నమ్మిన బంటు సువేందు మోసం చేసి బీజేపీలో చేరిపోయాడు. అతడిపై ప్రతీకారం తీర్చుకుందని బెంగాల్ సీఎం మమత బెనర్జీ తన సొంత నియోజకవర్గం భవానీపూర్ ను వదిలేసి నందిగ్రామ్ నుంచి బరిలోకి దిగింది. సువేందును ఓడించాలని పంతం పట్టింది. అయితే చివరకు అవమానకరీతిలో మమత బెనర్జీ ఓడిపోయినట్టు సమాచారం.
నందిగ్రామ్ లో బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అతి కష్టం మీద గెలిచిందని… బీజేపీ అభ్యర్థి సువేందుకు అధికారిపై కేవలం 1200 ఓట్ల స్వల్ప మెజార్టీతో గెలుపొందిందని మొదట జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి.
మొదటి రౌండ్ నుంచి సువేందు అధికారి బెంగాల్ సీఎం మమతపై ఆధిక్యత కనబరిచారు. చివరకు ఒకానొక రౌండ్ లో 9వేల మెజార్టీ సాధించారు. ఇంకో రౌండ్ లో కేవలం 6 ఓట్ల మెజార్టీ పొందాడు. కానీ చివరకు ఆద్యంతం రసవత్తరంగా సాగిన నందిగ్రామ్ పోరులో తన సమీప భాజపా అభ్యర్థి సువేందు అధికారి 1622 ఓట్ల తేడాతో దీదీపై గెలుపొందారని సమాచారం.
అయితే దీనిపై సుప్రీంకోర్టుకు వెళ్తానని మమతా బెనర్జీ స్పష్టం చేశారు. ఈసీ బీజేపీ ప్రతినిధిలా పనిచేస్తోందని మండిపడ్డారు. నందిగ్రామ్ లో ఓడినా.. రాష్ట్రంలో 221 కు పైగా సీట్లు సాధించామని చెప్పారు. అయితే ఇంకా కౌంటింగ్ అయిపోలేదని.. కొనసాగుతుందని టీఎంసీ తెలిపింది.
2016 బెంగాల్ ఎన్నికల్లో దాదాపు 81 వేల ఓట్ల తేడాతో విజయం సాధించిన సువేందు సీఎం మమత కేబినెట్ లో మంత్రిగా చేరి కీలక బాధ్యతలు చూశారు. అయితే మమతకు వెన్నుపోటు పొడిచి బీజేపీలో చేరాడు. సువేందుకు నందిగ్రామ్ సహా 45 నియోజకవర్గాల్లో మంచి ప్రాబల్యం ఉంది. దీంతో అతడిని ఓడించాలని పంతం పట్టిన మమత చివరకు ఎలాగోలా గెలిచి గట్టేక్కారు.