PRC: ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగుల పరిస్థితి అధ్వానంగా మారింది. దీంతో వారు ఆందోళన బాట పట్టేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే వారు సీఎం జగన్ ను కలిసి తమ పరిస్థితి వివరించారు. కొద్ది రోజులుగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. దీంతో ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తామని సీఎం ప్రకటించడంపై ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పది రోజుల్లో పీఆర్సీ ప్రకటిస్తామని చెప్పడంతో ఉద్యోగుల్లో ఆశలు రేకెత్తుతున్నాయి. మొత్తానికి సీఎం స్వయంగా ప్రకటన చేయడంతో ఇక కష్టాలు తీరినట్లేనని ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి.

Also Read: ఏపీ సర్కార్ కు భారీ జరిమానాలు.. షాక్ లాగా
సీఎం జగన్ పది రోజుల్లో పీఆర్సీ ప్రకటన ఉంటుందని చెప్పడంతో పది రోజులు దాటితే ఉద్యమం చేస్తామని ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి. ఇన్నాళ్లు వేచి చూసినా తమ సహనం నశిస్తే ఫలితాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరికలు చేస్తున్నాయి. ప్రభుత్వం ఇచ్చిన గడువులోగా స్పందన రాకపోతే ఉపేక్షించేది లేదని చెబుతున్నాయి. దీంతో ప్రభుత్వం ప్రకటనపై ఉద్యోగ సంఘాలు సుముఖత వ్యక్తం చేసినా ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే ఊరుకునేది లేదని హెచ్చరికలు జారీ చేస్తున్నాయి.
దీనిపై ఉద్యోగ సంఘాలు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసి తమ డిమాండ్లు ప్రకటించేందుకు సిద్ధమవుతున్నాయి. పీఆర్సీ నివేదిక, కాంటాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ, సీపీఎస్ రద్దు వంటి వాటిని తక్షణమే పరిష్కరించాలని కోరుతున్నాయి. లేకపోతే ఉద్యమం తప్పదని చెబుతున్నాయి. దీంతో ప్రభుత్వంపై ఉద్యోగుల సంఘాల డిమాండ్లు ఏ మేరకు ప్రభావం చూపుతాయో వేచి చూడాల్సిందే.
Also Read: ఈ స్కీమ్ లో డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే ఎక్కువ వడ్డీ.. ఎలా అంటే?