District Under The Name Of NTR: ఆంధ్రప్రదేశ్ లో సీఎం జగన్మోహన్ రెడ్డి తనదైన శైలిలో మార్పులు చేసుకుంటున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు కొత్త జిల్లాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా పరిపాలనా సౌలభ్యం కోసం జిల్లాలుగా విభజించేందుకు కార్యాచరణ రూపొందించారు. పరిపాలనలో కూడా కొత్తదనం చూపించాలని చూస్తున్నారు. ప్రతిపక్షాలను సైతం ఇరుకున పెట్టేందుకు మార్గం సుగమం చేసుకుంటున్నారు. విమర్శకుల నోళ్లకు తాళం వేసే పనిలో పడిపోయారు.
ఇన్నాళ్లు సొంత పార్టీ డబ్బా కొట్టుకున్న సీఎం జగన్ ప్రస్తుతం కొత్త నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ప్రతిపక్ష నేతలకు సైతం ప్రచారం తీసుకొచ్చేందుకు సిద్ధమయ్యారు. కొత్త జిల్లాల ఏర్పాటులో ఎన్టీఆర్ సొంత జిల్లాలో మచిలీపట్నం జిల్లా కేంద్రంగా చేస్తుండటంతో దానికి ఆయన పేరు పెట్టాలని నిర్ణయించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. దీంతో టీడీపీకి కూడా చెక్ పెట్టాలని చూస్తున్నట్లు సమాచారం.
Also Read: కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ వేగవంతమయ్యేనా?
ఇదే జరిగితే చంద్రబాబును డైలమాలో పడేసేందుకు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఎన్టీఆర్ పేరుపెడితే టీడీపీ నేతలకు మింగుడుపడదని తెలిసిందే. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల నేపథ్యంలో ఎన్టీఆర్ పేరుపెట్టేందుకు కీలక నిర్ణయం తీసుకున్నట్లు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో జగన్ తాను అనుకున్నది చేయడంలో ఆయనకు ఆయనే సాటి అని తెలుస్తోంది.
దీంతో జగన్ ముందస్తు వ్యూహాల్లో భాగంగానే టీడీపీని దెబ్బ కొట్టాలని చూస్తున్నట్లు చెబుతున్నారు. ఎన్టీఆర్ పేరు పెడితే టీడీపీకి తిప్పలే వచ్చే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. దీంతో టీడీపీలో కూడా భయాందోళనలు నెలకొన్నాయి. జగన్ వ్యూహంలో భాగంగానే కొత్త జిల్లాల ఏర్పాటులో కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది.
Also Read: ఏపీలోని స్కూళ్లలో కొత్త రూల్స్.. ఇక వాటిని పాటించడం కంపల్సరీ..