https://oktelugu.com/

తన పెళ్లి విషయంలో ఫీల్ అవుతోన్న హీరో !

హీరోలు పెళ్లిళ్లు ఎలా జరగాలి, వేలమంది అభిమానుల రాకతో సినీ ప్రముఖుల దీవెనలతో అంగరంగ వైభవంగా జరగాలి. కొంతమంది బాలీవుడ్ స్టార్స్ అయితే విమానాలు కట్టించుకొని చక్కగా విదేశాలలో ఓ ప్రముఖ ప్యాలెస్ చేసుకుని, అక్కడే తమ పెళ్లిని గ్రాండ్ గా చేసుకుంటారు. పైగా దానికి డెస్టినేషన్ వెడ్డింగ్ అని పేరు కూడా పెట్టుకున్నారు. ఏది ఏమైనా సినిమా తారలు పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు ఎంతో ఆర్భాటం ఉంటుంది. కానీ ఎవరో ఎల్లయ్య పుల్లయ్య పెళ్లి చేసుకున్నట్టు, ఇప్పుడు […]

Written By:
  • admin
  • , Updated On : May 2, 2021 / 05:02 PM IST
    Follow us on

    హీరోలు పెళ్లిళ్లు ఎలా జరగాలి, వేలమంది అభిమానుల రాకతో సినీ ప్రముఖుల దీవెనలతో అంగరంగ వైభవంగా జరగాలి. కొంతమంది బాలీవుడ్ స్టార్స్ అయితే విమానాలు కట్టించుకొని చక్కగా విదేశాలలో ఓ ప్రముఖ ప్యాలెస్ చేసుకుని, అక్కడే తమ పెళ్లిని గ్రాండ్ గా చేసుకుంటారు. పైగా దానికి డెస్టినేషన్ వెడ్డింగ్ అని పేరు కూడా పెట్టుకున్నారు. ఏది ఏమైనా సినిమా తారలు పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు ఎంతో ఆర్భాటం ఉంటుంది.

    కానీ ఎవరో ఎల్లయ్య పుల్లయ్య పెళ్లి చేసుకున్నట్టు, ఇప్పుడు హీరోలు కూడా పెళ్లి చేసుకోవాల్సి వస్తోంది. తమ పెళ్లికి ఏకంగా స్వర్గాన్ని కిందికి దించేయాలి అని హీరోలు కన్న ఎన్నో కలలను.. కరోనా కాటు వేసేసింది. తమ పెళ్లి ప్రజలంతా గొప్పగా మాట్లాడుకునేలా ఉండాలనుకున్న వాళ్ళు కూడా ఇప్పుడు సైలెంట్ పెళ్ళికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నారు. ప్రస్తుతానికి పెళ్లిళ్లన్నీ ఇలాగే జరుగుతున్నాయి.

    పెళ్లిల తంతంగం అనేది కరోనాకు ముందు, కరోనా తర్వాత అన్నట్టు తయారైంది. సెలబ్రిటీలు, స్టార్లు సైతం తమ పెళ్లిని, ఓ సాధారణ వ్యక్తులు చేసుకునే విధంగానే చేసుకోవాల్సి వస్తోంది. గత ఏడాది లాక్ డౌన్ లో పెళ్లి చేసుకున్న హీరో నిఖిల్, చిన్నప్పటి నుండి ఒక కల కన్నాడట. తానూ గొప్ప ఆర్భాటంగా పెళ్లి చేసుకోవాలని.. తన పెళ్ళికి ఇటు సినీ ప్రముఖులతో పాటు అటు రాజకీయ ప్రముఖులను ఆహ్వానించాలని,

    పైగా తన ఇంటి ముందు ఆకాశమంత పందిరి వేసి, మూడు రోజుల పెళ్లిని ఫాలో అవుతూ మొత్తానికి తన పెళ్లిని ధూమ్ ధామ్ గా చేసుకోవాలనుకున్నాడట. కానీ బ్యాడ్ లక్, కరోనా దెబ్బకు ఓ ఫామ్ హౌస్ లో సింపుల్ గా ముగించాల్సి వచ్చింది. ఇప్పుడు హీరో శర్వానంద్ కూడా తన పెళ్లిని ఇలాగే ముగించాల్సి వస్తోందని తెగ ఫీల్ అవుతున్నాడు.

    ఎప్పటినుండో తానూ ప్లాన్ చేసుకున్న డెస్టినేషన్ వెడ్డింగ్ పోయి.. చివరకు అతి సాధారణంగా పెళ్లి చేసుకోవాల్సి రావడం శర్వాని బాధ పెడుతుందట. ఇంతకీ శర్వానంద్ ఎవర్ని పెళ్ళి చేసుకోబోతున్నాడో త్వరలోనే తెలియనుంది.