https://oktelugu.com/

టోల్ గేట్ చార్జీల మోత!

లాక్ డౌన్ తో కుదేలైన ప్రజలపై కేంద్రం టోల్ పీజులు పెంచి మరింత భారం మోపింది. టోల్ పీజుల వసూళ్లు కొన్నాళ్ళు వాయిదా వేయాలని లారీ యజమానుల సంఘము కొడుతుంటే కేంద్ర ప్రభుత్వం మాత్రం ఇవేవీ పట్టించుకోకుండా టోల్ ధరలు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా ఏ వాహనానికి ఎంతమేరే చార్జీలు పెంచారనే విషయం పరిశీలిస్తే… లైట్ మోటార్, కమర్షియల్ వాహనాలపై రూ.5, బస్సు, ట్రక్ లకు రూ.10, భారీ వాహనాలకు రూ.20 చొప్పున పెంపు […]

Written By:
  • Neelambaram
  • , Updated On : April 20, 2020 12:11 pm
    Follow us on


    లాక్ డౌన్ తో కుదేలైన ప్రజలపై కేంద్రం టోల్ పీజులు పెంచి మరింత భారం మోపింది. టోల్ పీజుల వసూళ్లు కొన్నాళ్ళు వాయిదా వేయాలని లారీ యజమానుల సంఘము కొడుతుంటే కేంద్ర ప్రభుత్వం మాత్రం ఇవేవీ పట్టించుకోకుండా టోల్ ధరలు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది.

    తాజాగా ఏ వాహనానికి ఎంతమేరే చార్జీలు పెంచారనే విషయం పరిశీలిస్తే… లైట్ మోటార్, కమర్షియల్ వాహనాలపై రూ.5, బస్సు, ట్రక్ లకు రూ.10, భారీ వాహనాలకు రూ.20 చొప్పున పెంపు నేటి అర్ధరాత్రి నుంచి పెంచిన టోల్ గేట్ ఛార్జీలు అమల్లోకి రానున్నాయి. ఈ విషయాన్ని నేషనల్ హై వే అథారిటీస్ ఆఫ్ ఇండియా (ఎన్ హెచ్ఏఐ) అధికారి విద్యాసాగర్ తెలిపారు.

    ప్రతి ఏడాది ఏప్రిల్ 1నే టోల్ ఛార్జీలు పెంచడం ఆనవాయితీగా వస్తోంది. అయితే, ‘కరోనా’ కారణంగా ఈ ఏడాది టోల్ ఛార్జీల పెంపులో జాప్యం జరిగిందని నేషనల్ హై వే అథారిటీస్ ఆఫ్ ఇండియా (ఎన్ హెచ్ఏఐ) అధికారి విద్యాసాగర్ తెలిపారు. లాక్ డౌన్ లో భాగంగా రేపటి నుంచి కొన్ని సడలింపులు ఇచ్చిన నేపథ్యంలో టోల్ ప్లాజాల వద్ద వాహనాలను అనుమతిస్తామని చెప్పారు.

    ప్రస్తుతానికి సరుకు రవాణా వాహనాలు మినహా ఇతర ప్రజా రవాణా వాహనాలకు కేంద్రం అనుమతి ఇవ్వలేదు. వ్యక్తిగత వాహనాలకు స్థానికంగా తప్పితే ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు అనుమతి లేదు. రెండవ విడత లాక్ డౌన్ మే 3వ తేదీతో ముగుస్తున్నప్పటికీ మరికొన్ని రోజులు ప్రజా రవాణాపై ఆంక్షలు కొనసాగించాలనే కేంద్రం భావిస్తున్నట్లు తెలుస్తోంది.