పోలీసుల దాష్టికానికి యువకుడు మృతి!

లాక్ డౌన్ సందర్భంగా ప్రజలను ఇళ్ల నుంచి బయటకు రాకుండా చేసేందుకు పోలీసులు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. సరైన కారణం లేకుండా ఇళ్ల నుంచి రోడ్లపైకి వచ్చే వారిని నివారించేందుకు కొన్ని చోట్ల బతిమాలి చెబుతుంటే మరికొన్ని చోట్ల సున్నితంగా మండలిస్తున్నారు. కొన్నిచోట్ల కేసులు నమోదు చేసి వాహనాలను సీజ్ చేస్తున్నారు. కర్నూలలో కాల్లుపట్టుకుని బతిమాలడం అందరినీ ఆకట్టుకుంది. తాజాగా సత్తెనపల్లి పట్టణంలో జరిగిన సంఘటన వాటన్నింటికి విరుద్ధంగా ఉంది. పోలీస్ దెబ్బలకు యువకుడు మృతి చెందాడు. […]

Written By: Neelambaram, Updated On : April 20, 2020 12:06 pm
Follow us on


లాక్ డౌన్ సందర్భంగా ప్రజలను ఇళ్ల నుంచి బయటకు రాకుండా చేసేందుకు పోలీసులు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. సరైన కారణం లేకుండా ఇళ్ల నుంచి రోడ్లపైకి వచ్చే వారిని నివారించేందుకు కొన్ని చోట్ల బతిమాలి చెబుతుంటే మరికొన్ని చోట్ల సున్నితంగా మండలిస్తున్నారు. కొన్నిచోట్ల కేసులు నమోదు చేసి వాహనాలను సీజ్ చేస్తున్నారు. కర్నూలలో కాల్లుపట్టుకుని బతిమాలడం అందరినీ ఆకట్టుకుంది.

తాజాగా సత్తెనపల్లి పట్టణంలో జరిగిన సంఘటన వాటన్నింటికి విరుద్ధంగా ఉంది. పోలీస్ దెబ్బలకు యువకుడు మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే వెంకటపతి కాలనీ కి చెందిన మొహమ్మద్ గౌస్ (28) ఈ రోజు ఉదయం 8 :40 నిమిషాలకు
మందుల కోసం వెళ్లి వస్తుండగా ఘటన చెక్ పోస్టు వద్ద పోలీసులు అతనిని అడ్డుకుని ప్రశ్నించారు. అతను చెపుతున్న సమాధానం వినకుండా లాఠీతో కొట్టడంతో మొహమ్మద్ గౌస్ అక్కడికక్కడే సృహ తప్పి పడిపోయాడు. దీంతో గౌస్ ను పోలీస్ వాహనం లో హాస్పిటల్ కు తరలించగా చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు. చనిపోయిన మొహమ్మద్ గౌస్ కు పెళ్లి అయినదని, ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆసుపత్రికి చేరుకున్న గౌస్ బంధువులు ఆందోళనకు దిగారు.