
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో యావత్ దృష్టిని ఆకర్షించిన నందిగ్రామ్ నియోజకవర్గంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఓడిపోయారు. ఆద్యంతం రసవత్తరంగా సాగిన ఈ పోరులో తన సమీప ప్రత్యర్థి భాజపా అభ్యర్థి సువేందు అధికారి 1622 ఓట్ల తేడాతో దీదీపై గెలుపొందారు.
ఆది నుంచి వీరిద్దరి మధ్య విజయం దోబూచులాడింది. తొలి రౌండ్లలో భాజపా అభ్యర్థి సువేందు అధికారి ఆధిక్యంలో దూసుకెళ్లారు. ఒక దశలో సువేందు 9వేల పైచిలుకు ఓట్ల ముందంజలు కొనసాగారు. అయితే తొలుత మమత గెలిచిందని వార్తలు వచ్చాయి. అయితే ఈసీ మాత్రం తాజాగా సువేందు గెలిచాడని ప్రకటించింది.
అయితే పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం మమత బెనర్జీ పార్టీ క్లియర్ కట్ విజయాన్ని సాధించింది. టీఎంసీ అభ్యర్థులు 216 స్థానాల్లో విజయం సాధించారు. ఇక బీజేపీ 73 స్థానాల్లో గెలుపొందారు. సీపీఎం 1 స్థానంలో ఇతరులు 2 స్థానాల్లో గెలుపొందారు.