Sukesh vs Kavithakka: వెల్కమ్ టు తీహార్ జైల్ కవితక్క..

సుఖేష్ చంద్రశేఖర్ విడుదల చేసిన లేఖలో పలు సంచలన విషయాలను పేర్కొన్నాడు. "భారతదేశంలో చట్టం అన్నింటికంటే శక్తివంతమైనది. అబద్దాలతో నిజాలను ఎల్లకాలం దాచివేయలేరు.

Written By: Anabothula Bhaskar, Updated On : March 19, 2024 12:38 pm

Sukesh vs Kavithakka

Follow us on

Sukesh vs Kavithakka: ఢిల్లీ మద్యం కుంభకోణంలో అరెస్ట్ అయిన భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు.. ఆర్థిక నేరగాడు సుఖేష్ చంద్రశేఖర్ సంచలన లేఖ రాశాడు. నిన్న మొన్నటి వరకు కవితను లక్ష్యంగా చేసుకున్న అతడు ఎన్నో లేఖలు రాశాడు. వాటిని తన న్యాయవాది ద్వారా విడుదల చేశాడు. చేసిన పనులకు సంబంధించి కర్మ ఫలితాన్ని అనుభవించక తప్పదని, కర్మ కవితను వెంటాడుతోందని సుఖేష్ పేర్కొన్నాడు. అప్పట్లో తనకు, కవితకు మధ్య జరిగిన వాట్సాప్ చాటింగ్ వివరాలను తన న్యాయవాది ద్వారా బయటపెట్టాడు. అప్పట్లో వాటిని తప్పుడు ఆరోపణలు అంటూ కవిత అన్నారు.

సుఖేష్ చంద్రశేఖర్ విడుదల చేసిన లేఖలో పలు సంచలన విషయాలను పేర్కొన్నాడు. “భారతదేశంలో చట్టం అన్నింటికంటే శక్తివంతమైనది. అబద్దాలతో నిజాలను ఎల్లకాలం దాచివేయలేరు. నన్ను ఎవరూ ఏమీ చేయలేరు అనుకునేవారు ఒకటి తెలుసుకోవాలి. వారు చేసిన కర్మ ఫలితాన్ని అనుభవించాలి. నేను గతంలో మీడియాకు కొన్ని లేఖలు విడుదల చేశాను. అందులో కొన్ని విషయాలను ప్రముఖంగా ప్రస్తావించాను. ఒకటి భారత రాష్ట్ర సమితి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోతుంది. రెండవది తీహార్ క్లబ్లో చేరేందుకు కవితకు సమయం ఆసన్నమైంది. ఇవన్నీ ఇప్పుడు నిజమయ్యాయి. కవిత అరెస్టుతో అవినీతి పండోరా బాక్స్ తెరుచుకుంది. ఆమె మాత్రమే కాదు.. ఆమెకు సహకరించిన సహాయకులు, అవినీతికి రాజు లాంటి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చేసిన అక్రమాలు, దురాగతాలు ఒక్కొక్కటిగా బయటపడతాయంటూ” సుఖేష్ లేఖలో పేర్కొన్నాడు.

కుమ్మక్కయింది

పైన చెప్పిన అంశాలు మాత్రమే కాకుండా ఇంకా కొన్ని కీలక విషయాలను సుకేష్ లేఖలో వెల్లడించాడు. “వేలకోట్ల ప్రజాధనాన్ని దోచుకొని సింగపూర్, హాంగ్ కాంగ్, జర్మనీ వంటి దేశాలకు పంపించారు. అవి మొత్తం బయటికి వస్తాయి. ఇవి ఎవరికి తెలియాలో వారికి తెలిశాయి. అక్కా.. నేను నీతో జరిపిన వాట్సాప్ చాట్ స్క్రీన్ షాట్ ల ద్వారా నీ డబ్బాల కథలను బయటపెట్టాను. రేంజ్ రోవర్ యవ్వరాలను బయటి ప్రపంచానికి వినిపించాను. గోవా కథలు, కాంట్రాక్ట్ కథలు దర్యాప్తులో బయటికి వచ్చాయి. ఇక నువ్వు బయటపడే మార్గం లేదక్కా. ఇప్పటికైనా నా విజ్ఞప్తి ఒక్కటే. అవినీతికి మూలవిరాట్ అరవింద్ కేజ్రీవాల్ ను రక్షించే ప్రయత్నం ఎట్టి పరిస్థితుల్లో చేయొద్దు. నిజాన్ని దాచొద్దు. ఎందుకంటే ఈ దేశ ప్రజలకు, న్యాయస్థానాలకు నిజాలు తెలుస్తున్నాయి. వాటిని బలపరిచే సాక్ష్యాలు, ఆధారాలు లభిస్తున్నాయని” సుఖేష్ లేఖలో పేర్కొన్నాడు..

ముఖాముఖి చూస్తాను

” ఎన్ ఫోర్స్ మెంట్, సీబీఐ అధికారుల విచారణలో మిమ్మల్ని త్వరలోనే ముఖాముఖిలో కలుస్తాను. మా గ్రేటెస్ట్ తీహార్ జైలుకు మీకు స్వాగతం అక్కా. మీ మరో సహోదరుడు, అవినీతి రాజు అరవింద్ కేజ్రీవాల్ జైలులో సహకరివంతమైన జీవితం అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేసే ఉంటాడు. ఈ లేఖను ముగించే ముందు చివరిగా మరొక మాట చెప్పదలుచుకున్నాను. సినిమా ఇంకా మిగిలే ఉంది. కేజ్రీవాల్ గారు.. ఇక తదుపరి మీ వంతే. ఎంత ప్రయత్నించినా మీకు ఇక సాధ్యం కాదు. సినిమా చివరి దశకు చేరుకుంది. నా సోదర సోదరీమణులకు తీహార్ జైలులోకి స్వాగతం పలుకుతున్నాననంటూ ” సుఖేష్ సంచలన విషయాలను లేఖలో ప్రస్తావించాడు.