Indian Temple: ప్రాచీన దేవాలయాలకు భారతదేశం ప్రసిద్ధి. ఎన్నో ఏళ్ల నుంచి ఇక్కడ ఆలయాలు నిర్మిస్తూ వస్తున్నారు. శతాబ్దం కింద నిర్మించిన ఆలయాలు ఇప్పటికీ చెక్కుచెదరనివి ఉన్నాయి. ప్రతీ ఆలయం ఓ చరిత్రను కలిగి ఉంటుంది. అలాగే కన్యాకుమారిలోని ఈ ఆలయానికి ఓ ప్రత్యేకత ఉంది. ఇక్కడి ఆలయంలోకి మహిళలు మాత్రమే వెళ్లాలట. ఇందులోకి పురుషులకు ప్రవేశం లేదట. సాధారణంగా ఆలయానికి కుటుంబ సమేతంగా వెళ్తుంటాం. కానీ ఈ ఆలయంలో మాత్రం అలా కుదరదంటున్నారు. అయితే మహిళలు వెళ్లకూడని ఆలయాలను చూశాం. కానీ పురుషులు వెళ్లకూడని ఆలయ చరిత్ర ఏంటి..? ఎందుకు మగవాళ్లు వెళ్లకూడదని నిర్ణయించారు..?
భారతదేశానికి దక్షిణాన చివరి ప్రాంతం కన్యాకుమారి. ఇక్కడి ప్రాంతం పర్యాటకంగా బాగా అభివృద్ధి చెందింది. ఇక్కడున్న ఆలయం శక్తి పీఠాల్లో ఒకటిగా నిలిచింది. బంగాళాఖాతం ఒడ్డున్నఉన్న ఇందులోకి మగవాళ్లు వెళ్లొద్దనడానికి పురాణంలో ఓ కథ ఉంది. దాని ప్రకారం.. భార్య మరణంతో తీవ్ర దు:ఖంలో ఉన్న శివుడు ఆమెను కైలాసానికి తీసుకెళ్తాడు. ఆమెను తీసుకెళ్తుండగా వెన్నెముక ఈ ప్రాంతంలో పడుతుంది. అందుకే ఇక్కడున్న ఆలయం శక్తి పీఠాల్లో ఒకటిగా మారింద. అయితే ఆలయంలో ఉన్న భగవతి మాతా సన్యాసిగా కొలువై దీరిందట. ఇక్కడున్న దేవతను కన్యాకుమారిగా పిలుస్తారు. కుమారి అంటే పెళ్లికాలేదని అర్థం. అందువల్ల సన్యాసం పొందిన వారికి మాత్రమే ఈ ఆలయంలోకి ప్రవేశం ఉందట.
కేరళలోని అలపూజలోని చెక్కలత్తకువుల్ టెంపుల్ లో దుర్గామాత కొలువై ఉంది. ఈమాతను ఎంతో నియమ నిష్టలతో కొలుస్తారు. ఇక్కడ మిగిలిన వేడుకలతో పాటు సంక్రాంతిలో చేసే నారిపూజ, ధనుర్మాసంలో ప్రత్యేక పూజలు చేస్తారు. నారి పూజను 7 రోజుల పాటు చేస్తారు. ధను పూజను 10 రోజులు చేస్తారు. ఈ పూజల సమయంలో ఆ గుడిలోకి మగవాళ్లను వెళ్లనివ్వరు. ఈ పూజ సమయంలో మగవారు ప్రవేశిస్తే దుర్గామాత ఆగ్రహానికి గురవుతారని భక్తుల నమ్మకం.
రాజస్థాన్ లోని పుష్కర్ అనే ఊల్లో బ్రహ్మ దేవాలయం ఉంది. మన దేశంలో బ్రహ్మకు ఉన్న ఒకే ఒక్క దేవాలయం ఇది. ఈ గుడిలోకి పెళ్లికాని మగవారు వెళ్లరాదు. పూర్వం బ్రహ్మ ఈ ప్రాంతంలో ఒక మహా యజ్ఒం చేపట్టాడు. యాగం మొదలు పెట్టిన సమయంలో బ్రహ్మ భార్య సరస్వతి రావడం ఆలస్యమైందట. యాగం చేసేవారు ధర్మం ప్రకారం సతీసమేతంగా పాల్గొనాల్సి ఉంటుంది. అయితే సరస్వతి రావడం ఆలస్యం కావడంతో బ్రహ్మ గాయత్రి దేవిని పెళ్లి చేసుకొని యాగాన్ని ఆరంభించాడు. అయితే ఆ తరువాత సరస్వతి వచ్చి బ్రహ్మ చేసిన పనికి అతనిని శపిస్తుందట. ఆ శాపం ప్రకారంగా ఆ ఆలయంలోకి పెళ్లికాని మగవారు రాకూడదంటారు.
కేరళలోని తిరువనంతపురంలోని అర్టికల్ టెంపుల్ కు మరో ప్రత్యేకత ఉంది. ఈ ఆలయంలో కన్యకా దేవి కొలువై ఉంటుంది. ఈ మాత పార్వతి దేవి రూపంగా చెప్పుకుంటారు. సంక్రాంతి పండుగ దినాల్లో ఈ గుడిలోకి మగవారికి నిషేధం. ఈ సమయంలో ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ కార్యక్రమాలన్నీ ఆడవారే చేస్తారు.
Also Read: హిందూ దేవాలయాలపై ప్రభుత్వ పెత్తనం ఏ విధంగా న్యాయం?