Homeఆంధ్రప్రదేశ్‌New Rules In AP schools: ఏపీలోని స్కూళ్లలో కొత్త రూల్స్.. ఇక వాటిని పాటించడం...

New Rules In AP schools: ఏపీలోని స్కూళ్లలో కొత్త రూల్స్.. ఇక వాటిని పాటించడం కంపల్సరీ..

New Rules In AP schools: దేశంలో కరోనా కేసుల సంఖ్య ప్రతి రోజు లక్షల్లో నమోదవుతున్నది. ఇందులో ఎక్కువ కేసులు కొన్ని రాష్ట్రాల్లోనే వెలుగులోకి వస్తున్నాయి. అలాంటి రాష్ట్రంలో ఏపీ సైతం ఉన్నది. ఏపీలో కొవిడ్ కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ప్రతి రోజూ వేల కేసులు నమోదువుతున్నాయి. దీంతో ప్రజల్లో ఆందోళన మరింత ఎక్కువైంది. దీనికి తోడు పాఠశాలకు వెళ్లే విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రుల్లో టెన్షన్ తగ్గడం లేదు. కేసులు పెరుగుతున్న కారణంగా విద్యాసంస్థలను ప్రభుత్వం మూసి వేస్తుందని ఓ పక్క ప్రచారం జరుగుతోంది.

New Rules In AP schools
New Rules In AP schools

కానీ ప్రభుత్వం మాత్రం అలాంటిది ఏం ఉండదని విద్యాసంస్థలను కొనసాగిస్తామని చెబుతోంది. దీంతో విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. కొందరు స్కూళ్లకు రావడం కూడా మానేశారు. ఇలా జరుగుతుండటం తో విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఆ రాష్ట్ర విద్యాశాఖ కీలక ఉత్తర్వులు జారీ చేసింది.

New Rules In AP schools
New Rules In AP schools

పాఠశాలలకు గతంలో జారీ చేసిన కరోనా ప్రోటోకాల్ ఫాలో అవుతూనే.. కొత్త రూల్స్ పాటించాలని సూచించింది. కొవిడ్ కారణంగా విద్యాసంస్థల్లో ప్రార్థనా కార్యక్రమాలు, ఆటలను పూర్తిగా నిషేధిస్తూ ప్రభుత్వం నిర్ణయించింది. విద్యార్థులు ఒకే చోట గుంపులు గుంపులుగా ఉండకుండా భౌతిక దూరం పాటించాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. పాఠశాలల పరిసరాలను, క్లాస్ రూంలను ఎప్పటికప్పుడు శాటిటైజ్ చేయాలని పేర్కొంది.

Also Read: AP Schools: ఏపీలో స్కూళ్ల సెలవులపై ప్రభుత్వం కీలక ప్రకటన

టీచర్లు, స్టూడెంట్స్ తప్పనిసరిగా భౌతికదూరం పాటించాలని, మాస్క్ ధరించాలని సూచించింది. విద్యాసంస్థల్లో శానిటైజర్లు అందుబాటులో ఉంచాలని స్పష్టం చేసింది. స్టూడెంట్స్ ఎప్పటికప్పుడు చేతులకు కడుక్కునే విధంగా వారిలో అవగాహన కల్పించాలని పేర్కొంది. ఎవరికైనా కొవిడ్ పాజిటివ్ అని తేలితే వెంటనే డాక్టర్లను సంప్రదించాలని, తగిన చర్యలు తీసుకోవాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. కరోనా బారిన పడిన విద్యార్థులు, టీచర్లకు మెరగైన ట్రీట్‌మెంట్ అందించాలని సూచించింది. ఈ నిబంధనలు అమలవుతున్నాయా లేదా అని రీజినల్ జాయింట్ డైరెక్టర్లు, జిల్లా విద్యాశాఖ అధికారులు, క్షేత్రస్థాయి ఆఫీసర్లు తనిఖీలు నిర్వహిస్తూ రూల్స్ అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి.

Also Read: కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ వేగవంతమయ్యేనా?

Mallesh
Malleshhttps://oktelugu.com/
Mallesh is a Political Content Writer Exclusively writes on Telugu Politics. He has very good experience in writing Political News and celebrity updates.
Exit mobile version