Manda Krishna Madiga: ఏపీలో కూటమికి జై కొట్టిన మందకృష్ణ

కాంగ్రెస్ పార్టీకి దళితులు బలమైన మద్దతు దారులుగా నిలుస్తూ వచ్చారు. ఉమ్మడి ఏపీలో జాతీయ పార్టీగా ఉన్న కాంగ్రెస్ వైపు అడుగులు వేశారు. ఎన్టీఆర్ టిడిపి స్థాపించినప్పుడు మిగతా వర్గాలు ఆ పార్టీకి అండగా ఉన్నా..

Written By: Neelambaram, Updated On : March 19, 2024 12:46 pm

Manda Krishna Madiga

Follow us on

Manda Krishna Madiga: ఏపీ ఎన్నికల్లో దళితులు ఎటువైపు? వైసీపీ వైపు వెళ్తారా? కూటమి వైపు టర్న్ అవుతారా? బలమైన చర్చ ఇప్పుడు నడుస్తోంది. అయితే దళితుల్లో చీలిక వచ్చి తలోవైపు ఉంటారన్న సంకేతాలు వెలువడుతున్నాయి. ప్రధానంగా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ బాహటంగానే ఎన్డీఏకు మద్దతు తెలిపారు. దీంతో మాదిగలు కూటమి వైపు నడిచే అవకాశం ఉంది. మాలలు మాత్రం వైసిపి వైపు అడుగులేస్తారన్నది బహిరంగ రహస్యం. 29 రిజర్వుడు నియోజకవర్గాల్లో వైసిపి 19 స్థానాలను మాలలకు కేటాయించింది. మాదిగలకు కేవలం పది స్థానాలకే పరిమితం చేసింది. దీన్నిబట్టి ఆ పార్టీ ప్రాధాన్యత తెలుస్తోంది. ఈ తరుణంలోనే మంద కృష్ణ మాదిగ ప్రత్యేక ప్రకటన చేయడం విశేషం.

కాంగ్రెస్ పార్టీకి దళితులు బలమైన మద్దతు దారులుగా నిలుస్తూ వచ్చారు. ఉమ్మడి ఏపీలో జాతీయ పార్టీగా ఉన్న కాంగ్రెస్ వైపు అడుగులు వేశారు. ఎన్టీఆర్ టిడిపి స్థాపించినప్పుడు మిగతా వర్గాలు ఆ పార్టీకి అండగా ఉన్నా.. దళితులు మాత్రం కాంగ్రెస్ పార్టీ నే తమ పార్టీగా చూసుకున్నారు. అందుకే చంద్రబాబు హయాంలోమాదిగ రిజర్వేషన్లకు జై కొట్టారు.మాదిగల అభిమానాన్ని చూరగొన్నారు. వారిని తమ వైపు తిప్పుకున్నారు. దళితుల్లో చీలిక తేగలిగారు. మాదిగల మద్దతు పొందగలిగారు. అయితే రాష్ట్ర విభజన తో సీన్ మారింది. దళితులు ఏకపక్షంగా వైసీపీ వైపు వెళ్లారు. కాంగ్రెస్ పార్టీ తర్వాత వైసీపీని ఓన్ చేసుకున్నారు. ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీకి దళితుల మద్దతు కరువైంది. మాలలతో పోల్చుకుంటే మాదిగల సంఖ్య ఏపీలో తక్కువగా ఉండడమే అందుకు కారణం.

అయితే రాజ్యాంగబద్ధ కేటాయింపులు, సబ్ ప్లాన్ నిధులను వైసీపీ ప్రభుత్వం పక్కదారి పట్టించడంతో ఒక రకమైన ఆగ్రహం ఉంది. దళితుల కోసం ప్రత్యేక పథకాలు కేటాయించకపోవడం, నవరత్నాల్లోనే వారి లెక్కలు చూపించడం వంటి కారణాలతో అసంతృప్తి అలుముకుంది. దీంతో ఒక రకమైన చేంజ్ కనిపిస్తోంది. మరోవైపు మంద కృష్ణ మాదిగ ద్వారా మాదిగలను పూర్తిగా కూటమి వైపు టర్న్ అయ్యేలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ ఎన్నికల్లో కృష్ణ మాదిగ బిజెపికి సపోర్ట్ చేశారు. బిజెపితోనే మాదిగ రిజర్వేషన్లు సాధ్యమని భావిస్తున్నారు. అందుకే ఏపీలో కూటమికి మద్దతుగా ప్రత్యేక ప్రకటన చేశారు. దీనిపై మాలలు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. అయితే ఇప్పటికే మాల సామాజిక వర్గం వైసీపీకి ఏకపక్షంగా మద్దతు తెలపడంతో.. ఆ నష్ట నివారణకు మాదిగలను వినియోగించుకోవాలని ప్రధాని భావించారు. అటు చంద్రబాబు ఆలోచన కూడా అదే విధంగా ఉంది. అందుకే మందకృష్ణ మాదిగతో ప్రత్యేక ప్రకటన చేయించినట్లు తెలుస్తోంది.