. భారత దేశ చరిత్రలో మొట్టమొదటి సారి ఓ గిరిజన మహిళకు అవకాశం దక్కుతుంటే ఎవరు మాత్రం కాదంటారు. ఏదో నామ్ కే వాస్తేగా ప్రచారం చేసినా ఆయనకు కూడా తెలుసు. తాను గెలవనని. విపక్షాల బలవంతం మీద అభ్యర్థిగా నిలబడినా ఓటమి ఖాయమనే తెలిసిపోయింది. అందుకే ఆయన ఎక్కువ ప్రచారం నిర్వహించలేదు.
విపక్షాలు ఏదో సాధిద్దామని అనుకున్నా వారి ఆశలు నెరవేరలేదు. అంతా అనుకున్నారు బీజేపీని డైలమాలో పడేద్దామని కానీ వారే ఆలోచనలో పడిపోయారు. క్రాస్ ఓటింగ్ తీరు చూస్తుంటే ద్రౌపది ముర్ము ఎన్నిక లాంఛనమే అని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ సీఎం కేసీఆర్ ఏం చెబుతారు. బీజేపీని బంగాళాఖాతంలో కలిపేస్తామని ప్రగల్బాలు పలడకమే కానీ అది అంత సాధ్యం కాదని ఇప్పటికే తెలిసిపోయి ఉంటుంది. కానీ మేకపోతు గాంభీర్యం ప్రదర్శించడం కేసీఆర్ కు అలవాటే. ఇందులో భాగంగానే యశ్వంత్ సిన్హాను హైదరాబాద్ కు రప్పించి నానా హంగామా చేసినా చివరకు ఏమైంది. కేసీఆర్ అనుకున్నంత సులభం కాదు బీజేపీని ఓడించడం అని తెలిసిపోయింది.
Also Read: CM Jagan Review Meeting: ఏపీలో సచివాలయానికి రూ.20 లక్షల చొప్పున నిధులు.. జరిగే పనేనా?
ఆయా రాష్ట్రాల అసెంబ్లీల్లో ఎమ్మెల్యేలు, ఎంపీలు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అర్థరాత్రి వరకు బ్యాలెట్ బాక్సులు పార్లమెంట్ కు చేరాయి. జులై 21 గురువారం ఓట్ల లెక్కింపు చేపడతారు. అనంతరం ఫలితాలు ప్రకటిస్తారు. ద్రౌపది ముర్ము ఎన్నిక అందరూ ఊహించినదే. కానీ ఫలితాలు ప్రకటించిన తరువాత రాష్ట్రపతి ఎవరనేది నిర్ధారిస్తారు. అంతవరకు ఓపిక పట్టాల్సిందే. ఒక గిరిజన మహిళ దేశ అత్యున్నత పదవి అలంకరించడం ప్రజాస్వామ్య చరిత్రలో ఇదే తొలిసారి కావడంతో అందరిలో ఉత్కంఠ నెలకొంది.
రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ ప్రధాన భూమిక పోషించినట్లు తెలుస్తోంది. అస్సాం, ఒడిశా, గుజరాత్, మహారాష్ట్ర, హర్యానా వంటి రాష్ట్రాల్లో క్రాస్ ఓటింగ్ జరిగినట్లు తెలుస్తోంది. 771 ఎంపీలు, 4025 మంది ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పలు పార్టీల్లోని సభ్యులు తమ ఓటుకు దూరంగా ఉన్నారు. కొందరు అనారోగ్యాల కారణంగా దూరమైతే మరికొందరు ఏవో కారణాలతో ఓటు వేయలేదు. మొత్తానికి ద్రౌపది ముర్ము రాష్ట్రపతి అభ్యర్థిగా విజయం సాధిస్తుందని తెలుస్తోంది. క్రాస్ ఓటింగ్ యశ్వంత్ సిన్హాకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది.
Also Read: Presidential Polls 2022: రాష్ట్రపతి ఎన్నికల్లో వైసీపీ కీలకంగా మారిందా?