Mamata Banerjee: పశ్చిమ బెంగాల్లో తిరుగులేని నేతగా ఎదిగారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతాబెనర్జీ. కమ్యూనిస్టుల కంచుకోటను 15 ఏళ్లక్రితం బద్దలు కొట్టి అధికారం చేపట్టారు. వరుసగా మూడుసార్లు ఎన్నికయ్యారు. అయితే ప్రతీ ఎన్నికల్లో మమతాబెనర్జీ పార్టీకి బెంగాల్‌లోని ముస్లింలు అండగా నిలిచారు. దీంతో మమతా కూడా సహజంగానే ఇంతకాలం వారికి అనుకూలంగా వ్యవహరించారు. అయితే ముస్లింలో ముజారిటీ ప్రజలు బంగ్లాదేశ్, మయన్మార్ నుంచి వలస వచ్చినవారే. అయినా వారిని మమతా పెంచి పోషించారు. అయితే తాజాగా ముర్షీదాబాద్‌లో తృణమూల్ ఎమ్మెల్యే హుమాయూన్ కబీర్ బాబ్రీ మసీదు నిర్మాణానికి ముందుకొచ్చి పార్టీకి సవాలు విసిరాడు. స్థానికులు భారీగా విరాళాలు, సామగ్రి సమర్పించడంతో విషయం విస్తరించింది. మమతా బెనర్జీ వెంటనే ఆయన్ను పార్టీ నుంచి తొలగించి డామేజ్ కంట్రోల్ చేస్తూ తీవ్ర చర్య తీసుకున్నారు. దీంతో హిందువుల్లో సానుభూతి పెరిగింది.
బాబ్రీ మసీదు కూల్చివేతకు వ్యతిరేకంగా ర్యాలీ..
అయితే బాబ్రీ కూల్చివేతకు వ్యతిరేకంగా ముస్లిం సమాజం నిరసనలకు మమతాబెనర్జీ అనుమతి ఇచ్చారు. ఇది వ్యూహాన్ని సంక్లిష్టం చేసింది. ఒకవైపు మసీదు నిర్మాణాన్ని అడ్డుకుని హిందువులకు అనుకూలంగా వ్యవరించి.. మైనారిటీలకు వ్యతిరేకమయ్యారు. ఇదే సమయంలో బాబ్రీ కూల్చివేత వ్యతిరేక ర్యాలీకి అనుమతి ఇచ్చి.. హిందువుల్లో ఉన్న సానుభూతి పోగొట్టుకున్నారు.
మమతకు పొచ్చి ఉన్న కూటమి ప్రమాదం
ఎంఐఎంతోపాటు బెంగ్లాలోని మతగురువుల మద్దతులో ఎంఐఎం వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తే ముస్లిం ఓట్లు విభజనకు దారితీస్తాయని మమతా ఆందోళన చెందుతున్నారు. తాను పెంచిన నేతలు మతోన్మాద రూపం తీసుకుంటే పార్టీ ఆధిపత్యం దెబ్బతింటుంది. వచ్చే ఎన్నికల్లో ఈ సంఘటనలు ప్రభావం చూపి కూటమి అధికారాన్ని బెంగాల్లో ఇబ్బంది పెట్టవచ్చు.
మమతా బెనర్జీ పరిస్థితి ఇప్పుడు కుడితిలో పడిన ఎలక చందంగా మారింది. పార్టీ అంతర్గత ఘర్షణలు, మత రాజకీయాల సంక్లిష్టతను తెలియజేస్తోంది. మైనారిటీ మద్దతును కాపాడుకుంటూ మెజారిటీ సానుభూతిని కోల్పోకుండా సమతుల్యత అవసరం. ఈ వివాదం తృణమూల్ భవిష్యత్ వ్యూహాలను పునఃపరిశీలించేలా చేస్తుంది.