Jagan Chandrababu KCR: ముందుగా వచ్చిన వెనకొచ్చిన కొమ్ములకే వాడి ఎక్కువ. పార్టీని నమ్ముకుని సేవలు చేసిన వారికంటే తరువాత వచ్చే వారికే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇందులో భాగంగానే కొత్తగా పార్టీలో చేరే వారికే పదవులు దక్కడంతో పార్టీని నమ్ముకున్న వారికి చేదు అనుభవమే మిగులుతోంది. ముందు నుంచి జెండా మోసిన వారికి మాత్రం మొండిచేయే చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో నేతలు నిరాశ పడుతున్నారు. పార్టీకి సేవలు చేసిన ఫలితం మాత్రం దక్కడం లేదని ఆందోళన చెందుతున్నారు.
ఇటీవల కాలంలో తెలంగాణలో ఇలాంటి సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. హుజురాబాద్ ఉప ఎన్నిక సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాలు ఇందుకు తార్కాణంగా నిలుస్తున్నాయి. టీడీపీ రాష్ర్ట అధ్యక్షుడిగా ఉన్న ఎల్. రమణను పార్టీలో చేర్చుకుని ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. అప్పుడే పార్టీలోకి వచ్చిన కౌశిక్ రెడ్డికి కూడా ఎమ్మెల్సీ పదవి ఇచ్చిన సంగతి తెలిసిందే.
కానీ ఏపీ ముఖ్యమంత్రి జగన్ మాత్రం పార్టీకి విధేయులైన వారికే పదవులు కేటాయించడానికి మొగ్గు చూపుతారు. వారు ఎంతటి వారైనా కానీ పార్టీని నమ్ముకున్న వారికే అందలాలు వేస్తారు. లేదంటే వారు కొత్తగా పార్టీలో చేరినా పెద్ద ప్రయోజనాలు మాత్రం ఇవ్వడానికి వెనకాడతారు. దీంతో ఏడాది కాలంగా వైసీపీలో చేరే వారి సంఖ్య క్రమేపీ తగ్గుతోంది. అయినా లెక్క చేయడం లేదు.
Also Read: Inter Student Sabitha Drives Auto : ఆడపిల్ల అని చులకనగా చూస్తే.. సబిత ఏం చేస్తుందో తెలుసా.?
పార్టీకి ముందు నుంచి పనిచేసినా కొందరికి మాత్రం పదవులు అందని ద్రాక్షగానే మిగులుతున్నాయి. దీంతో వారు పార్టీని వీడలేక ఇతర పార్టీల్లో చేరలేక డైలమాలో పడిపోతున్నారు. గతంలో చంద్రబాబు నాయుడు కూడా ఇలాగే పార్టీని నమ్ముకున్న వారికి ప్రాధాన్యం ఇవ్వకపోవడంతోనే ఆయన పార్టీ అధికారానికి దూరమైందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాజకీయాల్లో పలు మార్పులు చోటుచేసుకుంటున్నాయి.