https://oktelugu.com/

కరోనా వేళ ‘క్యాష్’ చేసుకుంటున్న హీరోయిన్లు

కరోనా కల్లోలంలో జనాలకు ఆదాయం లేక అగచాట్లు పడుతున్నారు. సినిమాలు తీసిన నిర్మాతలు వడ్డీల భారంతో కుదేలవుతున్నాయి. ఇంత కరువులోనూ మన హీరోలు, హీరోయిన్లు ఏమాత్రం పారితోషికం తగ్గించకుండా నిర్మాతలకు మరింత భారం అవుతున్నారు. తగ్గించకపోక రెమ్యూనరేషన్లు పెంచుతూ కాకరేపుతున్నారు. అనేక రంగాలలో కరోనా కారణంగా పరిస్థితి భయంకరంగా ఉంది. ఆర్థికంగా మందగమన పరిస్థితులున్నాయి. కథానాయికల పారితోషికాలు మాత్రం చెక్కుచెదరకుండా ఉన్నాయి. ప్రస్తుతం హిట్ ట్రాక్‌లో ఉన్న హీరోయిన్లకు భారీ పారితోషికం పొందుతున్న వైనం చర్చనీయాంశమవుతోంది. హిట్ […]

Written By:
  • NARESH
  • , Updated On : June 12, 2021 / 09:53 AM IST
    Follow us on

    కరోనా కల్లోలంలో జనాలకు ఆదాయం లేక అగచాట్లు పడుతున్నారు. సినిమాలు తీసిన నిర్మాతలు వడ్డీల భారంతో కుదేలవుతున్నాయి. ఇంత కరువులోనూ మన హీరోలు, హీరోయిన్లు ఏమాత్రం పారితోషికం తగ్గించకుండా నిర్మాతలకు మరింత భారం అవుతున్నారు. తగ్గించకపోక రెమ్యూనరేషన్లు పెంచుతూ కాకరేపుతున్నారు.

    అనేక రంగాలలో కరోనా కారణంగా పరిస్థితి భయంకరంగా ఉంది. ఆర్థికంగా మందగమన పరిస్థితులున్నాయి. కథానాయికల పారితోషికాలు మాత్రం చెక్కుచెదరకుండా ఉన్నాయి. ప్రస్తుతం హిట్ ట్రాక్‌లో ఉన్న హీరోయిన్లకు భారీ పారితోషికం పొందుతున్న వైనం చర్చనీయాంశమవుతోంది. హిట్ ట్రాక్‌లో లేని హీరోయిన్లు కూడా తమ పారితోషికాన్ని పెంచుకుంటుండడం విశేషంగా మారింది.

    ప్రతి రోజు పండుగ’ సినిమా తరువాత, రాశి ఖన్నా ప్రస్తుతం గోపిచంద్ తో “పక్కా కమర్షియల్” లో మరియు నాగ చైతన్యతో “థాంక్యూ” లో సినిమాల్లో నటిస్తోంది. వీళ్లిద్దరూ పెద్ద హీరోలు కాకున్నా రాశీ మాత్రం పారితోషికం విషయంలో కాంప్రమైజ్ కావడం లేదు. రాశి తెలుగు చిత్రాలతో పాటు తమిళంలో మూడు, మలయాళంలో ఒకటి చేస్తోంది. అందువల్ల ఆమె 1 కోటి రూపాయలకు తగ్గకుండా డిమాండ్ చేస్తోంది. ప్రతిరోజు పండుగ సినిమా కోసం రాశిఖన్నా రూ .75 లక్షలు తీసుకుంది.

    ఇటీవలి కాలంలో పెద్ద హిట్స్ చూడని మెహ్రీన్ కూడా రూ.50 లక్షలు డిమాండ్ చేస్తోందట.. ఎఫ్ 3 సినిమా తర్వాత మారుతి చిత్రంలో నటించడానికి ఆమె ఆ మొత్తాన్ని డిమాండ్ చేసింది. ప్రస్తుతం ఈమెకు సుమారు 40-45 లక్షలకు పారితోషికం సెట్ చేయాలని చూస్తున్నారు.