https://oktelugu.com/

కొవాగ్జిన్ టీకాపై ఇన్ని అనుమానాలా?

వ్యాక్సిన్ సమర్థత, క్లినికల్ ట్రయల్స్ ఫలితాలు పరిశీలించకుండానే భారత్ బయోటెక్ వారి కొవాగ్జిన్ టీకాకు అనుమతులిచ్చారనే విమర్శలు వస్తున్నాయి. ఇదే టీకాకు అమెరికా ఎఫ్ డీఏ అనుమతి నిాకరించింది. సీరం వారి కొవిషీల్డ్ కంటే కొవాగ్జిన్ సమర్థత తక్కువనే వాదోపవాదాలు వస్తున్నాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. కొవాగ్జిన్ టీకా మూడో దశ క్లినికల్ ట్రయల్స్ పూర్తి డేటా ఈనెల 20లోగా వెల్లడవుతుందని కేంద్రం పేర్కొంది. నీతి ఆయోగ్ ఆరోగ్య వ్యవహారాల సభ్యుడు డాక్టర్ […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : June 12, 2021 / 09:29 AM IST
    Follow us on

    వ్యాక్సిన్ సమర్థత, క్లినికల్ ట్రయల్స్ ఫలితాలు పరిశీలించకుండానే భారత్ బయోటెక్ వారి కొవాగ్జిన్ టీకాకు అనుమతులిచ్చారనే విమర్శలు వస్తున్నాయి. ఇదే టీకాకు అమెరికా ఎఫ్ డీఏ అనుమతి నిాకరించింది. సీరం వారి కొవిషీల్డ్ కంటే కొవాగ్జిన్ సమర్థత తక్కువనే వాదోపవాదాలు వస్తున్నాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. కొవాగ్జిన్ టీకా మూడో దశ క్లినికల్ ట్రయల్స్ పూర్తి డేటా ఈనెల 20లోగా వెల్లడవుతుందని కేంద్రం పేర్కొంది.

    నీతి ఆయోగ్ ఆరోగ్య వ్యవహారాల సభ్యుడు డాక్టర్ వీకే పాల్ శుక్రవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ భారత్ బయోటెక్ వారి కొవాగ్జిన్ టీకా ట్రయల్ డేటా ఈనెల 20లోగా అందాల్సి ఉంది క్లినికల్ ట్రయల్స్ ఫలితాల డేటా తొలుత సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ కు చేరుతుంది. ఆ సంస్థ పరిశీలన అనంతరమే ప్రచురణ కోసం డేటాను మీడియాకు విడుదల చేస్తామని పాల్ తెలిపారు.

    భారత్ బయోెక్ వారి కొవాగ్జిన్ టీకాకు అమెరికాలో భాగస్వామిగా ఉన్న ఆక్యుజెన్ ఫార్మా సంస్థ అనుమతుల కోసం దరఖాస్తు చేసుకోగా, అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ర్టేషన్ అధికారులు నిరాకరించారు. టీకా పనితీున నిర్ధారించే క్లినికల్ ట్రయల్స్ డేటాపై సమగ్ర సమాచారం లేనందునే కొవాగ్జిన్ టకాను ఎఫ్ డీఐ నిాకరించింది. భారత్ లో మాత్రం ట్రయల్స్ డేటా లేకున్నా అనుమతులు లభించడంపై నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్ వివరణ ఇచ్చారు.

    మూడో దశ క్లినికల్ ట్రయల్స్ డేటా వెల్డికి సంబంధించి బారత్ బయోటెక్ ప్రకటనకు కూడా తాజా ప్రకటన భిన్నంగా ఉండటం గమనార్హం. కొవాగ్జిన్ ట్రయల్స్ డేటాను జుై నాటికి అందుబాటులో ఉంచుతామని ఆ సంస్థ ప్రకటన చేయగా 24 గంటలు తిరగకుండానే కేంద్రం సదరు డేటా జూన్ 20 లోపే వెల్లడి కానుందని చెప్పింది. మరోవైపు భారత్ బయోటెక్ , కొవాగ్జిన్ టకాపై నాలుగో దశ క్లినికల్ ట్రయల్స్ ను సైతం త్వరలో ప్రారంభించనుంది.