Naga Chaitanya: జీవితంలో పెళ్లి కీలక ఘట్టం. నూరేళ్ళపాటు ఒక వ్యక్తితో సాగించాల్సిన ప్రయాణం. ఈ శాశ్వత బంధంలో తోడుగా ఉండే భార్య లేదా భర్తను ఎంచుకోవడం పైనే మన జీవితం ఆధారపడి ఉంటుంది. అర్థం చేసుకునే భాగస్వామి దొరకకపోతే రోజూ నరకమే. గొడవలు, తగాదాలతో సాగే వైవాహిక జీవితం నరకం చూపిస్తుంది. భార్యాభర్తలు అన్నాక చిన్న చిన్న గొడవలు, గిల్లికజ్జాలు సర్వసాధారణం. అయితే వివాదాలు, ద్వేషాలు రగిలితే కలిసి ఉండటం చాలా కష్టం. ఇక నేటి తరం ఈ విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వరు. ఏమాత్రం తేడా వచ్చినా ‘లెట్స్ బ్రేకప్’ అంటారు.
తాజాగా నాలుగేళ్ల వైవాహిక జీవితానికి స్వస్తి చెప్పి విడాకులు ప్రకటించిన సమంత-నాగ చైతన్య నిర్ణయం అభిమానులను, టాలీవుడ్ వర్గాలను షాక్ కి గురిచేసింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న వీరి బంధం ఇలా చేదుగా ముగుస్తుందని ఎవరూ ఊహించలేదు. ఏది ఏమైనా సమంత, చైతూ ఇప్పుడు బార్యాభర్తలు కారు. ఎవరి జీవితం వారిదే. ఇద్దరూ తమ తమ వృత్తుల్లో బిజీ అయ్యారు. అయితే నాగార్జున చైతన్య కోసం అమ్మాయిని వెతికే పనిలో పడ్డారట.
నాగ చైతన్యకు 35 ఏళ్ళు దాటాయి. దీనితో త్వరగా పెళ్లి చేయడం ఉత్తమం అని భావిస్తున్నారట. ఈ సారి చైతూ పెళ్లి విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారట. నాగ చైతన్య మనస్తత్వాన్ని అర్థం చేసుకునే అమ్మాయిని తీసుకురావడం ద్వారా.. వాళ్ళ కాపురం హాయిగా ఉండేలా ప్రణాళికలు రచిస్తున్నారట. అర్థం చేసుకునే స్వభావం, సహనం కలిగిన అమ్మాయి కోసం వెతుకుతున్నారట. అది కూడా తన సన్నిహితులు, బంధువర్గం నుండే ఎంచుకోవాలని నాగార్జున ఆలోచనట.
Also Read: Heroines: అందమైన హీరోయిన్లు విలన్ గా నటించిన సినిమాలు ఏవో తెలుసా..?
నాగ చైతన్య రెండో వివాహమైనా శాశ్వతం కావాలని, ఆమె రాకతో చైతూ జీవితం ఆనందకరంగా మారాలి అని తాపత్రయ పడుతున్నారట. నెలల వ్యవధిలోనే నాగ చైతన్య పెళ్లి ప్రకటన వచ్చే ఛాన్స్ ఉందని టాలీవుడ్ వర్గాల బోగట్టా. కాగా సమంతతో నాగ చైతన్య పెళ్ళికి నాగార్జున అంగీకరించలేదు. పట్టుబట్టి చైతూ.. సమంతను వివాహం చేసుకున్నారు. అందుకే ఈసారి చైతూ పెళ్లి విషయంలో పూర్తి నిర్ణయం నాగార్జునదేనట.
Also Read: Shilpa Chowdary: హీరోకి రూ.3 కోట్లకు ఎగనామం పెట్టిన ‘కిలాడి’!