Bigg Boss 9 Telugu Emmanuel: ఈ సీజన్ బిగ్ బాస్(Bigg Boss 9 Telugu) షోలో ప్రతీ వారం ఊహించని సంఘటనలే జరుగుతూ వస్తున్నాయి. అయితే ఇన్ని వారాలు జరిగింది పక్కన పెడితే, ఈ వారం జరగబోయేది ఆడియన్స్ కి ఫ్యూజులు ఎగిరిపోయే రేంజ్ లో ఉండబోతుంది. ఎందుకంటే ఈ 13 వారాలు హౌస్ లో వీక్ అనిపించుకున్న కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అవుతూ వచ్చారు. ఇప్పుడు కేవలం హౌస్ లో 7 మంది మాత్రమే మిగిలారు. ఈ 7 మంది కూడా మంచి స్ట్రాంగ్ కంటెస్టెంట్స్. ఎవరు ఎలిమినేట్ అయినా అన్యాయం అనే అనిపిస్తుంది. ముఖ్యంగా ఇమ్మానుయేల్ లాంటి కంటెస్టెంట్ ఎలిమినేట్ అయితే ఆడియన్స్ రియాక్షన్ ఎలా ఉంటుందో ఊహించుకోండి?..ఈ సీజన్ ఇంత పెద్ద హిట్ అవ్వడానికి ప్రధాన కారణాల లిస్ట్ తీస్తే అందులో ఇమ్మానుయేల్ మొదటి స్థానం లో ఉంటాడు. ఎంటర్టైన్మెంట్ అందించడం లో, తోటి కంటెస్టెంట్స్ తో ప్రవర్తించే విధానం లో, టాస్కులు ఆడే విషయంలో, ఇలా ప్రతీ దాంట్లో ఆయన ఆల్ రౌండర్ అనిపించుకున్నాడు.
ఆయనలో ఉన్న మైనస్సులు ఏమిటంటే ఎవరితోనూ గొడవలు పెట్టుకోకపోవడం. తన తర్వాతే ఎవరైనా అని బంధాలను కూడా పట్టించుకోని విధానం, సేఫ్ గేమ్ ప్లేయర్ అనే ముద్ర. ఈ మూడు లక్షణాలే ఆయన్ని టైటిల్ విన్నింగ్ రేస్ నుండి దూరం చేసి టాప్ 3 స్థానానికి పరిమితం చేసింది. అయితే ఈ వారం ఆయనకు మాత్రమే కాదు, పవన్ కళ్యాణ్ కి తప్ప మిగిలిన కంటెస్టెంట్స్ అందరికీ డేంజర్ వారం అనే చెప్పాలి. ఎందుకంటే ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుంది. ఒక కంటెస్టెంట్ ని ఇమ్మ్యూనిటి టాస్కుల్లో తక్కువ పాయింట్స్ వచ్చిన వారిని ఎలిమినేట్ చేస్తారు. మరో కంటెస్టెంట్ ని ఆడియన్స్ ఓటింగ్ ద్వారా తొలగిస్తారు. నిన్నటి ఎపిసోడ్ లో ఇమ్మానుయేల్ టాప్ పాయింట్స్ తో నెంబర్ 1 స్థానం లో నిల్చిన సంగతి తెలిసిందే.
డేంజర్ జోన్ లో సంజన ఉన్నింది. ఇక నేటి ఎపిసోడ్ లో టెలికాస్ట్ అయ్యే టాస్కుల్లో సంజన ఇమ్మ్యూనిటీ టాస్క్ నుండి పూర్తిగా తప్పుకుంది. అదే విధంగా ఇమ్మానుయేల్ రెండు టాస్కుల్లోనూ ఓడిపోగా, భరణి, తనూజ లు గెలుస్తారు. భరణి అందరికంటే ఎక్కువ పాయింట్స్ తో నెంబర్ 1 స్థానం లో నిలబడగా, తనూజ రెండవ స్థానం లో నిలుస్తుంది. ఇమ్మానుయేల్ మరియు డిమోన్ పవన్ లు సరిసమానమైన పాయింట్స్ తో చివరి స్థానం లో ఉన్నారు. అయితే ఇప్పుడు వీళ్లిద్దరు డేంజర్ జోన్ లో ఉన్నట్టే. మిడ్ వీక్ ఎలిమినేషన్ లో భాగంగా గురువారం రోజున సెన్సేషనల్ టీఆర్ఫీ ఎపిసోడ్ కోసం ప్లాన్ చేస్తుందట బిగ్ బాస్ టీం. అంటే పొరపాటున ఇమ్మానుయేల్ ని ఎలిమినేట్ చేస్తారా ఏంటి? అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ వారం ఏదైనా జరగొచ్చు, బిగ్ బాస్ లవర్స్ గుండెలను అరచేతిలో పెట్టుకొని ఉండండి.